Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

05-09-2021 నుంచి 11-09-2021 వరకూ రాశి ఫలితాలు

05-09-2021 నుంచి 11-09-2021 వరకూ రాశి ఫలితాలు
, శనివారం, 4 సెప్టెంబరు 2021 (19:19 IST)
మేషం: అశ్వని, భరణి 1, 2, 3 పాదాలు, కృత్తిక 1వ పాదం
ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. డబ్బుకు ఇబ్బంది వుండదు. ఎంతటివారినైనా ఇట్టే ఆకట్టుకుంటారు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. వ్యవహారాలతో తీరిక వుండదు. శ్రమాధిక్యత, అకాల భోజనం. మొక్కుబడిగా పనులు పూర్తి చేస్తారు. మంగళ, శుక్ర వారాల్లో అప్రియమైన వార్తలు వినాల్సి వస్తుంది. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. దంపతుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. సోదరుల మధ్య అవగాహన నెలకొంటుంది. ఆస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. విలువైన వస్తువులు మరమ్మతుకు గురవుతాయి. భవన నిర్మాణ కార్మికులకు ఆశాజనకం. వ్యాపారాల్లో స్వల్ప చికాకులు మినహా ఇబ్బందులుండవు. చిన్న వ్యాపారులకు ఆదాయాభివృద్ధి. ఉద్యోగస్తులు అధికారులను ఆకట్టుకుంటారు. రిప్రజెంటేటివులు, ఏజెంట్లకు కలిసివస్తుంది.
 
వృషభం: కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2 పాదాలు
కార్యసాధనకు ఓర్పు ప్రధానం. ఎదుటివారి వ్యాఖ్యలు ఉద్రేకపరుస్తాయి. పట్టుదలతో వ్యవహరించండి. ఆగ్రహావేశాలు ప్రదర్శించవద్దు. మీ శ్రీమతి ప్రోత్సాహంతో అనుకున్నది సాధిస్తారు. ఆదాయం బాగుంటుంది. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. ఆది, సోమ వారాల్లో పనులు సాగవు. మీపై శకునాల ప్రభావం అధికం. సంతానం విషయంలో మంచే జరుగుతుంది. కాంట్రాక్టులు, ఏజెన్సీలు దక్కించుకుంటారు. బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. ఆరోగ్యం నిలకడగా వుంటుంది. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం కలిసివస్తుంది. ఉపాధ్యాయులకు శుభయోగం. అధికారులకు ఆకస్మిక స్థానచలనం. వృత్తి ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం.
 
మిధునం: మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
అనుకూల పరిస్థితులు నెలకొంటాయి. ధైర్యంగా వ్యవహరిస్తారు. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. అవకాశాలు సద్వినియోగం చేసుకుంటారు. ఆదాయం బాగుంటుంది. రోజువారీ ఖర్చులే వుంటాయి. కొత్త పనులు ప్రారంభిస్తారు. గృహం ప్రశాంతంగా వుంటుంది. బుధ, గురు వారాల్లో ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. కొన్ని విషయాలు చూసీచూడనట్లు వదిలేయండి. ప్రియతములతో ఉల్లాసంగా గడుపుతారు. ఫోన్ సందేశాలను నమ్మవద్దు. బ్యాంకు వివరాలు గోప్యంగా వుంచండి. పెద్దల ఆరోగ్యం మెరుగుపడుతుంది. సంతానం కదలికలపై దృష్టి సారించండి. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. చేతివృత్తులు, కార్మికులకు ఆశాజనకం. వ్యాపారాలు ఊపందుకుంటాయి. చిరువ్యాపారుల ఆదాయం బాగుంటుంది. రిటైర్డు ఉద్యోగస్తులకు వీడ్కోలు పలుకుతారు.
 
కర్కాటకం: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాలు
ఆర్థిక లావాదేవీలు ముగుస్తాయి. రావలసిన ధనం అందుతుంది. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. ఆందోళన కలిగించిన సమస్య సద్దుమణుగుతుంది. వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు. శుక్ర, శని వారాల్లో కొత్త వ్యక్తులతో జాగ్రత్త. వాగ్వాదాలకు దిగవద్దు. ఎదురుచూస్తున్న పత్రాలు అందుకుంటారు. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. కుటుంబ సౌఖ్యం ప్రశాంతత పొందుతారు. సంతానం చదువులపై మరింత శ్రద్ధ వహించండి. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. దైవ కార్యాలకు సాయం అందిస్తారు. ఉపాధ్యాయుల సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. పురస్కారాలు, ప్రశంసలు అందుకుంటారు. ఉపాధి పథకాలు చేపడతారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. నష్టాలను భర్తీ చేసుకుంటారు. ప్రేమ వ్యవహారాలు సుఖాంతమవుతాయి.
 
సింహం: మఖ, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదం
ఈ వారం వ్యవహారాలతో తీరిక వుండదు. ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోవాలి. సాధ్యం కాని హామీలివ్వవద్దు. పనులు సానుకూలతకు మరింత శ్రమించాలి. కొంత మొత్తం ధనం అందుతుంది. ప్రణాళికలు వేసుకుంటారు. అంచనాలు ఫలిస్తాయి. ఉల్లాసంగా గడుపుతారు. మీ జోక్యంతో ఒకరికి సదవకాశం లభిస్తుంది. సన్నిహితులకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారు. గౌరవప్రతిష్టలు పెంపొందుతాయి. గృహంలో మార్పుచేర్పులకు అనుకూలం. సంతానం అత్యుత్సాహం ఇబ్బంది కలిగిస్తుంది. దంపతులకు కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. అవివాహితులకు శుభవార్తా శ్రవణం. ఉమ్మడి వ్యాపారాలు కలిసివస్తాయి. ఉపాధి, పథకాల్లో రాణింపు, అనుభవం గడిస్తారు. ఉపాధ్యాయులకు పురస్కారం. ఉద్యోగ బాధ్యతల్లో తప్పిదాలను సరిదిద్దుకుంటారు. న్యాయ, వైద్య, సాంకేతిక రంగాల వారికి ఆదాయాభివృద్ధి. వేడుకకు హాజరవుతారు.
 
కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
ఆశావహ దృక్పథంతో మెలగండి. ఏ విషయాన్నీ తీవ్రంగా భావించవద్దు. పట్టుదలతో శ్రమించిన గాని పనులు కావు. దంపతుల మధ్య అవగాహనలోపం. ఊహించని ఖర్చులు, ధరలు ఆందోళన కలిగిస్తాయి. చేతిలో ధనం నిలువదు. అవసరాలు అతి కష్టమ్మీద నెరవేరుతాయి. సన్నిహితులతో సంభాషణ ఉత్తేజాన్ని కలిగిస్తుంది. కొత్త యత్నాలు ప్రారంభిస్తారు. విమర్శలు, అభియోగాలు పట్టించుకోవద్దు. త్వరలో శుభవార్త వింటారు. గృహమార్పు అనివార్యం. విలువైన వస్తువులు జాగ్రత్త. కీలక పత్రాలు అందుకుంటారు. ఒక సమాచారం ఉల్లాసాన్నిస్తుంది. ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం. సహోద్యోగులు సాయం అందిస్తారు. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. చిరువ్యాపారుల ఆదాయం బాగుంటుంది. ముఖ్యులలో ఒకరికి వీడ్కోలు పలుకుతారు. వాహన చోదకులకు దూకుడు తగదు.
 
తుల: చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
పట్టింపులకు పోవద్దు. ఎదుటివారి అభిప్రాయాలకు విలువ ఇవ్వండి. ఎవరినీ నిందించవద్దు. అవకాశాలను తక్షణం వినియోగించుకోండి. ఖర్చులు అదుపులో వుండవు. రుణాలు, చేబదుళ్లు స్వీకరిస్తారు. ఆది, సోమ వారాల్లో పనులు మందకొడిగా సాగుతాయి. దంపతుల మధ్య సఖ్యత లోపం. సామరస్యంగా సమస్యలు పరిష్కరించుకోవాలి. గృహంలో స్తబ్దత నెలకొంటుంది. ఆప్తుల రాక ఉత్సాహాన్నిస్తుంది. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం ఆలోచింపజేస్తుంది. జాతక పొంతన ప్రధానం. పెద్దల సలహా పాటించండి. పోగొట్టుకున్న పత్రాలు సంపాదిస్తారు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. పెద్దమొత్తం సరుకు నిల్వలో జాగ్రత్త. ఉపాధ్యాయుల సమర్థతకు ఏమంత గుర్తింపు వుండదు. అధికారులకు హోదామార్పు, స్థానచలనం. ఉపాధి పథకాలు చేపడతారు. షేర్ల క్రయవిక్రయాలు లాభిస్తాయి.
 
వృశ్చికం: విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ట 1, 2, 3, 4 పాదాలు
సర్వత్రా అనుకూలతలున్నాయి. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. సన్నిహితులకు సాయం అందిస్తారు. పరిచయాలు బలపడతాయి. వ్యాపకాలు సృష్టించుకుంటారు. పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. కొత్త వ్యక్తులతో జాగ్రత్త. బ్యాంకు వివరాలు గోప్యంగా వుంచండి. ప్రలోభాలకు లొంగవద్దు. మీ శ్రీమతికి అన్ని విషయాలు తెలియజేయండి. మంగళ, బుధ వారాల్లో అనవసర జోక్యం తగదు. ఆరోగ్యం స్థిరంగా వుంటుంది. గృహ మరమ్మతులు చేపడతారు. పత్రాల రెన్యువల్లో మెలకువ వహించండి. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. రిటైర్డు ఉద్యోగస్తులకు వీడ్కోలు పలుకుతారు. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. చిరువ్యాపారులకు ఆశాజనకం. ద్విచక్ర వాహనంపై దూర ప్రయాణం తగదు.
 
ధనస్సు: మూల, పూర్వాషాడ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాడ 1వ పాదం
ఆర్థిక స్థితి క్రమంగా మెరుగుపడుతుంది. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. ఆందోళన కలిగించిన సమస్య సద్దుమణుగుతుంది. బంధుమిత్రుల వ్యాఖ్యలకు దీటుగా స్పందిస్తారు. ప్రముఖులతో పరిచయాలు బలపడతాయి. పదవులు, సభ్యత్వాలకు యత్నాలు సాగిస్తారు. గురు, శుక్ర వారాల్లో అప్రమత్తంగా వుండాలి. ఎవరినీ అతిగా విశ్వసించవద్దు. సంతానం ఉన్నత చదువులను వారి ఇష్టానికే వదిలేయండి. చిన్ననాటి పరిచయస్తులు తారసపడతారు. ఉపాధ్యాయులకు శుభయోగం. ఉద్యోగస్తులకు ఏకాగ్రత, సమయపాలన ప్రధానం. సహోద్యోగులతో విందులు, వినోదాల్లో పాల్గొంటారు. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. నూతన పెట్టుబడులకు తరుణం కాదు. వృత్తి ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. ఏజెంట్లు, రిప్రజెంటేటివ్‌లకు ఒత్తిడి అధికం.
 
మకరం: ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. వ్యవహారాలను సమర్థంగా నిర్వహిస్తారు. మీ అభిప్రాయాలకు స్పందన లభిస్తుంది. చాకచక్యంగా పనులు చక్కబెట్టుకుంటారు. శనివారం నాడు పెద్ద ఖర్చు తగిలే ఆస్కారం వుంది. అవసరాలు అతికష్టమ్మీద నెరవేరుతాయి. ధనం సర్దుబాటు కష్టంగా వుంటుంది. ప్రముఖులతో సత్సంబంధాలు నెలకొంటాయి. మీ విషయాల్లో ఇతరుల జోక్యానికి తావివ్వవద్దు. బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. సంతానం ఉన్నత చదువులపై దృష్టి పెడతారు. పత్రాలు, విలువైన వస్తువులు జాగ్రత్త. పెట్టుబడులకు తరుణం కాదు. ఉపాధ్యాయులకు పురస్కారయోగం. ఉపాధి పథకాలు సంతృప్తినిస్తాయి. వ్యాపారాభివృద్ధికి మరింత శ్రమించాలి. షాపు పనివారలతో జాగ్రత్త. హోల్సేల్ వ్యాపారులకు పురోభివృద్ధి. ముఖ్యుల గురించి ఆందోళన చెందుతారు. కార్యక్రమాలు వాయిదా పడతాయి.
 
కుంభం: ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర, 1, 2,3 పాదాలు
శ్రమాధిక్యత మినహా ఫలితం వుండదు. నిస్తేజానికి లోనవుతారు. ఏ విషయంపై ఆసక్తి వుండదు. రోజులు భారంగా గడుస్తున్నట్లనిపిస్తాయి. ఆశావాహ దృక్పథంతో ముందుకు సాగండి. ఓర్పుతో శ్రమించినగాని పనులు పూర్తి కావు. ఆది, మంగళ వారాల్లో దుబారా ఖర్చులు విపరీతం. ఒక అవసరానికి వుంచిన ధనం మరోదానికి వ్యయం చేస్తారు. ఆత్మీయులతో సంభాషణ ఉపశమనం కలిగిస్తుంది. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఏజెన్సీలను విశ్వసించవద్దు. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. మీ ఇష్టాయిష్టాలను కచ్చితంగా తెలియజేయండి. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. మార్కెట్ రంగాల వారికి ఒత్తిడి, పనిభారం. వ్యాపారాలు అంతంతమాత్రంగా సాగుతాయి. సన్మాన, సాహిత్య కార్యక్రమాల్లో పాల్గొంటారు.
 
మీనం: పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి 1, 2, 3, 4 పాదాలు
ఆదాయం బాగున్నా అసంతృప్తిగానే వుంటుంది. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. దైవకార్యాలకు విపరీతంగా వ్యయం చేస్తారు. బంధుత్వాలు, పరిచయాలు బలపడతాయి. సన్నిహితుల రాక ఉత్సాహాన్నిస్తుంది. పనులు వేగవంతమవుతాయి. బుధ, గురు వారాల్లో అనవసర జోక్యం తగదు. కొన్ని విషయాలు చూసీచూడనట్లు వదిలేయండి. సంతానం విషయంలో శుభఫలితాలున్నాయి. మీ శ్రీమతి ఆరోగ్యం మెరుగుపడుతుంది. పదవుల కోసం యత్నాలు సాగిస్తారు. వ్యతిరేకులతో జాగ్రత్త. ఆంతరంగిక విషయాలు వెల్లడించవద్దు. పత్రాలు అందుకుంటారు. ఉద్యోగస్తులకు పదోన్నతి. అధికారులకు కొత్త సమస్యలెదురవుతాయి. వ్యాపారాల్లో లాభనష్టాలను సమీక్షించుకుంటారు. నూతన వ్యాపారాలు కలిసివస్తాయి. వేడుకలు, వినోదాల్లో అత్యుత్సాహం తగదు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అక్టోబర్ మొదటి వారంలోనే శ్రీవారి క్యాలెండర్లు, డైరీలు: టిటిడి ఈఓ