Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆలివ్ ఆయిల్ అందానికి ఆరోగ్యానికి ఎలా ఉపయోగపడుతుంది?

ఆలివ్ ఆయిల్ అందానికి ఆరోగ్యానికి ఎలా ఉపయోగపడుతుంది?
, శుక్రవారం, 13 జనవరి 2023 (20:20 IST)
ఆలివ్ ఆయిల్. పచ్చి ఆలివ్ నూనె చాలా ఆరోగ్యకరమైనది. దాని శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్ల కారణంగా గుండె, మెదడు, కీళ్ళు తదితర అవయవాలకు మేలు చేస్తుంది. ఆలివ్ ఆయిల్ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము.
 
ఆలివ్‌ ఆయిల్‌తో తేనెను కలిపి ముఖానికి రాసి, కొంతసేపయిన తరువాత ముఖాన్ని మెత్తని సున్నిపిండితో రుద్దుకుని కడుక్కుంటే ముఖవర్ఛస్సు పెరుగుతుంది.
 
పిల్లలకు స్నానం చేయించబోయే ముందు ఆలివ్‌ఆయిల్‌ను ఒంటికి పట్టించి, మృదువుగా మర్దనా చేసి, మెత్తని సెనగపిండితో రుద్ది స్నానం చేయిస్తే పిల్లల లేతచర్మం ఎంతో కాంతిగా వుంటుంది.
 
ఆలివ్‌ఆయిల్‌లో తాజా గులాబీపూల రసాన్ని కలిపి పెదాలకు రాస్తుంటే, పెదాలు పగలవు, మంచిరంగుతో ఆకర్షణీయంగా కనిపిస్తాయి.
 
ఆలివ్‌ ఆయిల్‌ను వేడి చేసి, వెంట్రుకల కుదుళ్ళకు పట్టించి, పది పదిహేను నిమిషాల తర్వాత తలస్నానం చేసినట్లయితే, జుట్టు రాలిపోకుండా వుంటుంది.
 
ఆలివ్ ఆయిల్‌లో వెల్లుల్లి పొట్టును కాల్చిన పొడిని కలిపి కాచి తలకు రాసుకుంటే జుట్టు నల్లబడటమే కాకుండా త్వరగా జుట్టు నెరవదు.
 
పొడిచర్మం ఉన్నవారు ఆలివ్‌ఆయిల్‌లో నిమ్మరసాన్ని కలిపి ముఖానికి రాస్తూంటే ముఖ చర్మం తేమగా ఉండి కాంతిగా మృదువుగానూ మారుతుంది.
 
ఆలివ్ ఆయిల్ గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది, గుండె ధమనుల పనితీరుకు అడ్డంకిగా మారే కొవ్వును తొలగించి ధమనులలో రక్తప్రసరణలను మరింతగా పెంచుతుంది.
 
ఆలివ్ ఆయిల్‌లో ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు శరీరంలో మంచి కొలెస్ట్రాల్‌ను పెంపొందింపజేస్తాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వైరస్ తో పోరాడే ఇంగువ.. ఒబిసిటీ పరార్