Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

06-05-2026 బుధవారం ఫలితాలు - తొందరపాటుతనం తగదు...

Advertiesment
Astrology
Astrology
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
వ్యవహార ఒప్పందాల్లో జాగ్రత్త ఆచితూచి అడుగేయాల్సిన సమయం. అనవసర జోక్యం తగదు. వివాదాల జోలికి పోవద్దు. అందరితోను మితంగా సంభాషించండి. దంపతుల మధ్య సఖ్యత లోపం, చీటికిమాటికి చికాకుపడతారు.  ఖర్చులు విపరీతం. 
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
మీదైన రంగంలో గుర్తింపు పొందుతారు. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలేర్చడతాయి. చాకచక్యంగా అడుగేస్తారు. పనులు సానుకూలమవుతాయి. దైవకార్యానికి వ్యయం చేస్తారు. ఫోన్ సందేశాలను పట్టించుకోవద్దు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది.
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
లావాదేవీలు సంతృప్తినిస్తాయి. పొదుపు పథకాలపై దృష్టి పెడతారు. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. నిర్దిష్ట ప్రణాళికలతో యత్నాలు సాగిస్తారు. మీ శ్రమ ఫలిస్తుంది. ఉల్లాసంగా గడుపుతారు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. చెల్లింపుల్లో జాగ్రత్త.
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగుతాయి. వ్యవహార ఒప్పందాలకు అనుకూలం. ప్రముఖులు సలహా పాటిస్తారు. ధనలాభం, వాహనసౌఖ్యం ఉన్నాయి. ఖర్చులు అధికం. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. అవకాశాలను తక్షణం అందిపుచ్చుకోండి. అపోహలకు తావివ్వవద్దు.
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
సంప్రదింపులు ఫలించవు. ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. అన్యమనస్కంగా గడుపుతారు. ఊహించని ఖర్చులు అందోళన కలిగిస్తాయి. సన్నిహితుల వ్యాఖ్యలకు స్పందిస్తారు. కొత్త యత్నాలు చేపడతారు. వసుల్లో ఒత్తిడి, శ్రమ అధికం. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
పరిస్థితులు చక్కబడతాయి. కొత్త ఆలోచనలతో ముందుకు సాగుతారు. దుబారా ఖర్చులు తగ్గించుకుంటారు. పనులు హడావుడిగా సాగుతాయి. వ్యవహార ఒప్పందాల్లో జాగ్రత్త. తొందరపాటుతనం తగదు. విదేశాల్లోని ఆత్మీయులతో సంభాషణ ఉత్సహాన్నిస్తుంది. 
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
వ్యవహారాల్లో నిపుణుల సలహా పాటించండి. భేషజాలకు పోవద్దు. స్థిమితంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. రుణ సమస్యలు ఆందోళన కలిగిస్తాయి. ఖర్చులు తగ్గించుకుంటారు, ఓర్పుతో శ్రమించిన గాని పనులు కావు. ఎదురుచూస్తున్న పత్రాలు అందుకుంటారు.
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
తలపెట్టిన కార్యం విజయవంతమవుతుంది. ప్రణాళికలు వేసుకుంటారు. ఖర్చులు విపరీతం. సకాలంలో పనులు పూర్తి చేస్తారు. అయిన వారి మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. ఏకపక్ష నిర్ణయాలు తగవు. పత్రాల్లో సవరణలు అనుకూలిస్తాయి.
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
నిర్దిష్ట ప్రణాళికలతో ముందుకు సాగిస్తారు. యత్నాలకు సన్నిహితుల ప్రోత్సాహం ఉంటుంది. పనుల సానుకూలతకు మరింత శ్రమించాలి. మాటతీరు అదుపులో ఉంచుకోండి. కొత్త సమస్యలెదురయ్యే సూచనలున్నాయి. వాహనదారులకు దూకుడు తగదు. 
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
సర్వత్రా అనుకూలమే, సాపాసించి నిర్ణయాలు తీసుకుంటారు. మీ కష్టం వృధా కాదు. రావలసిన ధనం అందుతుంది. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. పనుల్లో ఏకాగ్రత ముఖ్యం. ఎవరి సాయం ఆశించవద్దు. ఇతరులను మీ విషయాలకు దూరంగా ఉందండి. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
లక్ష్యసాధనకు ఓర్పు, కృషి ప్రధానం. మీ సమర్థతపై నమ్మకం పెంచుకోండి. పట్టుదలతో శ్రమించిన గాని పనులు కావు. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. ఆత్మీయులతో సంభాషిస్తారు. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. అనవసర జోక్యం తగదు.
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
ఆర్ధిక ఇబ్బందులు లేకున్నా సంతృప్తి ఉండదు. ఆలోచనలతో సతమతమవుతారు. మనోధైర్యంతో మెలగండి. ఖర్చులు అధికం. పనులు సానుకూలమవుతాయి. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. వేడుకల్లో అత్యుత్సాహం తగదు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మీరేమైనా దేశ ప్రధాన పురోహితులా? మీకు వేరే పనేమీ లేదా? సుప్రీం కోర్టు ఫైర్