Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

08-05-2026: శుక్రవారం ఫలితాలు - సంకల్పబలంతోనే కార్యం సిద్ధిస్తుంది

Advertiesment
daily horoscope
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
సంకల్పబలంతోనే కార్యం సిద్ధిస్తుంది. మీ సామర్ధ్యంపై నమ్మకం పెంచుకోండి. సన్నిహితుల ప్రోత్సహిస్తారు. పనుల సానుకూలతకు కృషి ప్రధానం. ప్రముఖుల సందర్శన వీలుపడదు. స్థిరరరాస్తుల వ్యవహారంలో ఏకాగ్రత వహించండి, కీలక చర్యల్లో పాల్గొంటారు.
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
లావాదేవీలు ఫలిస్తాయి. సముచిత నిర్ణయం తీసుకుంటారు. రావలసిన ధనం అందుతుంది. అవసరాలు తీరుతాయి. ప్రణాళికాబద్ధంగా పనులు పూర్తి చేస్తారు. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. ఆత్మీయులతో సంభాషిస్తారు పోగొట్టుకున్న వస్తువులు లభ్యమవుతాయి. 
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
సంకల్పం సిద్ధిస్తుంది. ధనలాభం, వాహన యోగం ఉన్నాయి. మాటతీరులో అందరినీ ఆకట్టుకుంటారు. ముఖ్యుల కలయికి వీలుపడదు. ఆలోచనలు కార్యరూపం దాల్పుతాయి. విలాసాలకు ఖర్చు చేస్తారు. పనులు హడావుడిగా సాగుతాయి. సన్నిహితులతో సంభాషిస్తారు.
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
కలిసివచ్చే సమయం. ప్రతికూలతలను ఎదుర్కుంటారు. స్థిమితంగా పనులు పూర్తి చేస్తారు. ఖర్చులు అధికం. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. పెద్దలను సంప్రదిస్తారు. పత్రాల్లో సవరణలు సాధ్యమవుతాయి. ఆప్తులను కలుసుకుంటారు.
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
ఆత్మ స్థైర్యంతో యత్నాలు సాగిస్తారు. సన్నిహితులు ప్రోత్సాహం ఉంటుంది. అవకాశాలను అంది పుచ్చుకుంటారు. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. కీలక వ్యవహారాల్లో మెలకువ వహించండి. ఏకపక్ష నిర్ణయాలు తగవు. పనులు అనుకున్న విధంగా పూర్తవుతాయి. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
ప్రతికూలతలు అధికం. శ్రమించినా ఫలితం అంతంతమాత్రమే. మీ సామర్థ్యంపై నమ్మకం తగ్గుతుంది. ఆశావహదృక్పదంతో మెలగండి. అతిగా ఆలోచించవద్దు. పొదుపు ధనం గ్రహిస్తారు. పనులు మందకొడిగా సాగుతాయి. మీ శ్రీమతి విషయంలో దాపరికం తగదు. 
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
లక్ష్యసాధనకు ఓర్పు ప్రధానం. మనోధైర్యంతో యత్నాలు సాగించండి. మీ కృషి త్వరలో ఫలిస్తుంది. ఆప్తులకు మీ సమస్యలను తెలియజేయండి. దంపతుల మధ్య కలహం. పట్టుదలకు పోవద్దు. ఖర్చులు అదుపులో ఉండవు, అవసరాలు వాయిదా వేసుకుంటారు. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
రావలసిన ధనం అందుతుంది. పొదుపు పథకాలపై దృష్టి సారిస్తారు. అన్ని విధాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది. కొత్త యత్నాలు చేపడతారు. ఖర్చులు సామాన్యం ప్రముఖులకు చేరువవుతారు. పత్రాల్లో మార్పులు అనుకూలిస్తాయి. బెట్టింగ్‌కు పాల్పడవద్దు. 
 
ధనస్సు: మూల, పూర్వాషాడ 13.5 4 పాదములు, ఉత్తరాభాద్ర 1వ పాదం
చేపట్టిన కార్యం విజయవంతమవుతుంది. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. మొండి బాకీలు వసూలవుతాయి. ప్రముఖులకు సన్నిహితులవుతారు. ఫోన్ సందేశాలను నమ్మవద్దు, మాటతీరు అదుపులో ఉంచుకోండి ఎవరినీ తక్కువ అంచనా వేయొద్దు. 
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
వ్యవహార ఒప్పదాల్లో అప్రమత్తంగా ఉండాలి. అనాలోచిత నిర్ణయాలు తగవు. మీ సమస్యలను సన్నిహితులకు తెలియజేయండి. ధన సమస్య ఎదురవుతుంది. పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. ఆత్మీయులతో సంభాషిస్తారు. పిల్లలకు ఉన్నత చదువులపై దృష్టి సారిస్తారు.
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
ధైర్యంగా యత్నాలు సాగించండి. సాయం ఆశించవద్దు. శ్రమతో కూడిన ఫలితాలున్నాయి. పెద్దఖర్చు తగిలే ఆస్కారం ఉంది. పసులు ఒక పట్టాన పూర్తికావు. చిన్న విషయానికే చికాకుపడతారు. దైవకార్యంలో పాల్గొంటారు. ప్రయాణం ప్రశాంతంగా సాగుతుంది. 
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
మీ పనితీరు ప్రశంనీయమవుతుంది. కీలక అంశాలపై పట్టు సాధిస్తారు. సభ్యత్వాల స్వీకరణకు అనుకూలం. మరింత బాధ్యతగా వ్యవహరించాలి. ఆర్భాటాలకు విపరీతంగా వ్యయం చేస్తారు. పిల్లల దూకుడు అదుపు చేయండి. ఏ విషయాన్నీ తేలికగా తీసుకోవద్దు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తిరుమలలోని వీధులకు వేదాల పేర్లు.. పుష్కరిణికి శ్రీ కృష్ణదేవరాయల మార్గం