Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

11-02-2026 బుధవారం ఫలితాలు - వాక్యాతుర్యంతో నెట్టుకొస్తారు....

Advertiesment
rashiphal
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
వ్యవహారానుకూలత ఉంది. అవకాశాలు కలిసివస్తాయి. పట్టుదలతో ముందుకు అడుగు వేస్తారు. పనులు సకాలంలో పూర్తిచేస్తారు. ఖర్చులు అధికం. పెట్టుబడుల విషయం పునరాలోచించండి. మనోధైర్యంతో యత్నాలు సాగిస్తారు. కీలక పత్రాలు అందుతాయి.
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
స్థిరాస్తి ధనం అందుతుంది. తాకట్టు విడిపించుకుంటారు. గృహం ప్రశాంతంగా ఉంటుంది. స్థిమితంగా పనులు పూర్తి చేస్తారు. నగదు, ఆభరణాలు జాగ్రత్త. బాధ్యతలు అప్పగించవద్దు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు.
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
ఆర్థికంగా మంచి ఫలితాలున్నాయి. ప్రణాళికలు వేసుకుంటారు. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. మీ జోక్యంతో ఒక సమస్య సద్దుమణుగుతుంది. పనులు పురమాయించవద్దు. వాయిదా చెల్లింపుల్లో జాప్యం తగదు. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
లావాదేవీలు ముగుస్తాయి. సముచిత నిర్ణయం తీసుకుంటారు. ఖర్చులు విపరీతం. వ్యాపకాలు సృష్టించుకుంటారు. మీ కృషిలో లోపం లేకుండా చూసుకోండి. అప్రమత్తంగా ఉండాలి. ఎవరినీ అతిగా నమ్మవద్దు. పనులు, బాధ్యతలు స్వయంగా చూసుకోండి. 
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
కార్యం సిద్ధిస్తుంది. సంప్రదింపులు ఫలిస్తాయి. రుణసమస్య పరిష్కారమవుతుంది. ఖర్చులు సామాన్యం. సేవా సంస్థలకు విరాళాలు అందిస్తారు. పనులు సానుకూలమవుతాయి. అనవసర జోక్యం తగదు. కొత్త విషయాలు తెలుసుకుంటారు. బెట్టింగులకు పాల్పడవద్దు, 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
నేడు అనుకూలదాయకం. మనోధైర్యంతో యత్నాలు సాగించండి. సంకల్పబలంతో కార్యం సాధిస్తారు. చేస్తున్న పనులు మధ్యలో నిలిపివేయొద్దు. చెల్లింపులు, నగదు స్వీకరణలో జాగ్రత్త. మీ శ్రీమతి తీరు అసహనం కలిగిస్తుంది. పత్రాల్లో సవరణలు సాధ్యమవుతాయి.
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. వ్యూహాత్మకంగా అడుగులేస్తారు. కొన్ని విషయాలు ఊహించినట్టే జరుగుతాయి. లావాదేవీలతో తీరిక ఉండదు. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఖర్చులు సామాన్యం. పనుల్లో చికాకులు అధికం. పత్రాలు, విలువైన వస్తువులు జాగ్రత్త. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
పట్టుదలతో శ్రమిస్తేనే పనులు సానుకూలమవుతాయి. అనవసర బాధ్యతలు తీసుకోవద్దు. మీ అభిప్రాయాలను లౌక్యంగా తెలియజేయండి. ఖర్చులు అదుపులో ఉండవు. పరిచయుస్తుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. కార్యక్రమాలు ముందుకు సాగవు. ఆత్మీయులతో సంభాషిస్తారు.
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
పొదుపు ధనం అందుతుంది. ఖర్చులు తగ్గించుకుంటారు. ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. ప్రముఖులు మీ సమర్థతను గుర్తిస్తారు. సభ్యత్వాల స్వీకరణకు అనుకూలం. బాధ్యతగా మెలగండి. వ్యతిరేకులతో జాగ్రత్త. పనులు త్వరితగతిన సాగుతాయి.
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
కొత్తయత్నాలు మొదలెడతారు. ఏకాగ్రతతో శ్రమించండి. మీ కష్టం తక్షణం ఫలిస్తుంది. మాట నిలబెట్టుకుంటారు. స్థిమితంగా పనులు పూర్తి చేస్తారు. ఖర్చులు సామాన్యం. అప్రమత్తంగా ఉండాలి. వాదోపవాదాలకు దిగవద్దు. ప్రయాణం సజావుగా సాగుతుంది. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
విశేషమైన ఫలితాలున్నాయి. వాక్యాతుర్యంతో నెట్టుకొస్తారు. కష్టమనుకున్న పనులు తేలికగా పూర్తవుతాయి. రావలసిన ధనం అందుతుంది. దుబారా ఖర్చులు తగ్గించుకుంటారు. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. రాజీమార్గంలో సమస్యలు పరిష్కరించుకుంటారు. 
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
సన్నిహితుల వ్యాఖ్యలు ఉత్సాహపరుస్తాయి. ధైర్యంగా యత్నాలు సాగిస్తారు. లావాదేవీల్లో ఏకాగ్రత వహించండి. పనులు సావకాశంగా పూర్తి చేస్తారు. ఖర్చులు సామాన్యం. వేడుకకు హాజరవుతారు. కానుకలిచ్చిపుచ్చుకుంటారు. ఇంటిని అలక్ష్యంగా వదిలి వెళ్లకండి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Maha shivaratri 2026 ఏ శివలింగాన్ని పూజిస్తే ఎలాంటి ఫలితం?