Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

14-04-2026 మంగళవారం ఫలితాలు - మీ మాటతీరు అపోహాలకు దారితీస్తుంది...

Advertiesment
daily horoscope
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
స్థిమితంగా పనులు పూర్తి చేస్తారు. రోజువారీ ఖర్చులే ఉంటాయి. కొత్త వ్యక్తులతో జాగ్రత్త. ప్రముఖుల ఇంటర్వ్యూ వీలుపడదు. వూహాత్మకంగా అడుగులేస్తారు. పోయాయనుకున్న వస్తువులు లభ్యమవుతాయి. ఆత్మీయులతో సంభాషిస్తారు. బెట్టింగుల జోలికి పోవద్దు.
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
వ్యవహారంలో తప్పటడుగు వేస్తారు. మీ మాటతీరు అపోహాలకు దారితీస్తుంది. దుబారా ఖర్చులు విపరీతం. పనులు మొండిగా పూర్తిచేస్తారు. ఫోన్ సందేశాలను పట్టించుకోవద్దు. నోటీసులు అందుకుంటారు. సన్నిహితుల జోక్యంతో ఒక సమస్య సద్దుమణుగుతుంది.
 
మిధునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
కార్యసాధనకు మరింత శ్రమించాలి. సాయం ఆశించవద్దు. లావాదేవీలతో సతమతమవుతారు. పనులు ముందుకు సాగవు. అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు. అనవసర జోక్యం తగదు. ప్రియతముల రాక ఉత్సాహాన్నిస్తుంది. కొత్త యత్నాలు చేపడతారు.
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
అనుకూలతలున్నాయి. రుణ సమస్య పరిష్కారమవుతుంది. వ్యాపకాలు అధికమవుతాయి. ఆర్భాటాలకు వ్యయం చేస్తారు. గృహంలో స్తబ్ధత తొలగుతుంది. మితంగా సంభాషించండి. ఒక ఆహ్వానం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఆరోగ్యం జాగ్రత్త, అతిగా శ్రమించవద్దు. 
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
కలిసివచ్చే సమయం. సమర్ధతను చాటుకుంటారు. వ్యవహారానుకూలత ఉంది. పరిచయాలు ఉన్నతికి తోడ్పడతాయి. ఖర్చులు తగ్గించుకుంటారు. పనులు త్వరితగతిన సాగుతాయి. బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. ప్రయాణంలో ఒకింత అవస్థలెదుర్కుంటారు. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
ధైర్యంగా యత్నాలు సాగించండి. వ్యాఖ్యలు పట్టించుకోవద్దు. మీ సామర్ధ్యంపై నమ్మకం పెంచుకోండి. నగదు, విలువైన వస్తువులు జాగ్రత్త. మీ శ్రీమతి వైఖరి అసహనం కలిగిస్తుంది. ఒకరి వద్ద మరొకరి ప్రస్తావన తగదు. కీలక పత్రాల్లో సవరణలు సాధ్యమవుతాయి. 
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
ఆర్ధికంగా ఆశించిన ఫలితాలున్నాయి. లావాదేవీల్లో తగిన నిర్ణయాలు తీసుకుంటారు. రావలసిన ధనం అందుతుంది. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. కొత్త వ్యక్తులతో మితంగా సంభాషించండి. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
సమయస్ఫూర్తిగా మెలగాలి. అనాలోచిత నిర్ణయం తగదు. పెద్దల సలహా పాటించండి. అనుకోని ఖర్చు తగులుతుంది. నగదు డ్రా చేసేటపుడు జాగ్రత్త. విలాస వస్తువులు కొనుగోలు చేస్తారు. పాత పరిచయస్తులను కలుసుకుంటారు. విందులు, వేడుకకు హాజరవుతారు. 
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
శ్రమించినా ఫలితం ఉండదు. ఒత్తిడి పెరగకుండా చూసుకోండి. పనులు అర్థాంతగా ముగించవలసి వస్తుంది. కొందరి వ్యాఖ్యలు నిరుత్సాహపరుస్తాయి. ధైర్యంగా యత్నాలు సాగించండి. దుబారా ఖర్చులు విపరీతం. సన్మాన, సాహిత్య కార్యక్రమాల్లో పాల్గొంటారు. 
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
ప్రణాళికలు వేసుకుంటారు. అంచనాలు ఫలిస్తాయి. ప్రముఖులకు సన్నిహితులవుతారు. వ్యతిరేకులతో జాగ్రత్త. విలాసాలకు వ్యయం చేస్తారు. పనులు త్వరితగతిన సాగుతాయి. ఉల్లాసంగా గడుపుతారు. నోటీసులు అందుకుంటారు. ముఖ్యులకు వీడ్కోలు పలుకుతారు. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
ధైర్యంగా యత్నాలు సాగించండి. అవకాశాలను వదులుకోవద్దు. అందరితోను మితంగా సంభాషించండి. కొంతమంది మీ వ్యాఖ్యలను వక్రీకరిస్తారు. ఖర్చులు విపరీతం. మొక్కుబడిగా పనులు పూర్తి చేస్తారు. ఆత్మీయులను సంప్రదిస్తారు. వివాదం సద్దుమణుగుతుంది. 
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
లక్ష్యసాధనకు ఓర్పు, పట్టుదల ప్రధానం. నిరుత్సాహం వీడి యత్నాలు సాగించండి. చాకచక్యంగా పనులు చక్కబెట్టుకోవాలి. ధనసమస్య తలెత్తకుండా జాగ్రత్త వహించండి. ముఖ్యుల సందర్శనం వీలుపడదు. ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

13-04-2026 సోమవారం ఫలితాలు - గ్రహస్థితి ఆశాజనకం.. పరిస్థితులు చక్కబడతాయి...