Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

12-02- 2026 గురువారం ఫలితాలు - దంపతుల మధ్య స్వల్ప కలహం

Advertiesment
daily astrology
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
మనోధైర్యంతో యత్నాలు సాగించండి. దీక్షతో శ్రమిస్తేనే కార్యం నెరవేరుతుంది. ఆకస్మిక ఖర్చు ఆందోళన కలిగిస్తుంది. అవసరాలు, వాయిదా వేసుకుంటారు. పనులు ఒక పట్టాన సాగవు. సన్నిహితులతో సంభాషిస్తారు. ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుంటారు. 
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
లక్ష్యసాధనకు ఓర్పు ప్రధానం. అపజయం మీలో పట్టుదలను రేకెత్తిస్తుంది. మొండిగా యత్నాలు సాగిస్తారు. పనులు సానుకూలమవుతాయి, ఖర్చులు తగ్గించుకుంటారు. ఊహించని సంఘటన ఎదురవుతుంది. సోదరులతో సంప్రదింపులు జరుపుతారు. 
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
ఒత్తిళ్లకు గురికావద్దు. స్థిమితంగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఖర్చులు అధికం. నగదు డ్రా చేసేటపుడు జాగ్రత్త. పనులు చురుకుగా సాగుతాయి. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ద్విచక్రవాహనంపై దూరప్రయాణం తగదు. పుణ్యకార్యంలో పాల్గొంటారు. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
అభీష్టం నెరవేరుతుంది. సమర్ధతను చాటుకుంటారు. కొత్త పరిచయాలు బలపడతాయి. పురస్కారాలు అందుకుంటారు. కీలక వ్యవహారాల్లో ఏకాగ్రతను కోల్పోవద్దు. పొగిడే వ్యక్తులతో జాగ్రత్త. పనులు మందకొడిగా సాగుతాయి. ఆర్భాటాలకు ఖర్చు చేస్తారు. 
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
ఆర్ధికలావాదేవీలు సంతృప్తినిస్తాయి. రావలసిన ధనం సకాలంలో అందుతుంది. ఖర్చులు అధికం. ప్రణాళికాబద్ధంగా పనులు పూర్తిచేస్తారు. అవగాహన లేని విషయాల్లో జోక్యం తగదు. ఒక సమాచారం నిరుత్సాహపరుస్తుంది. ముఖ్యులకు స్వాగతం పలికారు. ఆత్మీయ వీడ్కోలు పలుకుతారు. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
పరిస్థితులు అనుకూలిస్తాయి. చాకచక్యంగా జరుగులేస్తారు. మీ నమ్మకం వమ్ముకాదు. లక్ష్యసాధనకు చేరువవుతారు. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలేర్పడతాయి. సావకాశంగా పనులు పూర్తిచేస్తారు. ఖర్చులు అదుపులో ఉండవు. కొత్త ప్రదేశం సందర్శిస్తారు. 
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
విశేష ఫలితాలున్నాయి. అవకాశాలను చేజిక్కించుకుంటారు. ధనవ్యయంలో మితం పాటించండి. పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. దంపతుల మధ్య స్వల్ప కలహం. సామరస్యంగా మెలగండి. ఏ విషయాన్నీ పెద్దది చేసుకోవద్దు. ఆత్మీయులతో సంభాషణ ఊరటనిస్తుంది. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
అన్ని విధాలా అనుకూలం. మీ తప్పిదాలు సరిదిద్దుకునే అవకాశం లభిస్తుంది. సన్నిహితుల జోక్యంతో ఒక సమస్య సద్దుమణుగుతుంది. రోజువారీ ఖర్చులే ఉంటాయి. చేపట్టిన పనులు మధ్యలో నిలిపివేయొద్దు. ఆహ్వానం అందుకుంటారు. ఆరోగ్యం కుదుటపడుతుంది. 
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
కష్టం ఫలిస్తుంది. అవకాశాలు కలిసివస్తాయి. ప్రణాళికలు వేసుకుంటారు, ఖర్చులు విపరీతం. శుభకార్యానికి సన్నాహాలు సాగిస్తారు. పనులు, బాధ్యతలు అప్పగించవద్దు, కొత్త వ్యక్తులతో జాగ్రత్త, మితంగా మాట్లాడండి. కొంతమంది మీ వ్యాఖ్యలను తప్పుపడతారు.
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
గ్రహిస్థితి అనుకూలంగా ఉంది. ధైర్యంగా అడుగు ముందుకేయండి. పెద్దల ప్రోత్సాహం ఉంటుంది. లావీదేవీలు కొలిక్కివస్తాయి. ఆర్భాటాలకు ఖర్చుచేస్తారు. బంధువుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. దంపతుల మధ్య సఖ్యత లోపం. ఫోన్ సందేశాలను పట్టించుకోవద్దు. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
ఆటుపోట్లకు ధీటుగా స్పందిస్తారు. ఆత్మీయుల వ్యాఖ్యలు ఉత్తేజపరుస్తాయి. అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారు. రోజువారీ ఖర్చులే ఉంటాయి. ధనసహాయం తగదు. చేస్తున్న పనులు మధ్యలో నిలిపివేయొద్దు, నోటీసులు అందుకుంటారు. ప్రయాణం కలిసివస్తుంది. 
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
కార్యానుకూలత ఉంది. దీక్షతో శ్రమించి మంచి ఫలితం సాధిస్తారు. ఖర్చులు తగ్గించుకుంటారు. గృహం ప్రశాంతంగా ఉంటుంది. ఆత్మీయులతో సంభాషిస్తారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు సానుకూలమవుతాయి. మీ జోక్యంతో ఒక సమస్య సానుకూలమవుతుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మహా శివరాత్రి.. భక్తుల ప్రయాణం సులభతరం.. టీజీఎస్సార్టీసీ ప్రత్యేక బస్సులు