Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

04-05-2025 నుంచి 10-05-2025 వరకు ఫలితాలు - శ్రమిస్తేనే కార్యం నెరవేరుతుంది...

Advertiesment
weekly astrology

రామన్

, శనివారం, 3 మే 2025 (22:18 IST)
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
ధృఢసంకల్పంతో యత్నాలు సాగించండి, పట్టుదలతో శ్రమిస్తేనే కార్యం నెరవేరుతుంది. ప్రతి విషయంలోనూ ఏకాగ్రత వహించండి. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. ఊహించని ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి. అవసరాలు, చెల్లింపులు వాయిదా వేసుకుంటారు. సోమవారం నాడు పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. మీ సామర్థ్యంపై నమ్మకం పెంచుకోండి. అవకాశాలు చేజారినా నిరుత్సాహపడవద్దు. ఆత్మీయులతో సంభాషణ ఉపశమనం కలిగిస్తుంది. కొత్త విషయాలు తెలుసుకుంటారు. సంతానం విజయం ఉత్సాహాన్నిస్తుంది. కీలక పత్రాలు అందుకుంటారు. వ్యాపారాభివృద్ధికి మరింత శ్రమించాలి. పెద్దమొత్తం సరుకు నిల్వలో జాగ్రత్త. ఉపాధ్యాయులకు స్థానచలనం. ఉద్యోగస్తుల కార్యక్రమాలు సామాన్యంగా సాగుతాయి. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడవద్దు. 
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
కార్యసాధనకు ఓర్పు ప్రధానం. దృఢసంకల్పంతో అడుగు ముందుకేయండి. ఎవరి సాయం ఆశించవద్దు. అవకాశం చేజారినా ఒకందుకు మంచిదే. అపజయం మీలో పట్టుదలను రేకెత్తిస్తుంది. వ్యూహాత్మకంగా వ్యవహరిస్తారు. ఆదాయం ఫర్వాలేదనిపిస్తుంది. ఖర్చులు తగ్గించుకుంటారు. పెట్టుబడులకు తరుణం కాదు. దంపతుల మధ్య ఏకాభిప్రాయం నెలకొంటుంది. సంతానం ఉన్నత చదువులపై దృష్టిసారిస్తారు. గురువారం నాడు ఊహించని సంఘటన ఎదురవుతుంది. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. ఆప్తుల జోక్యంతో వివాదం సద్దుమణుగుతుంది. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగ బాధ్యతలపై శ్రద్ధ వహించండి. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. వృత్తి ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. ఏకాగ్రతతో వాహనం నడపండి. 
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
మీదైన రంగంలో ఒత్తిడికి గురికావద్దు. స్థిమితంగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. కీలక వ్యవహారంలో పెద్దల సలహా పాటించండి. ఆదాయం బాగుంటుంది. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. మంగళవారం నాడు నగదు డ్రా చేసేటపుడు జాగ్రత్త. పనులు చురుకుగా సాగుతాయి. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం కుదిరే సూచనలున్నాయి. అవతలి వారి స్తోమతను క్షుణ్ణంగా తెలుసుకోండి. ఆహ్వానం అందుకుంటారు. బంధుమిత్రులతో తెగిపోయిన సంబంధాలు బలపడతాయి. ఇంటి విషయాలపై శ్రద్ధవహిస్తారు. వ్యాపారాల్లో ఆటుపోట్లను తట్టుకుంటారు. హోల్సేల్ వ్యాపారులకు ఆశాజనకం. ఉద్యోగ బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తారు. ఉన్నతాధికారులకు హోదా మార్పు. న్యాయ, వైద్య రంగాల వారికి ఆదాయాభివృద్ధి. పుణ్యకార్యంలో పాల్గొంటారు. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
విశేష ఫలితాలున్నాయి. సమర్ధతను చాటుకుంటారు. అభీష్టం నెరవేరుతుంది. కొత్త పరిచయాలు, బంధుత్వాలు బలపడతాయి. ప్రశంసలు, పురస్కారాలు అందుకుంటారు. కీలక వ్యవహారంలో ఏకాగ్రతను కోల్పోవద్దు. ప్రతి విషయాలోను ఆచితూచి అడుగేయండి, పొగిడే వ్యక్తులతో జాగ్రత్త. ఖర్చులు అదుపులో ఉండవు. ఆర్భాటాలకు విపరీతంగా వ్యయం చేస్తారు. ఆదివారం నాడు పనులు మందకొడిగా సాగుతాయి. ఆప్తులకు సాయం అందిస్తారు. సంతానం విదేశీ విద్యాయత్నం ఫలిస్తుంది. అయిన వారితో ఉల్లాసంగా గడుపుతారు. కనిపించకుండా పోయిన పత్రాలు. వస్తువులు లభ్యమవుతాయి. ఉపాధ్యాయులకు బదిలీతో కూడిన పదోన్నతి. ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. వేడుకలో అందరినీ ఆకట్టుకుంటారు. 
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
ఆర్ధికలావాదేవీలు సంతృప్తినిస్తాయి. సకాలంలో రావలసిన ధనం అందుతుంది. ఖర్చులు అధికం. ప్రణాళికాబద్ధంగా పనులు పూర్తిచేస్తారు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. బుధవారం నాడు అవగాహన లేని విషయాల్లో జోక్యం తగదు. మీ గౌరవానికి భంగం కలుగకుండా మెలగండి. సంతానం ఉన్నత చదువులపై దృష్టిపెడతారు. ప్రకటనలు, దళారులను నమ్మవద్దు. అవివాహితుల ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. ఒక సమాచారం నిరుత్సాహపరుస్తుంది. ఓర్పు, పట్టుదలతో యత్నాలు సాగించండి. అవకాశాలు చేజారినా నిరుత్సాహపడవద్దు. మీ కృషి త్వరలో ఫలిస్తుంది. దూరపు బంధువుల నుంచి ఆహ్వానం అందుకుంటారు. దంపతుల మధ్య ఏకాభిప్రాయం నెలకొంటుంది. వ్యాపారాలు పురోగతిన సాగుతాయి. ఉద్యోగస్తులకు పనియందు ధ్యాస ప్రధానం. ఉపాధ్యాయులు, అధికారులకు కొత్త సమస్యలెదురవుతాయి. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
పరిస్థితులు అనుకూలిస్తాయి. చాకచక్యంగా అడుగులేస్తారు. మీ నమ్మకం వమ్ముకాదు. లక్ష్యసాధనకు చేరువవుతారు. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలేర్పడతాయి. సావకాశంగా పనులు పూర్తిచేస్తారు. ఖర్చులు అదుపులో ఉండవు. ఒక అవసరానికి ఉంచిన ధనం మరోదానికి ఖర్చుచేస్తారు. శుక్ర, శనివారాల్లో అప్రమత్తంగా ఉండాలి. మీ ఆలోచనలను నీరుగార్చేందుకు కొంతమంది యత్నిస్తారు. ఏ విషయాన్నీ పెద్దగా పట్టించుకోవద్దు. వాస్తుదోష నివారణ చర్చలు చేపడతారు. విలువైన వస్తువులు జాగ్రత్త. మీ సాయంతో ఒకరికి మంచి జరుగుతుంది. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. వ్యాపారాల్లో ఆటంకాలు తొలగుతాయి. గృహనిర్మాణం పూర్తికావస్తుంది. శుభకార్యానికి సన్నాహాలు సాగిస్తారు. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
ఈ వారం లాభదాయక ఫలితాలున్నాయి. అవకాశాలను చేజిక్కించుకుంటారు. గౌరవ ప్రతిష్టలు పెంపొందుతాయి. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. ఊహించిన ఖర్చులే ఉంటాయి. ధనవ్యయంలో మితం పాటించండి. పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. శుభకార్యం నిశ్చయమవుతుంది. దూరపు బంధుత్వాలు బలపడతాయి. గృహాలంకరణ వస్తువులు కొనుగోలు చేస్తారు. పత్రాలు, రశీదులు జాగ్రత్త. ఆరోగ్యం పట్ల మరింత శ్రద్ధ వహించండి. పత్రాల్లో సవరణలు సాధ్యమవుతాయి. దంపతుల మధ్య స్వల్ప కలహం. సామరస్యంగా మెలగండి. ఏ విషయాన్నీ పెద్దది చేసుకోవద్దు. ఆత్మీయులతో సంభాషణ ఊరటనిస్తుంది. ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. ఉపాధ్యాయులకు స్థానచలనం అనివార్యం. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. పత్రాల రెన్యువల్న అలక్ష్యం చేయవద్దు. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
అన్ని రంగాల వారికీ కలిసొచ్చే సమయం. మీ తప్పిదాలు సరిదిద్దుకునే అవకాశం లభిస్తుంది. పెద్దల సాయంతో ఒక సమస్య నుంచి గట్టెక్కుతారు. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. పెట్టుబడులు కలిసిరావు. చేపట్టిన పనులు మధ్యలో నిలిపివేయొద్దు. ఆత్మీయుల ఆహ్వానం సంతోషం కలిగిస్తుంది. ఇంటి విషయాలు పట్టించుకుంటారు. సోదరుల మధ్య అవగాహన నెలకొంటుంది. గృహనిర్మాణాలకు ఆమోదం లభిస్తుంది. ఆరోగ్యం జాగ్రత్త. ఆహార నియమాలు సమయానుకూలంగా పాటించండి. సంతానం విద్యాయత్నం ఫలిస్తుంది. సన్నిహితులతో తరచుగా సంభాషిస్తారు. వేడుకకు హాజరవుతారు. మీ బలహీనతలు అదుపులో ఉంచుకోండి. 
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
సంతోషకరమైన వార్త వింటారు. కష్టం ఫలిస్తుంది. అవకాశాలు కలిసివస్తాయి. ప్రణాళికలు వేసుకుంటారు, ఖర్చులు విపరీతం. డబ్బుకు ఇబ్బంది ఉండదు. శుభకార్యానికి సన్నాహాలు సాగిస్తారు. పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. సోమవారం నాడు కొత్త వ్యక్తులతో జాగ్రత్త. వాగ్వాదాలకు దిగవద్దు. అందరితోను మితంగా మాట్లాడండి. కొంతమంది మీ వ్యాఖ్యలను తప్పుపడతారు. ప్రముఖుల జోక్యంతో సమస్య సద్దుమణుగుతుంది. సంతానం ఉన్నత చదువులపై దృష్టిపెడతారు. దంపతుల మధ్య ఏకాభిప్రాయం నెలకొంటుంది. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం కలిసివచ్చే సూచనలున్నాయి. మీ అభిప్రాయాలను నిక్కచ్చిగా తెలియజేయండి. వ్యాపారాలు జోరుగా సాగుతాయి. ఉద్యోగ బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తారు. ఏకాగ్రతతో వాహనం నడపండి. 
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
గ్రహాల సంచారం బాగుంది. మనోధైర్యంతో అడుగు ముందుకేయండి. కుటుంబీకుల నుంచి ప్రోత్సాహం ఉంటుంది. రావలసిన ధనం అందుతుంది. ఆర్భాటాలకు విపరీతంగా ఖర్చుచేస్తారు. ఆదివారం నాడు బంధువుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. దంపతులు మధ్య స్వల్ప కలహం. సామరస్యంగా మెలగండి. పట్టుదలకు పోయి ఇబ్బందులు తెచ్చుకోవద్దు. ఆప్తులతో సంభాషణ ఉపశమనం కలిగిస్తుంది. గృహమరమ్మతులు చేపడతారు. వాహనం, విలువైన వస్తువులు జాగ్రత్త. ఒక సమాచారం ఆందోళన కలిగిస్తుంది. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. ప్రైవేట్ ఉపాధ్యాయులకు ఒత్తిడి, పనిభారం. ఉద్యోగస్తులు అప్రమత్తంగా ఉండాలి. ప్రలోభాలకు లొంగవద్దు. వ్యాపారాభివృద్ధికి మరింత శ్రమించాలి. పెద్దమొత్తం సరుకు నిల్వలో జాగ్రత్త. వృత్తి, ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
ఆటుపోట్లను ధైర్యంగా ఎదుర్కుంటారు. కొందరి వ్యాఖ్యలు ఉత్తేజపరుస్తాయి. కార్యదీక్షతో లక్ష్మాన్ని సాధిస్తారు. ఆదాయం బాగుంటుంది. పొదుపు పథకాలపై దృష్టిపెడతారు. ధనసహాయం తగదు. మీ అభిప్రాయాలను సున్నితంగా తెలియజేయండి. చేస్తున్న పనులు మధ్యలో నిలిపివేయొద్దు. మంగళవారం నాడు అనవసర జోక్యం తగదు. మీ వ్యక్తిత్వానికి భంగం కలుగుండా మెలగండి. ఆర్థిక లావీదేవీల్లో ఏకాగ్రత వహించండి. అనాలోచిత నిర్ణయం తగదు. పెద్దల సలహా తీసుకోండి. మీ శ్రీమతి విషయంలో దాపరికం తగదు. చిన్నపాటి ఒత్తిళ్లున్నా ధైర్యంగా ఉండండి. పరిస్థితులు నిదానంగా చక్కబడతాయి. నూతన వ్యాపారాలు చేపడతారు. హోల్‌సేల్ వ్యాపారులకు కష్టసమయం. ఉద్యోగస్తులకు పదోన్నతి. అధికారులకు స్థానచలనం. ప్రయాణం ప్రశాంతంగా సాగుతుంది. 
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
కార్యసిద్ధి, వ్యవహార జయం ఉన్నాయి. ఓర్పుతో కష్టించి మంచి ఫలితం సాధిస్తారు. ఆర్థికంగా ఫర్వాలేదనిపిస్తుంది. వృధా ఖర్చులు తగ్గించుకుంటారు. గృహంలో ప్రశాంతత నెలకొంటుంది. ఆత్మీయులతో తరచుగా సంభాషిస్తారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు సానుకూలమవుతాయి. మీ చొరవతో ఒక సమస్య సానుకూలమవుతుంది. గురువారం నాడు ఊహించని సంఘటనలు ఎదురవుతుంది. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. దూరపు బంధువుల ఆహ్వానం సంతోషం కలిగిస్తుంది. సంతానానికి ఉన్నత విద్యావకాశం లభిస్తుంది. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. వ్యాపారాల్లో గణనీయమైన పురోభివృద్ధి సాధిస్తారు. ఉమ్మడిగా కంటే సొంత వ్యాపారాలే శ్రేయస్కరం. నిరుద్యోగులకు శుభయోగం. ఉద్యోగ బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తారు. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Jupiter Transit 2025: మే 14వ తేదీన గురు పరివర్తనం- కన్యారాశికి 75 శాతం సంతోషం-80 శాతం ఆదాయం