Publish Date: Thu, 30 Apr 2026 (12:30 IST)
Updated Date: Thu, 30 Apr 2026 (12:32 IST)
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
ఈ మాసం నిరాశాజనకం. సంప్రదింపులు నిరుత్సాహపరుస్తాయి. ఏ విషయంపై ఆసక్తి ఉండదు. అన్యమస్కంగా గడుపుతారు. ఆదాయానికి మించిన ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి. చేబదుళ్లు స్వీకరిస్తారు. ముఖ్యులను కలిసినా ఫలితం ఉండదు. దంపతుల మధ్య తరచు కలహాలు. గృహంలో స్తబ్ధత నెలకొంటుంది. ఆశావహదృక్పథంతో మెలగండి. ఈ చికాకులు తాత్కాలికమే. త్వరలో పరిస్థితులు చక్కబడతాయి. మనస్సుకు నచ్చిన వారితో కాలక్షేపం చేయండి. చిన్ననాటి మిత్రులు తారసపడతారు. గత సంఘటనలు అనుభూతినిస్తాయి. సంతానం విద్యాయత్నం ఫలిస్తుంది. ఆందోళన తగ్గి కుదుటపడతారు. ఆత్మీయుల ఆహ్వానం సంతోషం కలిగిస్తుంది. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. శుభకార్యంలో పాల్గొంటారు. ఇంటిని నిర్లక్ష్యంగా వదిలివెళ్లకండి. నగదు, విలువైన వస్తువులు జాగ్రత్త.
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
వ్యవహార ఒప్పందాల్లో మెళకువ వహించండి. ప్రతి విషయంలోను ఆచితూచి అడుగేయాలి. అనుభవజ్ఞుల సలహా పాటించండి. అనాలోచిత నిర్ణయం వల్ల ఇబ్బందులెదుర్కోవలసి వస్తుంది. వివాదాస్పద విషయాల జోలికి పోవద్దు. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. పెద్దఖర్చు తగులుతుంది. సాయం అర్ధించేందుకు మనస్కరించదు. ఏదో విధంగా అవసరాలు నెరవేరుతాయి. దూరపు బంధువుల ఆహ్వానం అందుకుంటారు. దంపతుల మధ్య ఏకాభిప్రాయం నెలకొంటుంది. సంతానానికి ఉన్నత విద్యావకాశం లభిస్తుంది. తరచు సన్నిహితులతో సంభాషిస్తారు. ముఖ్యమైన పత్రాలు అందుతాయి. ఒక సమాచారం ఆలోచింపజేస్తుంది. సోదరులతో సంప్రదింపులు జరుపుతారు. మీ అభిప్రాయాలను స్పష్టంగా తెలియజేయండి. స్వల్ప అస్వస్థతకు గురవుతారు. సొంత పరిజ్ఞానంతో మందులు వేసుకోవద్దు. గృహమరమ్మతులు చేపడతారు. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. పుణ్యక్షేత్రాలు, కొత్త ప్రదేశాలు సందర్శిస్తారు.
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
ప్రథమార్ధం అనుకూలం. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. అవకాశాలు కలిసివస్తాయి. స్ధిరాస్తి ధనం అందుతుంది. విలాసాలకు విపరీతంగా ఖర్చుచేస్తారు. చేతిలో ధనం నిలవదు. కొన్ని పనులు ఆకస్మికంగా పూర్తవుతాయి. మీ శ్రీమతి ధోరణిలో మార్పువస్తుంది. కుటుంబ సౌఖ్యం, వాహనయోగం పొందుతారు. ద్వితీయార్ధం అప్రమత్తంగా ఉండాలి. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. మీ అభిప్రాయాలకు అభ్యంతరాలు ఎదురవుతాయి. సామరస్యంగా సమస్యలు పరిష్కరించుకోండి. పత్రాల్లో సవరణలు సాధ్యపడవు. ఆశావహదృక్పథంతో మెలగండి. ఏ విషయాన్నీ తీవ్రంగా పరిగణించవద్దు. సంస్థల స్థాపనలకు తరుణం కాదు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి. శుభకార్యంలో పాల్గొంటారు. ఇంటిని నిర్లక్ష్యంగా వదిలి వెళ్లకండి.
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. పొదుపునకు అవకాశం లేదు. పరిచయస్తులు ధనసహాయం అర్ధిస్తారు. పెద్దమొత్తం సాయం తగదు. వాయిదా పడుతూ వస్తున్న పనులు పూర్తిచేస్తారు. స్నేహసంబంధాలు బలపడతాయి. తరచు ఆత్మీయులతో సంభాషిస్తారు. సంతానం విద్యాయత్నం ఫలిస్తుంది. స్థిరాస్తి విక్రయంలో పునరాలోచన శ్రేయస్కరం. మీ శ్రీమతికి అన్ని విషయాలు తెలియజేయండి. పరిచయాలు, వ్యాపకాలు అధికమవుతాయి. మీ జోక్యం అనివార్యం. బంధుమిత్రుల రాకపోకలు అధికమవుతాయి. గృహంలో సందడి నెలకొంటుంది. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం కలిసివచ్చే సూచనలున్నాయి. అయిన వారితో ఉల్లాసంగా గడుపుతారు. కీలక పత్రాలు అందుతాయి. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టిపెడతారు. వాహనం నడిపేటపుడు జాగ్రత్త.
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
పరిస్థితులు మెరుగుపడతాయి. అన్ని రంగాల వారికీ కలిసివచ్చే సమయం. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. కొంత మొత్తం పొదుపు చేస్తారు. సంస్థల స్థాపనలకు రుణాలు మంజూరవుతాయి. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. వివాహయత్నాలు తీవ్రంగా యత్నాలు సాగిస్తారు. దళారులు, కన్సల్టెన్సీలతో జాగ్రత్త. తొందరపడి చెల్లింపులు జరుపవద్దు. అనుభవజ్ఞులను సంప్రదించండి. ఒత్తిళ్లకు లొంగవద్దు. సంతానం మంచి ర్యాంకు సాధిస్తారు. ఆత్మీయులతో తరచు సంభాషిస్తుంటారు. ఒక సమాచారం సంతోషం కలిగిస్తుంది. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి. గృహాలంకరణ పట్ల ఆసక్తి కలుగుతుంది. విలాస వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆరోగ్యం జాగ్రత్త. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. వ్యాపకాలు సృష్టించుకుంటారు. బెట్టింగులకు పాల్పడవద్దు.
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
ఈ మాసం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. చాకచక్యంగా మెలుగుతారు. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. రావలసిన ధనం అందుతుంది. అవసరాలు తీరుతాయి. పెద్దమొత్తం ధనసహాయం తగదు. మీ ఇబ్బందులను సున్నితంగా తెలియజేయండి. కొత్త పనులు చేపడతారు. పరిచయాలు ఉన్నతికి తోడ్పడతాయి. ఫోన్ సందేశాలు పట్టించుకోవద్దు. అజ్ఞాతవ్యక్తులు మోసగించే ఆస్కారం ఉంది. దూరపు బంధువుల ఆహ్వానం అందుకుంటారు. అయిన వారి మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. అవివాహితులకు శుభయోగం. కీలక పత్రాల్లో సవరణలు అనుకూలిస్తాయి. స్థిరచరాస్తుల వ్యవహారంలో జాగ్రత్తగా ఉండాలి. నగదు స్వీకరణ, చెల్లింపుల్లో జాగ్రత్త. సంతానం అత్యుత్సాహం అదుపుచేయండి. ఏ విషయాన్నీ తేలికగా తీసుకోవద్దు. ప్రయాణం కలిసివస్తుంది.
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
కార్యసిద్ధి, వస్త్రప్రాప్తి, వాహనసౌఖ్యం ఉన్నాయి. ప్రేమానుబంధాలు బలపడతాయి. ఉల్లాసంగా గడుపుతారు. మీ ప్రమేయంతో శుభకార్యం నిశ్చయమవుతుంది. తెగిపోయిన బంధుత్వాలు బలపడతాయి. సంస్థల స్థాపనలపై దృష్టిపెడతారు. ఖర్చులు అధికం, సంతృప్తికరం. కీలక పత్రాలు అందుకుంటారు. సంతానానికి ఉన్నత విద్యావకాశం లభిస్తుంది. దంపతుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. మీ ప్రతిపాదనలకు స్పందన లభిస్తుంది. వ్యవహారాలు మీ సమక్షంలో సాగుతాయి. ఉభయులకూ మీ నిర్ణయం ఆమోదయోగ్యమవుతుంది. ఆరోగ్యం జాగ్రత్త. అతిగా శ్రమించవద్దు. పోగొట్టుకున్న వస్తువులు లభ్యమవుతాయి. చిన్ననాటి పరిచయస్తులు తారసపడతారు. గత సంఘటనలు అనుభూతినిస్తాయి. సంతానం కదలికలపై దృష్టిపెట్టండి. చెప్పుడు మాటలు పట్టించుకోవద్దు. ప్రేమవ్యవహారాలు వికటిస్తాయి.
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
ఆర్ధికలావాదేవీలు సంతృప్తినిస్తాయి. రుణవిముక్తులవుతారు. కొంతమొత్తం ధనం అందుతుంది. దుబారా ఖర్చులు తగ్గించుకుంటారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు సానుకూలమవుతాయి. ఒక సమాచారం సంతోషం కలిగిస్తుంది. ఆత్మీయులతో తరచు కాలక్షేపం చేస్తారు. గృహమార్పు కలిసివస్తుంది. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. మీ గౌరవానికి భంగం కలుగకుండా మెలగండి. సంతానం మంచి ర్యాంకు సాధిస్తారు. ఆహ్వానం అందుకుంటారు. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. కుటుంబసౌఖ్యం, ప్రశాంతత పొందుతారు. వ్యాపకాలు అధికమవుతాయి. సొంతంగా ఏదైనా చేయాలనే ఆలోచన బలపడుతుంది. మీ యత్నాలను అయిన వారు ప్రోత్సహిస్తారు. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. ధార్మిక విషయాల పట్ల ఆసక్తి కలుగుతుంది. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
కార్యక్రమాలు విజయవంతంగా సాగుతాయి. అనుకున్న లక్ష్యం సాధిస్తారు. మీ సామర్ధ్యంపై నమ్మకం కలుగుతుంది. కొత్త పనులు చేపడతారు. శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలకు అనుకూలం. శుభకార్యం నిశ్చయమవుతుంది. వేదికలు అన్వేషిస్తారు. ఖర్చులు అదుపులో ఉండవు. ప్రతి వ్యవహారం ధనంతో ముడిపడి ఉంటుంది. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. ఆచితూచి అడుగేయండి. కావలసిన వస్తువులు సమయానికి కనిపించవు. చీటికిమాటికి అసహనం చెందుతారు. దంపతుల మధ్య సఖ్యత లోపం. ఆత్మీయులతో తరచు కాలక్షేపం చేస్తారు. సంతానానికి ఉన్నత విద్యావకాశం లభిస్తుంది. ప్రియతముల గురించి ఆందోళన చెందుతారు. కార్యక్రమాలు ముందుకు సాగవు. సోదరులతో సంప్రదింపులు జరుపుతారు. మీ ప్రతిపాదనలకు ఆమోదం లభిస్తుంది. దూరప్రయాణం తలపెడతారు.
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
సంప్రదింపులతో తీరిక ఉండదు. శ్రమాధిక్యత, విశ్రాంతి లోపం. ఆదాయానికి తగ్గట్టుగా లెక్కలు వేసుకుంటారు. అంచనాలు ఫలిస్తాయి. ఖర్చులు తగ్గించుకుంటారు. వాయిదా పడుతున్న పనులు ఎట్టకేలకు పూర్తవుతాయి. అందరితోను కలుపుగోలుగా మెలుగుతారు. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. సభ్యత్వం, బాధ్యతలు స్వీకరిస్తారు. వ్యతిరేకులతో జాగ్రత్త. మీ సాయంతో ఒకరికి మంచి జరుగుతుంది. సన్నిహితులతో తరచు సంభాషిస్తారు. ఒక వ్యవహారం మీ సమక్షంలో సాగుతుంది. ఉభయులకూ మీ నిర్ణయం ఆమోదయోగ్యమవుతుంది. ధనలాభం, వస్త్రప్రాప్తి ఉన్నాయి. ఒక ఆహ్వానం సంతోషం కలిగిస్తుంది. అయిన వారితో ఉల్లాసంగా గడుపుతారు. సంతానం కదలికలపై దృష్టిపెట్టండి. ఏ విషయాన్నీ తేలికగా తీసుకోవద్దు. కొత్త ప్రదేశాలు సందర్శిస్తారు.
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
ఈ మాసం అనుకూలదాయకం. తలపెట్టిన కార్యం విజయవంతమవుతుంది. అనురాగవాత్సల్యాలు వెల్లివిరుస్తాయి. ఎంతటివారినైనా ఇట్టే ఆకట్టుకుంటారు. కష్టమనుకున్న పనులు తేలికగా పూర్తిచేస్తారు. ఆహ్వానం, కీలక పత్రాలు అందుకుంటారు. ఆత్మీయులతో తరచు సంభాషిస్తుంటారు. వివాహయత్నం తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం కుదిరే సూచనలున్నాయి. మీ ఇష్టాయిష్టాలను స్పష్టంగా తెలియజేయండి. వాస్తుదోష నివారణ చర్యలు చేపడతారు. విలువైన వస్తువులు మరమ్మతుకు గురవుతాయి. స్థిరాస్తి ధనం అందుతుంది. ఖర్చులు అధికం. డబ్బుకు ఇబ్బంది ఉండదు. ఆప్తులకు సాయం అందిస్తారు. సంస్థల స్థాపనలకు అనుకూలం. మీ సిఫార్సుతో ఒకరికి సదవకాశం లభిస్తుంది. ఆరోగ్యం సంతృప్తికరం. వేడుకకు హాజరవుతారు. మీ బలహీనతలు అదుపులో ఉంచుకోండి.
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
గ్రహాల సంచారం అనుకూలంగా ఉంది. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. సన్నిహితులు అన్ని విధాలా సహకరిస్తారు. మనోధైర్యంతో ముందుసాగుతారు. ఆదాయానికి తగ్గట్టుగా బడ్జెట్ వేసుకుంటారు. సంస్థల స్థాపనలకు రుణాలు మంజూరవుతాయి. పరిచయం లేని వారితో జాగ్రత్త. ఆర్థిక వివరాలు వెల్లడించవద్దు. మీ శ్రీమతికి అన్ని విషయాలు తెలియజేయండి. శుభకార్యం నిశ్చయమవుతుంది. వేడుకను ఆర్భాటంగా చేస్తారు. బంధువుల రాకపోకలు అధికమవుతాయి. గృహం సందడిగా ఉంటుంది. ఖరీదైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. సంతానం విద్యాయత్నం ఫలిస్తుంది. పనులు, కీలక బాధ్యతలు అప్పగించవద్దు. సోదరుల మధ్య అవగాహన నెలకొంటుంది. ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. అనుకున్న మొక్కులు తీర్చుకుంటారు.