Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

16-11-2025 ఆదివారం రాశి ఫలాలు - మీ సామర్ధ్యంపై నమ్మకం పెంచుకోండి...

Advertiesment
daily astrology

రామన్

, ఆదివారం, 16 నవంబరు 2025 (07:00 IST)
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
సర్వత్రా అనుకూలం. కష్టం ఫలిస్తుంది. మానసికంగా స్థిమితపడతారు. పొదుపు పథకాల పట్ల ఆకర్షితులవుతారు. అనుభవజ్ఞులను సంప్రదిస్తారు. ప్రణాళికాబద్ధంగా పనులు పూర్తిచేస్తారు. ఆత్మీయుల ఆహ్వానం ఉత్సాహాన్నిస్తుంది. ప్రయాణం ఉల్లాసంగా సాగుతుంది. 
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. అయిన వారి ప్రోత్సాహం ఉంటుంది. అవకాశాలను అందిపుచ్చుకుంటారు. రోజువారీ ఖర్చులే ఉంటాయి. పత్రాల రెన్యువల్లో ఏకాగ్రత వహించండి. పనులు వేగవంతమవుతాయి. సేవ, పుణ్యకార్యంలో పాల్గొంటారు. 
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ధ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
అనుకున్నది సాధిస్తారు. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. మీ సత్తా చాటుకుంటారు. ఖర్చులు సంతృప్తికరం. కష్టమనుకున్న పనులు తేలికగా పూర్తవుతాయి. ఉల్లాసంగా గడుపుతారు. నగదు, ఆభరణాలు జాగ్రత్త. అపరిచితులతో మితంగా సంభాషించండి. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
మీ సామర్ధ్యంపై నమ్మకం పెంచుకోండి. మీ శ్రీమతి వ్యాఖ్యలు కార్మోన్ముఖులను చేస్తాయి. ఆత్మస్థైర్యంతో యత్నాలు సాగిస్తారు. ఖర్చులు విపరీతం. ఆత్మీయుల సాయం అందిస్తారు. కీలక పత్రాలు అందుకుంటారు. ప్రముఖుల సందర్శనం అనుకూలించదు. 
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి. రుణఒత్తిళ్లతో మనశ్శాంతి ఉండదు. ఆలోచనలతో సతమతమవుతారు. సన్నిహితుల చొరవతో సమస్య సానుకూలమవుతుంది. ఖర్చులు విపరీతం. చేసిన పనులే చేయవలసి వస్తుంది. అసాంఘిక కార్యకలాపాల జోలికి పోవద్దు. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
అందరితో కలుపుగోలుగా వ్యవహరిస్తారు. సంప్రదింపులకు అనుకూలం. ఒప్పందాల్లో ఆచితూచి అడుగువేయండి. ఖర్చులు విపరీతం. నిలిపివేసిన పనులు పూర్తి చేస్తారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. కొత్త వ్యక్తులతో జాగ్రత్త. బ్యాంకు వివరాలు వెల్లడించవద్దు. 
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
చాకచక్యంగా అడుగులేస్తారు. మీ శ్రమ ఫలిస్తుంది. ధనలాభం, వాహనసౌఖ్యం ఉన్నాయి. వేడుకకు సన్నాహాలు సాగిస్తారు. పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. ముఖ్యుల కలయిక వీలుపడదు. వనసమారాధనలో పాల్గొంటారు. బెట్టింగ్లకు పాల్పడవద్దు. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
సమస్యను ధైర్యంగా ఎదుర్కుంటారు. మీ నిజాయితీకి ప్రశసంలు లభిస్తాయి. మీ కృషి ఫలిస్తుంది. ఖర్చులు విపరీతం. వ్యవహారాలు ధనంతో ముడిపడి ఉంటాయి. నగదు, ఆభరణాలు జాగ్రత్త. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. అనుకున్న మొక్కులు చెల్లించుకుంటారు. 
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
కష్టానికి తగిన ప్రతిఫలం దక్కుతుంది. ప్రణాళికలు వేసుకుంటారు. ఖర్చులు సామాన్యం. గృహమరమ్మతులు చేపడతారు. బాధ్యతలు స్వయంగా చూసుకోండి. అపరిచితులను నమ్మవద్దు. పెద్దల ఆరోగ్యం కుదుటపడుతుంది. సోదరులతో సంప్రదింపులు జరుపుతారు.
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
ఆశలొదిలేసుకున్న బాకీలు వసూలవుతాయి. ఖర్చులు విపరీతం. లావాదేవీలతో తీరిక ఉండదు. ముఖ్య సమాచారాన్ని లౌక్యంగా రాబట్టుకోవాలి. ఆధిపత్యం ప్రదర్శించవద్దు. పనులు మందకొడిగా సాగుతాయి. వనసమారాధన పోటీల్లో విజయం సాధిస్తారు.
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
కీలక అంశాలపై పట్టు సాధిస్తారు. మీ నమ్మకం వమ్ముకాదు. కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. పనులు సానుకూలమవుతాయి. ప్రముఖుల సందర్శనం వీలుపడదు. ఆప్తులతో సంభాషిస్తారు. ఒక సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. వేడుకల్లో అందరినీ ఆకట్టుకుంటారు. 
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
సమర్ధతను చాటుకుంటారు. అవకాశం కలిసివస్తుంది. దుబారా ఖర్చులు విపరీతం. కొందరి రాక ఇబ్బంది కలిగిస్తుంది. అర్ధాంతంగా పనులు నిలిపివేస్తారు. ఫోన్ సందేశాలు నమ్మవద్దు. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి. శుభకార్యానికి హాజరవుతారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

16-11- 2025 నుంచి 22-11-2025 వరకు మీ వార రాశిఫలాలు