Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

14-02-2026 శనివారం ఫలితాలు - పన్ను చెల్లింపుల్లో జాప్యం తగదు....

Advertiesment
astrology
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
ఆలోచనలతో సతమతమవుతారు. శ్రమించినా ఫలితం శూన్యం. నిస్తేజానికి లోనవుతారు. ఆకస్మిక ఖర్చు అందోళన కలిగిస్తుంది. చేబదుళ్లు తీసుకుంటారు. పనులు సాగవు. ఆప్తులతో సంభాషిస్తారు. పత్రాల రెన్యువల్లో అలక్ష్యం తగదు. బెట్టింగ్లకు పాల్పడవద్దు. 
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
వాక్చాతుర్యంతో నెట్టుకొస్తారు. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. వ్యతిరేకులను ఆకట్టుకుంటారు. సంప్రదింపులకు తగిన సమయం. మీ అభిప్రాయాలకు స్పందన లభిస్తుంది. ఖర్చులు విపరీతం. కొందరి రాక చికాకుపరుస్తుంది. కార్యక్రమాలు ముందుకు సాగవు.
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
కార్యసాధనలో సఫలీకృతులవుతారు. సంకల్పం సిద్ధిస్తుంది. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. యత్నాలను అయిన వారు ప్రోత్సహిస్తారు. వస్తులాభం, వస్త్రప్రాప్తి పొందుతారు. వాయిదా పడిన మొక్కులు తీర్చుకుంటారు. ఏకాగ్రతతో వాహనం నడపండి. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
అనవసర ఒత్తిడికి గురికావద్దు. స్థిమితంగా ఉండటానికి యత్నించండి. ఆర్భాటాలకు విపరీతంగా ఖర్చు చేస్తారు. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. కొన్ని విషయాలు చూసీచూడనట్టు వదిలేయండి. శుభకార్యానికి హాజరవుతారు. పరస్పరం కానుకలిచ్చిపుచ్చుకుంటారు. 
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
గ్రహాల సంచారం బాగుంది. అవకాశాలను చేజిక్కించుకుంటారు. వ్యూహాత్మకంగా అడుగులేస్తారు. పనులు వేగవంతమవుతాయి. పొదుపు ధనం అందుతుంది. అప్రమత్తంగా ఉండాలి. యత్నాలు విరమించుకోవద్దు. స్థల వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
నిర్దేశిత ప్రణాళికలతో యత్నాలు సాగిస్తారు. కష్టమనుకున్న పనులు తేలికవుతాయి. ఖర్చులు విపరీతం. ఆప్తులు సాయం అందిస్తారు. లావాదేవీలతో తీరిక ఉండదు. పరిచయం లేని వారితో జాగ్రత్త. ఆంతరంగిక విషయాలు గోప్యంగా ఉంచండి. ఆలయాలు సందర్శిస్తారు. 
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
అవిశ్రాంతంగా శ్రమిస్తారు. గుట్టుగా మెలగండి. బ్యాంకు వివరాలు వెల్లడించవద్దు. పెద్దఖర్చు తగిలే సూచనలున్నాయి. ప్రముఖుల సందర్శనం వీలుపడదు. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. గృహమరమ్మతులు చేపడతారు. సోదరుల నుంచి అభ్యంతరాలెదురవుతాయి. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
వ్యవహారాల్లో ఏకాగ్రత తగ్గకుండా చూసుకోండి. కొందరి వ్యాఖ్యలు నిరుత్సాహపరుస్తాయి. ధైర్యంగా ముందుకు సాగండి. కృషి ఫలించకున్నా అధైర్యపడవద్దు. శుభవార్త వింటారు. ఖర్చులు విపరీతం. పనులు ఒక పట్టాన సాగవు. చీటికిమాటికి చికాకుపడతారు. 
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
ఆదాయానికి లోటు లేకున్నా సంతృప్తి ఉండదు. తెలియని వెలితి వెన్నాడుతుంది. రోజువారీ ఖర్చులే ఉంటాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. అనవసర విషయాల్లో జోక్యం తగదు. ఆత్మీయులను కలుసుకుంటారు. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. 
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
సర్వత్రా అనుకూలమే. మీ కృషి ఫలిస్తుంది. కార్యసిద్ధి, వ్యవహార జయం ఉన్నాయి. ప్రముఖులను ఆకట్టుకుంటారు. పనులు వేగవంతమవుతాయి. గృహం ప్రశాంతంగా ఉంటుంది. ఖర్చులు విపరీతం. నగదు డ్రా చేసేటపుడు జాగ్రత్త. బాధ్యతలు అప్పగించవద్దు. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
నేడు యోగదాయకం. స్నేహసంబంధాలు బలపడతాయి. వ్యతిరేకులు సన్నిహితులవుతారు. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. నిలిపివేసిన పనులు పునఃప్రారంభిస్తారు. వ్యవహారాలు మీ సమక్షంలో సాగుతాయి. వాహన సౌఖ్యం పొందుతారు. ఖర్చులు సామాన్యం. 
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
వ్యవహారానుకూలత ఉంది. ఎంతటివారినైనా ఇట్టే ఆకట్టుకుంటారు. తలపెట్టిన కార్యం విజయవంతమవుతుంది. పన్ను చెల్లింపుల్లో జాప్యం తగదు. అర్ధాంతంగా ముగించిన పనులు పూర్తి చేస్తారు. వేడుకకు హాజరవుతతారు. ఇంటిని నిర్లక్ష్యంగా వదిలి వెళ్లకండి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

13-02-2026 శుక్రవారం ఫలితాలు - పనుల్లో ఆటంకాలు ఎదురైనా ఎట్టకేలకు పూర్తి చేస్తారు...