Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అందమైన ముఖారవిందం కోసం బొప్పాయి, దోసకాయ, ఆలివ్ ఆయిల్

Advertiesment
Papaya seeds
, బుధవారం, 10 ఆగస్టు 2022 (23:23 IST)
బొప్పాయిలో ఉండే పాపైన్ అనే ఎంజైమ్ చర్మంపై నేరుగా చికిత్స చేసినప్పుడు చర్మం రికవరీ చేస్తుంది. కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతుంది. బొప్పాయిని వివిధ చికిత్సలలో ఉపయోగిస్తుంటారు. విటమిన్ ఎ, పాపైన్ ఉండటం వల్ల చర్మాన్ని పోషణ, హైడ్రేట్ చేయడంలో సహాయపడుతుంది. బొప్పాయి గుజ్జును ఒక గిన్నెలో తీసుకుని అందులో తేనె వేసి, ఆపై దానిని చేతులతో సున్నితంగా ముఖంపై ఐదు నిమిషాల పాటు రుద్దండి. మొదట పాలు, ఆ తర్వాత మంచినీటితో కడిగి చూడండి చర్మం కాంతులీనుతుంది.

 
దోసకాయ సున్నితమైన, మొటిమలకు గురయ్యే చర్మం ఉన్నవారికి చాలా సహాయపడుతుంది. దోసకాయ నీటిని ఫేస్ మాస్క్‌గా అప్లై చేయవచ్చు. దోస ముక్కలను కళ్ళపై ఉంచవచ్చు. చర్మం మెరుపును పెంచడానికి చర్మంపై రుద్దవచ్చు. దోసకాయ తురుముకి ఒక చెంచా పెరుగు వేసి బాగా కలియబెట్టాలి. దీనిని 5 నిమిషాలు అలాగే ఉంచి తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.

 
ఆలివ్ నూనె A, D, E, K విటమిన్లకు అద్భుతమైన మూలం. ఆలివ్ నూనె మాయిశ్చరైజర్‌గా సహాయపడుతుంది. చర్మానికి సహజమైన మెరుపును అందిస్తుంది. ఇది చర్మాన్ని ఫ్రీ రాడికల్స్ నుండి రక్షిస్తుంది. ఆలివ్ ఆయిల్ కొన్ని చుక్కలు తీసుకుని చర్మంపై అప్లై చేయండి. సున్నితంగా మసాజ్ చేసి, మూడు నుండి ఐదు నిమిషాలు అలాగే ఉంచండి, ఆపై గోరువెచ్చని నీటిలో టవల్‌ను ముంచి ముఖం మీద 30 నుంచి 40 సెకన్ల పాటు ఉంచండి. ఆ తర్వాత చూసుకోండి, నిగారింపు సొంతమవుతుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ సందర్భంగా విజయవాడ మణిపాల్‌ హాస్పిటల్స్‌ ప్రత్యేకంగా హార్ట్‌ కేర్‌ ప్యాకేజ్‌లు