Publish Date: Thu, 07 May 2026 (05:05 IST)
Updated Date: Wed, 06 May 2026 (20:09 IST)
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
ఆర్ధికంగా పర్వాలేదనిపిస్తుంది. రుణవిముక్తులై తాకట్టు విడిపించుకుంటారు. చాకచక్యంగా అడుగులేస్తారు. ప్రముఖుల సందర్శనం కోసం నిరీక్షణ తప్పదు. పనులు మందకొడిగా సాగుతాయి. దంపతుల మధ్య ఆద్యోన్యత నెలకొంటుంది. ఆప్తులతో సంభాషిస్తారు.
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
కీలక నిర్ణయం తీసుకుంటారు. ఆలోచనలు క్రియారూపం దాల్చుతాయి. అయిన వారి ప్రోత్సాహిస్తారు. ఖర్చులు సామాన్యం. నగదు చెల్లింపుల్లో జాగ్రత్త ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుంటారు. సన్నిహితులతో సంప్రదింపులు జరుపుతారు.
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
నేడు అనుకూలదాయకం. లక్ష్యాన్ని సాధిస్తారు. వ్యవహారాలతో తీరిక ఉండదు. ధనలాభం, వాహన సౌఖ్యం ఉన్నాయి. కొంతమొత్తం పొదుపు చేయగలుగుతారు. వివాహయత్నాలు సాగిస్తారు. ఒక సంబంధం కలిసివస్తుంది. బంధుమిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు.
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
శుభవార్త వింటారు. మీ కష్టం ఫలిస్తుంది. బంధుత్వాలు బలపడతాయి. ఖర్చులు విపరీతం. పెట్టుబడులు కలిసిరావు. ప్రణాళికలు వేసుకుంటారు. పనులు ఇతరులకు అప్పగించవద్దు. వ్యవహారాలను సమర్థంగా నిర్వహిస్తారు. పందేలు, వినోదాల్లో అత్యుత్సాహం తగదు.
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
ప్రతికూలతలు అధికం. నిరాశకు గురికావద్దు. స్థిమితంగా ఉండటానికి యత్నించండి. ఆప్తులతో కాలక్షేపం చేస్తారు. ఖర్చులు అధికం. పరిచయస్తుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. పనులు ముందుకు సాగవు. ఇతరులను మీ విషయాలకు దూరంగా ఉంచండి.
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
కార్యసాధనకు ఓర్పు ప్రధానం. పట్టుదలతో యత్నాలు సాగించండి. విమర్శలు, వ్యాఖ్యలు పట్టించుకోవద్దు. మీ కఠోర శ్రమ విజయానికి దోహదపడుతుంది. దుబారా ఖర్చులు విపరీతం. పనులు సానుకూలతకు మరింత శ్రమించాలి. పుణ్యక్షేత్రాలు, కొత్త ప్రదేశాలు సందర్శిస్తారు.
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
ప్రతికూలతలు అధికం. చిన్న విషయానికి గొడవపడతారు. ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించండి. వ్యాపకాలు సృష్టించుకోవడం ఉత్తమం. అతిగా ఆలోచించవద్దు. సన్నిహితుల వ్యాఖ్యలు మీపై ప్రభావం చూపుతాయి. ఖర్చులు సామాన్యం. పనులు, బాధ్యతలు ఇతరులకు అప్పగించవద్దు.
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
సర్వత్రా అన్నీ కార్యాల్లో మీదే పైచేయి. కీలక విషయాలపై పట్టు సాధిస్తారు. మీ కృషి స్ఫూర్తిదాయకమవుతుంది. వ్యతిరేకులు చేరువవుతారు. వివాహాలకు వ్యయం చేస్తారు. ఫోన్ సందేశాలను నమ్మవద్దు, బ్యాంకు వివరాలు గోప్యంగా ఉంచండి. కీలక పత్రాలు అందుతుంటారు.
ధనస్సు మూల, పూర్వాషాడ 13.5 4 పాదములు, ఉత్తరాహర 1వ పాదం
పరిస్థితులు అనుకూలిస్తాయి. ఖర్చులు సామాన్యం. పనులు మొండిగా పూర్తి చేస్తారు. ముఖ్యులను కలిసినా ఫలితం ఉండదు. ఒక సంఘటన మీపై ప్రభావం చూపుతుంది. అనుభవజ్ఞుల సహాయంతో సమస్యలు పరిష్కరించుకుంటారు. పోగొట్టుకున్న పత్రాలు తిరిగి సంపాదిస్తారు.
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
మనోధైర్యంతో యత్నాలు సాగిస్తారు. మీ చిత్తశుద్ధి ఆకట్టుకుంటుంది. ఆందోళన కలిగించిన సమస్య సద్దుమణుగుతుంది. ఖర్చులు ప్రయోజనకరం. సకాలంలో పనులు తేలికగా చేస్తారు. శ్రమతో కూడిన ఫలితాలు ఉన్నాయి. అనుభవజ్ఞుల సలహా తీసుకుంటారు.
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
ఒత్తిళ్లకు గురికావద్దు. అప్రమత్తంగా వ్యవహరించాల్సిన సమయం. తొందరపాటు నిర్ణయాలు తగవు. ఓట్లు, పట్టుదలతోనే కార్యం సిద్ధిస్తుంది. ఇతరులకు ధనసహాయం తగదు. చేపట్టిన పనులు ముందుకు సాగవు. పెద్దల హితవు మీపై చక్కగా పనిచేస్తుంది. అవిశ్రాంతంగా శ్రమిస్తారు.
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగుతాయి. అవిశ్రాంతంగా శ్రమిస్తారు. పనులు వేగవంతమవుతాయి. విలాస వస్తువులు కొనుగోలు చేస్తారు. యత్నాలకు కుటుంబీకుల ప్రోత్సాహం లభిస్తుంది. ఏకపక్ష నిర్ణయాలు తగవు, నోటిసులు అందుకుంటారు.