Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

16-01-2026 శుక్రవారం ఫలితాలు - పందాలు, బెట్టింగుల జోలికి పోవద్దు...

Advertiesment
daily horoscope
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
కార్యసాధనకు సంకల్పబలం ముఖ్యం. పట్టుదలతో యత్నాలు కొనసాగించండి. మీ కృషికి సన్నిహితులు ప్రోత్సాహం ఉంటుంది. ఖర్చులు విపరీతం. పనులు హడావుడిగా సాగుతాయి. ముఖ్యుల సందర్శనం వీలుపడదు. పందాలు, బెట్టింగుల జోలికి పోవద్దు.
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
సర్వత్రా అనుకూలదాయకం. కార్యం సిద్ధిస్తుంది. ఉల్లాసంగా గడుపుతారు. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. వ్యూహాత్మకంగా అడుగులేస్తారు. పనులు సానుకూలమవుతాయి. ప్రణాళికలు వేసుకుంటారు. ఖర్చులు విపరీతం. క్రీడా పోటీల్లో విజయం సాధిస్తారు.
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
సంప్రదింపులు కొలిక్కివస్తాయి. వాక్పటిమతో నెట్టుకొస్తారు. అనుకున్న విధంగా పనులు పూర్తి చేస్తారు. ఖర్చులు విపరీతం. అప్రమత్తంగా ఉండాలి. ఆంతరంగిక విషయాలు వెల్లడించవద్దు. ఆప్తులతో ఉల్లాసంగా గడుపుతారు. మీ ప్రమేయంతో ఒకరికి మంచి జరుగుతుంది. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
కార్యక్రమాలు నిరాటంకంగా సాగుతాయి. వ్యాపకాలు సృష్టించుకుంటారు. రావలసిన ధనం అందుతుంది. ఆప్తులకు సాయం అందిస్తారు. పనులు సానుకూలమవుతాయి. వ్యవహారాల్లో ఏకాగ్రత వహించండి. పత్రాలు, ఆభరణాలు జాగ్రత్త. వేడుకకు హాజరవుతారు. 
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
వాక్చాతుర్యంతో నెట్టుకొస్తారు. ప్రతిభాపాటవాలు వెలుగుచూస్తాయి. ప్రముఖులను ఆకట్టుకుంటారు. సభ్యత్వాలు స్వీకరిస్తారు. బాధ్యతలు, వ్యాపకాలు అధికమవుతాయి. ఖర్చులు విపరీతం. కీలకపత్రాలు సమయానికి కనిపించవు. విందులు, వేడుకల్లో అందరినీ ఆకట్టుకుంటారు. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
ఆప్తుల కలయిక ఉత్సాహపరుస్తుంది. ధైర్యంగా యత్నాలు సాగిస్తారు. పనులు సానుకూలమవుతాయి. సోదరులతో సంప్రదింపులు జరుపుతారు. మీ అభిప్రాయాలకు స్పందన లభిస్తుంది. ఆప్తులను విందుకు ఆహ్వానిస్తారు. పుణ్యక్షేత్రాలు, కొత్త ప్రదేశాలు సందర్శిస్తారు. 
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
ముఖ్యమైన వ్యవహారాలు వాయిదా వేయండి. అనాలోచిత నిర్ణయాలు తగవు, అనుభవజ్ఞులను సంప్రదించండి. పనుల్లో శ్రమ, చికాకులు అధికం. దుబారా ఖర్చులు విపరీతం. ఆత్మీయులతో సంభాషిస్తారు. మీ శ్రీమతిలో ఆశించిన మార్పు వస్తుంది. విందుకు హాజరవుతారు. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
మీదైన రంగంలో నిలదొక్కుకుంటారు. అంచనాలు ఫలిస్తాయి. చాకచక్యంగా అడుగులేస్తారు. మీ వ్యక్తిత్వానికి గౌరవం లభిస్తుంది. ఆర్భాటాలకు వ్యయం చేస్తారు. చేసిన పనులే చేయవలసి వస్తుంది. నోటీసులు అందుకుంటారు. ముఖ్యులకు స్వాగతం పలుకుతారు.
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
కీలక అంశాలపై పట్టు సాధిస్తారు. మీ సామర్థ్యంపై ఎదుటివారికి గురి కుదురుతుంది. వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండాలి. ఖర్చులు విపరీతం. కొత్త వ్యక్తులతో జాగ్రత్త. అనవసర విషయాలకు ప్రాధాన్యమివ్వవద్దు. ఎడ్లపందాలు, క్రీడా పోటీల్లో గెలుపొందుతారు.
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
బాధ్యతగా వ్యవహరించండి. యాదృచ్ఛికంగా తప్పులు దొర్లే ఆస్కారం ఉంది. సాయం ఆశించవద్దు. రావలసిన ధనం అందుతుంది. అవసరాలు నెరవేరుతాయి. పనుల ప్రారంభంలో ఆటంకాలు ఎదురవుతాయి. శకునాలు పట్టించుకోవద్దు. ఆశావహదృక్పధంతో మెలగండి. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
అవిశ్రాంతంగా శ్రమిస్తారు. మీ కృషి ఫలిస్తుంది. ఖర్చులు అదుపులో ఉండవు. విలాసాలకు వ్యయం చేస్తారు. పనులు మందకొడిగా సాగుతాయి. ముఖ్యుల కలయిక వీలుపడదు. పత్రాలు అందుకుంటారు. ఒక సమాచారం ఊరటనిస్తుంది. కీలక చర్చల్లో పాల్గొంటారు. 
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
లావాదేవీలతో సతమతమవుతారు. కార్యక్రమాలు ముందుకు సాగవు. రావలసిన ధనం అందుతుంది. ఖర్చులు అధికం. ప్రముఖులతో పరిచయాలు బలపడతాయి. సభ్యత్వాలు స్వీకరిస్తారు. వ్యతిరేకులతో జాగ్రత్త. పనులు సానుకూలమవుతాయి. ఆత్మీయులతో సంభాషిస్తారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

15-01-2026 గురువారం ఫలితాలు - ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు...