Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Weekly Horoscope: ఏప్రిల్ 27 నుంచి మే 3వరకు: ఈ వారం ఏ రాశులకు లాభం.. ఏ రాశులకు నష్టం

Advertiesment
Weekly Horoscope

రామన్

, ఆదివారం, 27 ఏప్రియల్ 2025 (10:08 IST)
Weekly Horoscope
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
కార్యానుకూలత ఉంది. ప్రయత్నపూర్వకంగా అవకాశాలు కలిసివస్తాయి. పట్టుదలతో శ్రమించి లక్ష్యం సాధిస్తారు. పనులు వేగవంతమవుతాయి. ఆదాయానికి తగ్గట్టుగా లెక్కలేసుకుంటారు. ఖర్చులు అధికం, సంతృప్తికరం. పెట్టుబడుల విషయం పునరాలోచించండి. తొందరపాటు చర్యలు తగవు. ఆదివారం నాడు ముఖ్యుల కలయిక వీలుపడదు. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. మొండిగా యత్నాలు సాగిస్తారు. ఎదురుచూస్తున్న పత్రాలు అందుతాయి. సంతానం ఉన్నత చదువులపై దృష్టి పెడతారు. దంపతుల మధ్య ఏకాభిప్రాయం నెలకొంటుంది. ఆత్మీయులతో తరచు సంభాషిస్తారు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఉపాధి పథకాలు చేపడతారు. ప్రైవేట్ సంస్థల ఉద్యోగస్తులకు మార్పులు అనివార్యం. ఉపాధ్యాయులు పురస్కారాలు అందుకుంటారు. 
 
 
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
ఆదాయం బాగుంటుంది. రుణవిముక్తులై తాకట్టు విడిపించుకుంటారు. ఇంటా బయట ప్రశాంతంగా ఉంటుంది. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. సావకాశంగా పనులు పూర్తి చేస్తారు. బుధవారం నాడు పత్రాలు, నగదు జాగ్రత్త. బాధ్యతలు అప్పగించవద్దు. సంతానం దూకుడు అదుపు చేయండి. ఒక సంఘటన మీపై ప్రభావం చూపుతుంది. సన్నిహితులతో సంప్రదింపులు జరుపుతారు. వ్యవహార ఒప్పందాల్లో ఏకాగ్రత వహించండి. మొహమ్మాటాలు, భేషజాలకు పోవద్దు. వివాహయత్నం ఫలిస్తుంది. వేదికలు అన్వేషిస్తారు. గృహ మరమ్మతులు చేపడతారు. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. అధికారులకు బాధ్యతల మార్పు, పనిభారం. వ్యాపారాభివృద్ధికి చేపట్టిన పథకాలు సత్ఫలితాలిస్తాయి. నిర్మాణాలు ఊపందుకుంటాయి. కాంట్రాక్టర్లు, బిల్డర్లకు ఆదాయాభివృద్ధి. 
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
ఆర్థికంగా ఆశించిన ఫలితాలుంటాయి. పొదుపు మూలక ధనం అందుతుంది. ఆప్తులకు సాయం అందిస్తారు. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. మీ జోక్యంతో ఒక సమస్య పరిష్కారమవుతుంది. సోమవారం నాడు పనులు పురమాయించవద్దు. వాయిదా చెల్లింపుల్లో జాప్యం తగదు. సంతానానికి శుభఫలితాలున్నాయి. దంపతుల మధ్య పరస్పర అవగాహన నెలకొంటుంది. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. మధ్యవర్తులు, కన్సల్టెన్సీలను ఆశ్రయించవద్దు. మీ కృషి త్వరలో ఫలిస్తుంది. దూరపు బంధుత్వాలు బలపడతాయి. కీలక పత్రాలు అందుకుంటారు. ఏకాగ్రతతో ఉద్యోగ బాధ్యతలు నిర్వహించండి. మీ తప్పిదాలను తక్షణం సరిదిద్దుకోండి. వ్యాపారాలు ఊపందుకుంటాయి. శుభకార్యానికి హాజరవుతారు. అసాంఘిక కార్యకలాపాల జోలికి పోవద్దు. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
లావాదేవీలు పురోగతిన సాగుతాయి. సమయోచిత నిర్ణయాలు తీసుకుంటారు. ఖర్చులు అధికం, డబ్బుకు ఇబ్బంది ఉండదు. స్నేహసంబంధాలు బలపడతాయి. వ్యాపకాలు సృష్టించుకుంటారు. మంగళవారం నాడు అప్రమత్తంగా ఉండాలి. ఎవరినీ అతిగా నమ్మవద్దు. పత్రాల రెన్యువల్, పన్ను చెల్లింపుల్లో జాప్యం తగదు. పనులు, బాధ్యతలు స్వయంగా చూసుకోండి. కొత్త యత్నాలు మొదలెడతారు. ఏకాగ్రత తగ్గకుండా చూసుకోండి. ఒత్తిళ్లకు గురికావద్దు. సోదరుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. మీ శ్రీమతి సలహా పాటించండి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఒక ఆహ్వానం సంతోషం కలిగిస్తుంది. ఆప్తులతో కాలక్షేపం చేస్తారు. ఉపాధ్యాయులకు పదోన్నతి, పురస్కారయోగం. నూతన వ్యాపారాలు కలిసివస్తాయి. కీలక సమావేశంలో పాల్గొంటారు. 
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
కార్యసాధనలో సఫలీకృతులవుతారు. సంప్రదింపులు ఫలిస్తాయి. సముచిత నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థిక సమస్యలు కొలిక్కివస్తాయి. గృహంలో ఉత్సాహపూరిత వాతావరణం నెలకొంటుంది. ఖర్చులు అధికం. ఆలయాలు, సేవా సంస్థలకు విరాళాలు అందిస్తారు. పనులు, బాధ్యతలు స్వయంగా చూసుకోవండి. ఇతరుల జోక్యానికి తావివ్వవద్దు. కొత్త విషయాలు తెలుసుకుంటారు. పరిచయాలు, వ్యాపకాలు అధికమవుతాయి. దూరపు బంధువులను కలుసుకుంటారు. పత్రాల్లో సవరణలు అనుకూలిస్తాయి. సంతానం ఉన్నత చదువులను వారి ఇష్టానికే వదిలేయండి. ప్రకటనలు, దళారులను విశ్వసించవద్దు. ఉద్యోగ బాధ్యతలపై శ్రద్ధ వహించండి. యాదృచ్ఛికంగా పొరపాట్లు దొర్లే ఆస్కారం ఉంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. పుణ్యక్షేత్రాల సందర్శన ఉల్లాసం కలిగిస్తుంది. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త1,2 పాదాలు
ఈ వారం కొంతమేరకు ఆశాజనకం. మనోధైర్యంతో యత్నాలు సాగించండి. సాయం ఆశించవద్దు. సంకల్పబలంతోనే కార్యం సిద్ధిస్తుంది. చేస్తున్న పనులు మధ్యలో ఆపివేయొద్దు. ఆదాయం బాగున్నా వెలితిగా ఉంటుంది. ఖర్చులు తగ్గించుకుంటారు. చెల్లింపులు, నగదు స్వీకరణలో జాగ్రత్త. మీ శ్రీమతి మాటతీరు అసహనం కలిగిస్తుంది. సామరస్యంగా మెలగండి. ఆత్మీయులతో సంభాషణ ఉపశమనం కలిగిస్తుంది. పత్రాల్లో సవరణలు సాధ్యమవుతాయి. సోదరుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. మీ అభిప్రాయాలను స్పష్టంగా తెలియజేయండి. మొహమ్మాటాలు, భేషజాలకు పోవద్దు. ఆశావహదృక్పథంతో ఇంటర్వ్యూలకు హాజరుకండి. అవకాశాలు చేజారినా కుంగిపోవద్దు. మీ కృషి నిదానంగా ఫలిస్తుంది. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి.
 
తుల: చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
మీ అభిరుచికి తగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. వ్యూహాత్మకంగా అడుగులేస్తారు. కొన్ని విషయాలు అనుకున్నట్టే జరుగుతాయి. వ్యవహారాలతో తీరిక ఉండదు. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. గురువారం నాడు పెద్ద ఖర్చు తగిలే ఆస్కారం ఉంది. పొదుపు ధనం ముందుగానే గ్రహిస్తారు. పనుల సానుకూలతకు మరింత శ్రమించాలి. గృహమరమ్మతులు చేపడతారు. పత్రాలు, విలువైన వస్తువులు జాగ్రత్త. సంతానం ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. అవివాహితులకు శుభవార్తా శ్రవణం. దంపతులు ఏకాభిప్రాయానికి రాగల్గుతారు. న్యాయ, వైద్య, సాంకేతిక రంగాల వారికి ఆదాయాభివృద్ధి. ఉద్యోగ బాధ్యతల పట్ల శ్రద్ధ వహించండి. అధికారులకు కొత్త బాధ్యతలు, పనిభారం. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఆటుపోట్లను ధీటుగా ఎదుర్కుంటారు.
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
అంకితభావంతో పనిచేస్తే మంచి ఫలితాలుంటాయి. ఇతరుల బాధ్యతలు తీసుకోవద్దు. మీ ఇష్టాలను సున్నితంగా తెలియజేయండి. పొగిడే వ్యక్తుల ఆంతర్యం గ్రహించండి. పొగడ్తలకు పొంగిపోవద్దు. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. పొదుపునకు అవకాశం లేదు. ఆదివారం నాడు పరిచయస్తుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. పనులు, కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. నోటీసులు అందుకుంటారు. దంపతుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. మీ శ్రీమతి అభిప్రాయాలకు విలువ ఇవ్వండి. ఏ విషయాన్నీ తేలికగా తీసుకోవద్దు. సంతానానికి ఉన్నత విద్యావకాశం లభిస్తుంది. వ్యాపారాలు ఊపందుకుంటాయి. నూనత వ్యాపారాలకు అనుకూల సమయం. ఉద్యోగ బాధ్యతల్లో తప్పిదాలను సరిదిద్దుకుంటారు, దూరాన ఉన్న ఆత్మీయులతో సంభాషిస్తారు. 
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
ఆర్థికంగా బాగుంటుంది. ఖర్చులు తగ్గించుకుంటారు. పొదుపు పథకాలపై దృష్టి పెడతారు. పెద్దమొత్తం ధనసహాయం తగదు. ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. ప్రముఖులు మీ సమర్ధతను గుర్తిస్తారు. సభ్యత్వాల స్వీకరణకు అనుకూలం. బాధ్యతగా వ్యవహరించండి. వ్యతిరేకులతో జాగ్రత్త. ఎవరినీ తక్కువ అంచనా వేయొద్దు. పనులు చురుకుగా సాగుతాయి. మీ సిఫార్సుతో ఒకరికి సదావకాశం లభిస్తుంది. కీలక పత్రాలు అందుకుంటారు. మంగళవారం నాడు ఊహించని సంఘటనలెదురవుతాయి. అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు. ఆత్మీయు ఆహ్వానం సందిగ్ధానికి గురిచేస్తుంది. వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. ఉద్యోగస్తులకు పదవీయోగం. ప్రైవేట్ ఉపాధ్యాయులకు ఒత్తిడి. రిటైర్డు అధికారులకు ఆత్మీయ వీడ్కోలు పలుకుతారు. 
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
కొత్త యత్నాలు మొదలెడతారు. ఏకాగ్రతతో మీ బాధ్యతలు నిర్వహించండి. మీ కష్టం తక్షణం ఫలిస్తుంది. అనురాగ వాత్సల్యాలు పెంపొందుతాయి. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారు. బంధుమిత్రులకు మీపై ప్రత్యేక అభిమానం కలుగుతుంది. సావకాశంగా పనులు పూర్తి చేస్తారు. శనివారం నాడు అప్రమత్తంగా ఉండాలి. వాదోపవాదాలకు దిగవద్దు. ఎదుటివారి అభిప్రాయంతో ఏకీభవించండి. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. పెట్టుబడుల విషయంలో పునరాలోచన మంచిది. ఆకస్మిక నిర్ణయాలు నష్టం కలిగిస్తాయి. వాయిదాల చెల్లింపుల్లో జాప్యం తగదు. సంతానం మంచి ఫలితాలు సాధిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగస్తులు సమర్ధతను చాటుకుంటారు. శుభకార్యానికి హాజరవుతారు. పరస్పరం కానుకలిచ్చిపుచ్చుకుంటారు. ప్రయాణ లక్ష్యం నెరవేరుతుంది. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
విశేషమైన ఫలితాలున్నాయి. మాటతీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. అసాధ్యమనుకున్న పనులు తేలికగా పూర్తవతాయి. ఆదాయానికి తగ్గట్టుగా ప్రణాళికలు వేసుకుంటారు. అంచనాలు ఫలిస్తాయి. దుబారా ఖర్చులు తగ్గించుకుంటారు. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. ఇంటి విషయాలు పట్టించుకుంటారు. సోమవారం నాడు ముఖ్యుల కలయిక వీలుపడదు. ఆలోచనల్లో మార్పువస్తుంది. ధైర్యంగా కీలక నిర్ణయాలు తీసుకుంటారు. కీలక విషయాల్లో ఏకాగ్రత తగ్గకుండా మెలగండి. సంతానం విజయం ఉత్సాహపరుస్తుంది. ఆప్తులతో ఉల్లాసంగా గడుపుతారు. ఉద్యోగస్తులకు కొత్త సమస్యలెదురవుతాయి. అధికారులకు అదనపు బాధ్యతలు. వృత్తి వ్యాపారాల్లో నిలదొక్కుకుంటారు. హోల్సేల్ వ్యాపారులు, స్టాకిస్టులకు ఆదాయాభివృద్ధి. రాజీమార్గంలో సమస్యలు పరిష్కరించుకుంటారు. 
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
ఆత్మీయుల వ్యాఖ్యలు కార్మోన్ముఖులను చేస్తాయి. ధైర్యంగా యత్నాలు సాగిస్తారు. లావాదేవీల్లో ఏకాగ్రత వహించండి. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. పెట్టుబడులు కలిసిరావు. పనులు సావకాశంగా పూర్తి చేస్తారు. ఆదివారం నాడు పరిచయం లేనివారితో జాగ్రత్త. ఆంతరంగిక విషయాలు వెల్లడించవద్దు. సంతనానికి శుభపరిణామాలున్నాయి. దూరపు బంధువుల ఆహ్వానం సంతోషపరుస్తుంది. దంపతుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి. సన్నిహితులతో సంభాషిస్తారు. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. వ్యాపారాల్లో స్వల్ప చికాకులు మినహా ఇబ్బందులుండవు. ప్రస్తుత వ్యాపారాలే కొనసాగిచండి. ఉద్యోగస్తులకు పదవీయోగం. ప్రైవేట్ ఉపాధ్యాయులకు ఒత్తిడి అధికం వృత్తి ఉపాధి పథకాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

27-04-2015 ఆదివారం ఫలితాలు - ఉచితంగా ఏదీ ఆశించవద్దు