Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

06-04-2025 నుంచి 12-04-2025 వరకు మీ వార ఫలితాలు

Advertiesment
weekly astrology

రామన్

, శనివారం, 5 ఏప్రియల్ 2025 (22:33 IST)
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
సంకల్ప బలం ముఖ్యం. సమష్టి సహకారంతోనే అనుకున్నది సాధిస్తారు. అవకాశాలు చేజారినా నిరుత్సాహపడవద్దు. ఓర్పుతో యత్నాలు సాగించండి. ఆదాయం నిరాశాజనకం. ఖర్చులు అదుపులో ఉండవు. అవసరాలు వాయిదా వేసుకుంటారు. పనులు మందకొడిగా సాగుతాయి. ఆదివారం నాడు ముఖ్యుల కలయక వీలుపడదు. సంతానం విషయంలో శుభపరిణామాలున్నాయి. నోటీసులు అందుకుంటారు. మీ శ్రీమతికి అన్ని విషయాలు తెలియజేయండి. ఒక సంఘటన మీపై తీవ్ర ప్రభావం చూపుతుంది. సన్నిహితులతో సంభాషిస్తారు. ప్రకటనల పట్ల అప్రమత్తంగా ఉండాలి. అజ్ఞాతవ్యక్తులు మోసగించే ఆస్కారం ఉంది. ఉద్యోగ బాధ్యతల పట్ల శ్రద్ధ వహించండి. ప్రైవేట్ ఉపాధ్యాయులకు ఒత్తిడి, త్రిప్పట అధికం. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు.
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
సంతోషకరమైన వార్త వింటారు. గృహంలో సందడి నెలకొంటుంది. నిర్దేశిత ప్రణాళికలతో యత్నాలు సాగిస్తారు. మీ కృషి నిదానంగా ఫలిస్తుంది. ఆదాయం సంతృప్తికరం. వాహనం కొనుగోలు చేస్తారు. బుధవారం నాడు పనులు, బాధ్యతలు స్వయంగా చూసుకోండి. సంస్థల స్థాపనకు అనుకూలం. పత్రాల రెన్యుల్‌లో అలక్ష్యం తగదు. ఆరోగ్యం జాగ్రత్త. ఆహార నియమాలు క్రమం తప్పకుండా పాటించండి. దూరపు బంధువులతో సంభాషిస్తారు. మీ సిఫార్సుతో ఒకరికి సదావకాశం లభిస్తుంది. ఉద్యోగపరంగా మంచి ఫలితాలున్నాయి. మీ పనితీరు అధికారులను ఆకట్టుకుంటుంది. వ్యాపారాల్లో లాభాలు, అనుభం గడిస్తారు. చిరువ్యాపారాలు ఊపందుకుంటాయి. సరుకు నిల్వలో జాగ్రత్త. వృత్తిపరమైన అవరోధాలను అధిగమిస్తారు. వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. 
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
గ్రహాల సంచారం అనుకూలంగా ఉంది. కార్యక్రమాలు విజయవంతమవుతాయి. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. ఊహించిన ఖర్చులే ఉంటాయి. ఆప్తులకు సాయం అందిస్తారు. మీ విజ్ఞత ఆకట్టుకుంటుంది. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలేర్పడతాయి. పదవులు, సభ్యత్వాలు స్వీకరిస్తారు. బాధ్యతలు, వ్యాపకాలు అధికమవుతాయి. తలపెట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు. గురు, శుక్రవారాల్లో అప్రమత్తగా ఉండాలి. ఒక సమాచారం తీవ్రంగా ఆలోచింపచేస్తుంది. కార్యక్రమాలు, పనులు వాయిదా వేసుకుంటారు. దంపతులకు కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. శుభకార్యానికి సన్నాహాలు సాగిస్తారు. ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి. యాదృచ్ఛికంగా పొరపాట్లు దొర్లే ఆస్కారం ఉంది. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. వేడుకల్లో అత్యుత్సాహం తగదు. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగుతాయి. సమర్ధతను చాటుకుంటారు. కీలక అంశాల్లో ఏకాగ్రత తగ్గకుండా చూసుకోండి. పరిచయాలు ఉన్నతికి తోడ్పడతాయి. ఆదాయం బాగుంటుంది. రుణసమస్య తొలగి తాకట్టు విడిపించుకుంటారు. ముఖ్యమైన పత్రాలు అందుతాయి. శనివారం నాడు నగదు, వాహనం జాగ్రత్త. ముఖ్యమైన పనుల్లో ఏకాగ్రత తగ్గకుండా చూసుకోండి. తరచూ సన్నిహితులతో సంభాషిస్తారు. సంతానం పై చదువులను వారి ఇష్టానికే వదిలేయండి. మీ శ్రీమతి ఆరోగ్యం కుదుటపడుతుంది. గృహనిర్మాణం పూర్తికావస్తుంది. శుభకార్యానికి సన్నాహాలు మొదలెడతారు. నిరుద్యోగులకు ఉపాధి పథకాలు కలిసివస్తాయి. ఉద్యోగస్తులకు పదవీయోగం, అధికారులకు స్థానచలనం. వ్యాపారాలు ఊపందుకుంటాయి. మీ పథకాలు సత్ఫలిస్తాయి. సరుకు నిల్వలో జాగ్రత్త. 
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
ప్రతికూలతలో సతమతమవుతారు. ఆలోచనలు నిలకడగా ఉండవు. చిన్న విషయానికే చికాకుపడతారు. స్థిమితంగా ఉండటానికి యత్నించండి. పనులు హడావుడిగా సాగుతాయి. ఆదాయం అంతంత మాత్రమే. ఖర్చులు తగ్గించుకుంటారు. వాయిదాల చెల్లింపుల్లో ఏకాగ్రత వహించండి. ఆత్మీయులతో సంభాషణ ఉపశమనం కలిగిస్తుంది. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. మీ కృషి నిదానంగా ఫలిస్తుంది. లావాదేవీల్లో ఆచితూచి అడుగేయండి. మొహమ్మాటాలు, భేషజాలకు పోవద్దు. అనాలోచిత నిర్ణయాలు నష్టం కలిగిస్తాయి. కీలక పత్రాలు అందుకుంటారు. ఆదివారం నాడు అప్రియమైన వార్త వినవలసి వస్తుంది. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి. ప్రలోభాలకు లొంగవద్దు. ప్రైవేట్ ఉపాధ్యాయులకు ఒత్తిడి, శ్రమ. వ్యాపారాలు ఊపందుకుంటాయి. విద్యార్థులు మానసికంగా స్థిమితపడతారు. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
లావాదేవీల్లో ఏకాగ్రతతో మెలగండి. ఒత్తిళ్లు, ప్రలోభాలకు లొంగవద్దు. అనుభవజ్ఞుల సలహా పాటించండి. పెట్టుబడులకు తరుణం కాదు. మీ నిర్ణయాన్ని వాయిదా వేయటం శ్రేయస్కరం. పనుల సానుకూలతకు మరింత శ్రమించాలి. మంగళ, బుధవారాల్లో చెల్లింపులు, నగదు స్వీకరణలో జాగ్రత్త. బ్యాంకు వివరాలు వెల్లడించవద్దు. ఆత్మీయుల రాక ఉత్సాహాన్నిస్తుంది. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. దళారులను ఆశ్రయించవద్దు. ఫోన్ సందేశాట పట్ల అప్రమత్తంగా ఉండాలి. ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోండి. దంపతుల మధ్య దాపరికం తగదు. పత్రాల్లో మార్పుచేర్పులు అనుకూలిస్తాయి. సంతానం దూకుడు అదుపు చేయండి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగస్తులకు పదవీయోగం. నిర్మాణాలు ఊపందుకుంటాయి. బిల్డర్లు, కాంట్రాక్టర్లకు ఆదాయాభివృద్ధి.
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
కార్యం సిద్ధిస్తుంది. అనుకున్న లక్ష్యానికి చేరువవుతారు. సర్వత్రా ప్రోత్సాహకరంగా ఉంటుంది. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. కలిసివచ్చిన అవకాశాన్ని తక్షణం అందిపుచ్చుకోండి. అనుమానాలు, అపోహలకు తావివ్వవద్దు. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. పొదుపునకు అవకాశం లేదు. దుబారా ఖర్చులు తగ్గించుకోవటం శ్రేయస్కరం. గురువారం నాడు ప్రముఖుల ఇంటర్వ్యూ అనుకూలించదు. చేపట్టిన పనులు మొండిగా పూర్తి చేస్తారు. కీలక వ్యవహారంలో ఏకాగ్రత వహించండి. ఎదురుచూస్తున పత్రాలు అందుతాయి. అవివాహితులకు శుభయోగం. ఆప్తులతో ఉల్లాసంగా గడుపుతారు. విధినిర్వహణలో అప్రమత్తంగా ఉండాలి. వృత్తి ఉద్యోగాల్లో ఆశించిన ఫలితాలున్నాయి. వ్యాపారాల్లో ఒడిదుడుకులను తట్టుకుంటారు. మీ పథకాలు సత్ఫలితాలిస్తాయి. వృత్తి ఉపాధి పథకాల్లో రాణింపు, అనుభవం గడిస్తారు. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
గ్రహస్థితి అనుకూలంగా ఉంది. శుభకార్యాన్ని ఘనంగా చేస్తారు. మీ ఆతిథ్యం ఆకట్టుకుంటుంది. పరస్పరం కానుకలిచ్చిపుచ్చుకుంటారు. పరిచయాలు, బంధుత్వాలు బలపడతాయి. ఖర్చులు విపరీతం. డబ్బుకు ఇబ్బంది ఉండదు. వాయిదా చెల్లింపుల్లో అలక్ష్యం తగదు. మీ నిర్లక్ష్యం వల్ల మూల్యం చెల్లించుకోవలసి వస్తుంది. పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. ఆదివారం నాడు కొత్త వ్యక్తులతో జాగ్రత్త. బ్యాంకు వివరాలు గోప్యంగా ఉంచండి. ఆరోగ్యం జాగ్రత్త. ఔషధ సేవనం క్రమబద్ధంగా పాటించండి. చిన్ననాటి పరిచయస్తులను కలుసుకుంటారు. గత సంఘటనలు అనుభూతినిస్తాయి. ఉద్యోగస్తులకు యూనియన్ కార్యక్రమాలతో తీరిక ఉండదు. నిరుద్యోగులకు ఉద్యోగయోగం. సాంకేతిక రంగాల వారికి ఆదాయాభివృద్ధి. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడవద్దు. 
 
ధనస్సు : పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
మీదైన రంగంలో రాణిస్తారు. ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. వ్యూహాత్మకంగా అడుగులేస్తారు. మీ కష్టం ఫలిస్తుంది. ధనలాభం, వస్త్రప్రాప్తి ఉన్నాయి. ఖర్చులు అధికం. సంతృప్తికరం. పెట్టుబడులపై దృష్టి సారిస్తారు. వాయిదా పడిన పనులు పూర్తి చేయగల్గుతారు. పత్రాల్లో మార్పుచేర్పులు అనుకూలిస్తాయి. గృహమరమ్మతులు చేపడతారు. శుక్ర, శనివారాల్లో అప్రమత్తంగా ఉండాలి. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. మీ శ్రీమతితో సంప్రదింపులు జరుపుతారు. సంతానానికి శుభఫలితాలున్నాయి. ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలు. నిరుద్యోగులకు ఉపాధి పథకాలు కలిసివస్తాయి. వ్యాపారాభివృద్ధికి అవిశ్రాంతంగా శ్రమిస్తారు. చిరువ్యాపారులకు ఆశాజనక. న్యాయవాదులకు ఆదాయాభివృద్ధి. ప్రయాణంలో అవస్థలు ఎదుర్కుంటారు. 
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగుతాయి. మీ సామర్ధ్యంపై నమ్మకం కలుగుతుంది. ధృఢసంకల్పంతో యత్నాలు సాగిస్తారు. సలహాలు, సాయం ఆశించవద్దు. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. చెల్లింపుల్లో జాప్యం తగదు. అసాధ్యమనుకున్న పనులు తేలికగా పూర్తిచేస్తారు. ఆత్మీయులతో తరచుగా సంభాషిస్తారు. సంతానం ఉన్నత చదువులను వారి ఇష్టానికే వదిలేయండి. మీ శ్రీమతి ఆరోగ్యం కుదుటపడుతుంది. నోటీసులు అందుకుంటారు. సోదరుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. కీలక విషయాల్లో అప్రమత్తంగా ఉండాలి. ఉద్యోగ బాధ్యతలపై శ్రద్ధపెట్టండి. అధికారులకు హోదా మార్పు. ప్రైవేట్ ఉపాధ్యాయులకు ఒత్తిడి, శ్రమ. వ్యాపారాల్లో గణనీయమైన పురోభివృద్ధి సాధిస్తారు. ఉమ్మడి వ్యాపారాలపై దృష్టి పెడతారు. ముఖ్యులకు ఆత్మీయ వీడ్కోలు పలుకుతారు. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
ఈ వారం అనుకూల సమయం. కీటక అంశాలపై పట్టు సాధిస్తారు. వ్యవహారాలతో తీరిక ఉండదు. ఏకాగ్రత తగ్గకుండా చూసుకోండి. ఏ విషయంలోను ఒంటెద్దుపోకడ తగదు. ఎదుటివారి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోండి. ఆదాయం సంతృప్తికరం. అయిన వారి కోసం విపరీతంగా ఖర్చు చేస్తారు. మీ చొరవతో ఒకరికి మంచి జరుగుతుంది. పరిచయాలు, బంధుత్వాలు బలపడతాయి. చేపట్టిన పనుల్లో శ్రమ, చికాకులు అధికం. ప్రముఖుల ఇంటర్వ్యూ కోసం పడిగాపులు తప్పవు. ఆలోచనల్లో మార్పు వస్తుంది. మనోధైర్యంతో అడుగు ముందుకేస్తారు. సంతానం విజయం సంతోషాన్నిస్తుంది. ఆహ్వానం అందుకుంటారు. వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. ఉపాధి పథకాలు సంతృప్తినిస్తాయి. ఉద్యోగస్తులకు పదోన్నతి. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడవద్దు. 
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
పరిస్థితులు చక్కబడతాయి. కొంతమేరకు అనుకూల ఫలితాలున్నాయి. మీ కష్టం ఫలిస్తుంది. ఆశలొదిలేసుకున్న బాకీలు వసూలవుతాయి. ఖర్చులు భారమనిపించవు. ఆర్భాటాలకు విపరీతంగా ఖర్చు చేస్తారు. పనులు సానుకూలమవుతాయి. సోమవారం నాడు అవగాహన లేని విషయాల్లో జోక్యం తగదు. మీ వ్యక్తిత్వానికి భంగం కలుగకుండా మెలగండి. ఆత్మీయులతో సంభాషణ ఉత్సాహాన్నిస్తుంది. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. కన్సల్టెన్సీలను ఆశ్రయించవద్దు. ఫోన్ సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. మీ ఇబ్బందులను సన్నిహితులకు తెలియజేయండి. గృహనిర్మాణం పూర్తి కావస్తుంది. శుభకార్యానికి సన్నాహాలు సాగిస్తారు. హోల్‌సేల్ వ్యాపారులు, స్టాకిస్టులకు పురోభివృద్ధి. ఉద్యోగస్తుల సమర్ధతకు గుర్తింపు లభిస్తుంది. పదవులు, బాధ్యతలు స్వీకరిస్తారు. ముఖ్యులతో పరిచయాలు బలపడతాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

05-04-2025 శనివారం మీ రాశిఫలాలు- పరిస్థితులకు తగినట్లుగా నడుచుకోండి..