Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

01-03-2026 నుంచి 31-03-2026 వరకు మాస ఫలితాలు

Advertiesment
monthly horoscope
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
ఈ మాసం అనుకూలదాయకం. వ్యవహారజయం, కార్యసిద్ధి ఉన్నాయి. మాటతీరు ఆకట్టుకుంటుంది. అనురాగవాత్సల్యాలు వెల్లివిరుస్తాయి. ఆత్యీయులతో తరుచుగా సంభాషిస్తారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు సానుకూలమవుతాయి. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. విలాసాలకు విపరీతంగా ఖర్చు చేస్తారు. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. సభ్యత్వం, బాధ్యతలు స్వీకరిస్తారు. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకండి. మితసంభాషణం శ్రేయస్కరం. దూరపు బంధువుల ఆహ్వానం అందుకుంటారు. ఆరోగ్యం జాగ్రత్త. అతిగా శ్రమించవద్దు. అవివాహితులకు శుభవార్తలు వింటారు. గృహమరమ్మతులు చేపడతారు. చుట్టుపక్కల వారి నుంచి అభ్యంతరాలెదురవుతారు. శుభకార్యానికి హాజరవుతారు. 
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
వాక్చాతుర్యంతో నెట్టుకొస్తారు. సమర్ధతకు గుర్తింపు లభిస్తుంది. గౌరవప్రతిష్టలు పెంపొందుతాయి. అవకాశాలను చేజిక్కించుకుంటారు. పనులు చురుకుగా సాగుతాయి. నోటీసులు అందుకుంటారు. అయిన వారి మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. మీ అభిప్రాయాలను స్పష్టంగా తెలియజేయండి. భేషజాలకు పోవద్దు. ఖర్చులు అధికం, సంతృప్తికరం. పొదుపు పథకాల పట్ల ఆకర్షితులవుతారు. ప్రైవేట్ సంస్థల్లో మదుపు తగదు. సన్నిహితుల సలహా పాటించండి. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. దాంపత్యసౌఖ్యం, ప్రశాంతత పొందుతారు. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం కుదిరే సూచనలున్నాయి. వేడుకకు హాజరవుతారు. ఇంటిని అలక్ష్యంగా వదిలి వెళ్లకండి. నగదు, ఆభరణాలు జాగ్రత్త. విద్యార్థులకు అత్యుత్సాహం తగదు. 
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
వ్యవహారజయం, కార్యసిద్ధి ఉన్నాయి. అనుకున్న లక్ష్యం సాధిస్తారు. కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. చాకచక్యంగా పనులు చక్కబెట్టుకుంటారు. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. ఖర్చులు అంచనాలను మించుతాయి. ఒక అవసరానికి ఉంచిన ధనం మరోదానికి వ్యయం చేస్తారు. దంపతుల మధ్య ఏకాభిప్రాయం నెలకొంటుంది. వాహనం అమర్చుకోవాలనే కోరిక తీరుతుంది. రశీదులు, కీలక పత్రాలు జాగ్రత్త. దూరపు బంధువుల ఆహ్వానం సంతోషం కలిగిస్తుంది. శుభకార్యానికి వెళ్లాలనే ఆలోచన బలపడుతుంది. గృహనిర్మాణం పూర్తి కావస్తుంది. శుభకార్యానికి సన్నాహాలు సాగిస్తారు. సోదరుల మధ్య అవగాహన లోపం. మీ అభిప్రాయాలకు అభ్యంతరాలెదురవుతాయి. స్వల్ప అస్వస్థకు గురవుతారు. వైద్యపరీక్షలు అనివార్యం. మీ సాయంతో ఒకరికి మంచి జరుగుతుంది. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
గ్రహస్థితి ప్రతికూలంగా ఉంది. ఆచితూచి అడుగేయాలి. తొందరపాటు నిర్ణయాలు నష్టం కలిగిస్తాయి. అనుభవజ్ఞుల సలహా పాటించండి. మొహమ్మాటాలు, భేషజాలకు పోవద్దు. చేపట్టిన పనుల్లో ఒత్తిడి, జాప్యం అధికం. స్థిరాస్తి ధనం అందుతుంది. కొంతమొత్తం పొదుపు చేస్తారు. బంధువర్గాలతో అభిప్రాయభేదాలు తలెత్తుతాయి. చిన్న చిన్న విషయాలు పట్టించుకోవద్దు. ఆత్మీయులతో సంభాషణ ఉత్తేజపరుస్తుంది. మనోధైర్యంతో యత్నాలు సాగిస్తారు. మీ కృషి తక్షణం ఫలిస్తుంది. పోయాయనుకున్న వస్తువులు లభ్యమవుతాయి. ఆందోళన కలిగించిన సమస్య సద్దుమణుగుతుంది. సంస్థల స్థాపనకు అనుకూలం. అవివాహితులు శుభవార్త వింటారు. విద్యార్థులు పరీక్షలు బాగా రాస్తారు. సంతానం పై చదువులను వారి ఇష్టానికే వదిలేయండి. పుణ్యక్షేత్రం సందర్శిస్తారు. 
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
ఆర్ధికలావాదేవీలతో హడావుడిగా ఉంటారు. తొందరపాటు నిర్ణయాలు తగవు. అనుభవజ్ఞులను సంప్రదించండి. రుణఒత్తిళ్లతో మనశ్శాంతి ఉండదు. ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. ఖర్చులు విపరీతం. ధనసమస్యలెదురవుతాయి. చెల్లింపుల్లో జాగ్రత్త. ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోండి. పనులు, బాధ్యతలు పురమాయించవద్దు. దంపతుల మధ్య అప్పుడప్పుడు స్వల్ప కలహం. ఆత్మీయుల చొరవతో ఒక సమస్య పరిష్కారమవుంది. పెద్దల గురించి ఆందోళన చెందుతారు. సోదరుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. ఎదుటివారి అభిప్రాయలకు విలువ ఇవ్వండి. ప్రియతముల ఆహ్వానం సంతోషం కలిగిస్తుంది. సంతానం పై చదువులపై దృష్టిపెడతారు. పోయాయనుకున్న వస్తువులు లభ్యమవుతాయి. ఆరోగ్యం బాగుంటుంది. శుభకార్యానికి హాజరవుతారు. ప్రయాణం సజావుగా సాగుతుంది. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
శుభకార్యం నిశ్చయమవుతుంది. వేదికలు అన్వేషిస్తారు. రావలసిన ధనం అందుతుంది. ప్రణాళికలు వేసుకుంటారు. ఖర్చులు అధికం. ధనానికి లోటుండదు. విలాసాలకు వ్యయం చేస్తారు. పత్రాల్లో సవరణలు అనుకూలిస్తాయి. సన్నిహితులతో తరచుగా సంభాషిస్తుంటారు. ఎదురుచూస్తున్న పత్రాలు అందుతాయి. గృహమరమ్మతులు చేపడతారు. ఆరోగ్యం జాగ్రత్త. అతిగా శ్రమించవద్దు. ఔషధసేవనం, ఆహార నియమాలు క్రమం తప్పకుండా పాటించండి. చిన్ననాటి పరిచయస్తులు తారసపడతారు. గత సంఘటనలు అనుభూతినిస్తాయి. సంతానం అత్యుత్సాహం అదుపు చేయండి. అవగాహన లేని విషయాల్లో జోక్యం తగదు. మీ గౌరవానికి భంగం కలుగకుండా మెలగండి. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. కొత్త పరిచయాలేర్పడతాయి. అసాంఘిక కార్యకలాపాల జోలికి పోవద్దు.
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
సంప్రదింపులు ముగుస్తాయి. సమయస్ఫూర్తిగా వ్యవహరిస్తారు. రుణ సమస్య పరిష్కారమవుతుంది. ఆదాయం సంతృప్తికరం. వాహనం, గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. కుటుంబసౌఖ్యం, ప్రశాంతత పొందుతారు. వస్త్రప్రాప్తి, వస్తులాభం ఉన్నాయి. సంతానం ఉన్నత చదువులపై దృష్టిపెడతారు. ఒక సమాచారం తీవ్రంగా ఆలోచింపచేస్తుంది. ప్రకటనలు, ఫోన్ సందేశాలు పట్టించుకోవద్దు. ముఖ్యమైన పత్రాలు అందుకుంటారు. మీ చొరవతో వివాహసంబంధం కుదురుతుంది. బంధుత్వాలు, పరిచయాలు బలపడతాయి. పెద్దల గురించి ఆందోళన చెందుతారు. అయిన వారి మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. మీ ఇష్టాయిష్టాలను ఖచ్చితంగా తెలియజేయండి. మొహమ్మాటాలు, భేషజాలకు పోవద్దు. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు సానుకూలమవుతాయి. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
ఈ మాసం యోగదాయకం. పరిస్థితులు మెరుగుపడతాయి. సమర్ధతను చాటుకుంటారు. స్థిరాస్తి ధనం అందుతుంది. అవసరాలు నెరవేరుతాయి. చెల్లింపులు, నగదు స్వీకరణలో జాగ్రత్త. అర్ధాంతంగా నిలిపివేసిన పనులు పూర్తవుతాయి. శుభకార్యం నిశ్చయమవుతుంది. వేదికలు అన్వేషిస్తారు. స్నేహసంబంధాలు బలపడతాయి. ఆప్తులతో తరుచూ సంభాషిస్తుంటారు. కనిపించకుండా పోయిన వస్తువులు లభిస్తాయి. ఆహ్వానం అందుకుంటారు. సంస్థల స్థాపనలకు అనుకూలం. ప్రముఖులతో సంప్రదింపులు జరుపుతారు. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. కొత్త విషయాలు తెలుసుకుంటారు. వ్యవహారాలు మీ సమక్షంలో సాగుతాయి. మీ సలహా ఉభయులకూ ఆమోదయోగ్యమవుతుంది. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. ఆధ్యాత్మికత పట్ల ఆసక్తి కలుగుతుంది. ధార్మిక సంస్థలకు విరాళాలందిస్తారు. 
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
ఆదాయం బాగుంటుంది. పెట్టుబడులపై దృష్టి పెడతారు. పెద్దమొత్తం ధనసహాయం తగదు. మీ ఇబ్బందులను సున్నితంగా తెలియజేయండి. ఎవరినీ నొప్పించవద్దు. చెల్లింపుల్లో జాప్యం తగదు. వ్యవహార ఒప్పందాల్లో మెలకువ వహించండి. ఏ విషయాన్నీ తేలికగా తీసుకోవద్దు. పరిచయస్తుల రాకపోకలు అధికమవుతాయి. గృహం సందడిగా ఉంటుంది. ఆహ్వానం, కీలక పత్రాలు అందుకుంటారు. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. వివాహయత్నం తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం కలిసివచ్చే సూచనలున్నాయి. మీ అభిప్రాయాలను పెద్దల ద్వారా తెలియజేయండి. ప్రముఖులతో పరిచయాలు బలపడతాయి. కీలక పదవులు, బాధ్యతలు చేపడతారు. ప్రత్యర్థులతో జాగ్రత్త. ఒకరి వద్ద మరొకరి ప్రస్తావన తగదు. మీ మాటలు జారవేసే వారున్నారని గమనించండి. 
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
ఏ కార్యసాధనకు సంకల్పబలం ముఖ్యం. పట్టుదలతో యత్నాలు సాగించండి. సాయం ఆశించవద్దు. స్వయంకృషితోనే లక్ష్యం సాధిస్తారు. కలిసివచ్చిన అవకాశాన్ని తక్షణం అందిపుచ్చుకోండి. ఆదాయం బాగుంటుంది. అనవసర ఖర్చులు తగ్గించుకుంటారు. ప్రతి విషయంలోను ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తారు. ఆలోచనలు క్రియారూపం దాల్చుతాయి. మీ శ్రీమతి వద్ద దాపరికం తగదు. నోటీసులు అందుకుంటారు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. నిపుణులను సంప్రదిస్తారు. ఆరోగ్యం జాగ్రత్త. ఏ విషయాన్నీ తీవ్రంగా పరిగణించవద్దు. గృహమరమ్మతులు చేపడతారు. లైసెన్సులు, పర్మిట్ల రెన్యువల్లో జాప్యం తగదు. శుభకార్యానికి హాజరవుతారు. బంధుత్వాలు బలపడతాయి. చిన్ననాటి ఉపాధ్యాయులను కలుసుకుంటారు. విద్యార్థులు పరీక్షలు బాగా రాస్తారు. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
ప్రేమానుబంధాలు బలపడతాయి. మాటతీరుతో ఎదుటివారిని ఆకట్టుకుంటారు. పరిచయాలు ఉన్నతికి తోడ్పడతాయి. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. వాహనం అమర్చుకోవాలనే కోరిక నెరవేరుతుంది. ఆహ్వానం అందుకుంటారు. బంధుమిత్రుల రాకపోకలు అధికమవుతాయి. తరచు ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు. సంతానసౌఖ్యం, ప్రశాంతత పొందుతారు. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తవుతాయి. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఆశించిన సంబంధం కుదరకపోవచ్చు. ఇదీ ఒకందుకు మంచికే. త్వరలో మీ కృషి ఫలిస్తుంది. కాంట్రాక్టులు, టెండర్లు దక్కించుకుంటారు. స్వల్ప అస్వస్థతకు గురవుతారు. సొంత పరిజ్ఞానంతో మందులు వేసుకోవద్దు. సంతానం పై చదువులను వారి ఇష్టానికే వదిలేయండి. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. 
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
వ్యవహార ఒప్పందాల్లో ఆచితూచి అడుగేయాలి. అనాలోచిత నిర్ణయాలు నష్టం కలిగిస్తాయి. సన్నిహితుల సలహా పాటించండి. ఏకపక్షంగా వ్యవహరించవద్దు. ఆదాయం బాగున్నా సంతృప్తి ఉండదు. తెలియని వెలితి వెన్నాడుతుంది. దుబారా ఖర్చులు విపరీతం. దంపతుల మధ్య తరచు అకారణ కలహం. ఆప్తుల చొరవతో ఒక సమస్య పరిష్కారమవుతుంది. ఇంటి విషయాలపై దృష్టిపెట్టండి. ఏ విషయాన్నీ తీవ్రంగా భావించవద్దు. ఈ చికాకులు తాత్కాలికమే. సన్నిహితులు హితవు మీపై సత్ప్రభావం చూపుతుంది. సంతానం భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. శుభకార్యానికి హాజరవుతారు. బంధుమిత్రుల ఆతిధ్యం ఆకట్టుకుంటుంది. పరస్పరం కానుకలిచ్చిపుచ్చుకుంటారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడవద్దు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

TTD: రూ. 5,456 కోట్ల వార్షిక బడ్జెట్‌ను ఆమోదించిన టీటీడీ