Publish Date: Thu, 04 Jun 2026 (05:00 IST)
Updated Date: Wed, 03 Jun 2026 (21:44 IST)
మేషం: అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
ప్రణాళికలు వేసుకుంటారు. సంప్రదింపులతో తీరిక ఉండదు. మీ అభిప్రాయాలను స్పష్టంగా తెలియజేయండి. పనులు మొండిగా పూర్తి చేస్తారు. మీ శ్రీమతి ధోరణి చికాకుపరుస్తుంది. అపరిచితులతో మితంగా సంభాషించండి. స్థల వివాదం కొలిక్కివస్తుంది.
వృషభం: కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
రుణ విముక్తులవుతారు. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. చాకచక్యంగా వ్యవహరిస్తారు. అవకాశాలు కలిసివస్తాయి. పనులు సానుకూలతకు మరింత శ్రమించాలి. దుబారా ఖర్చులు అధికం. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. ఆప్తులతో కాలక్షేపం చేస్తారు.
మిధునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
ఖర్చులు అంచనాలను మించుతాయి. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. నిలిపివేసిన పనులు పునఃప్రారంభమవుతాయి. జోక్యం తగదు. పాత పరిచయస్తులు తారసపడతారు. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి. వ్యవహారాల్లో జాగ్రత్త.
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
అవిశ్రాంతంగా శ్రమిస్తారు. మీ కష్టం ఫలిస్తుంది. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. రోజువారి ఖర్చులుంటాయి, ఆర్భాటాలకు వ్యయం చేస్తారు. పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. కీలక పత్రాలు అందుకుంటారు.
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
ప్రతికూలతలు అధికం. కార్యసాధనకు మరింత శ్రమించాలి. సమర్థతకు గుర్తింపు ఉండదు. అందరితోను మితంగా సంభాషించండి. నగదు డ్రా చేసేటపుడు జాగ్రత్త. స్థిమితంగా పనులు పూర్తి చేస్తారు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. సన్నిహితులతో సంభాషిస్తారు.
కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
రుణ ఒత్తిళ్లు ఆందోళన కలిగిస్తాయి. ప్రతి వ్యవహారం ధనంతో ముడిపడి ఉంటుంది. సన్నిహితుల వ్యాఖ్యలు మీపై సత్ప్రభావం చూపుతాయి. సకాలంలో పనులు పూర్తి చేస్తారు. కొత్త వ్యక్తులతో జాగ్రత్త. దంపతల మధ్య సఖ్యతలోపం, చీటికి మాటికి అసహనం చెందుతారు.
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
వ్యవహార పరిజ్ఞానంతో నెట్టుకొస్తారు. ధనలాభం ఉంది. దుబారా ఖర్చులు తగ్గించుకుంటారు. ప్రముఖులకు సన్నిహితులవుతారు. సభ్యత్వాల స్వీకరణకు అనుకూలం. ప్రత్యర్థులతో జాగ్రత్త. మీ చొరవతో ఒకరికి మంచి జరుగుతుంది. ప్రయాణం విరమించుకుంటారు.
వృశ్చికం : విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
సర్వత్రా యోగదాయకమే. ఆప్తుల ప్రోత్సాహం ఉంటుంది. పనులతో తీరిక ఉండదు. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. పెట్టుబడుల విషయంలో పునరాలోచించండి. అప్రియమైన వార్త వింటారు. ముఖ్యుల కలయిక వీలుపడదు. దైవకార్యంలో పాల్గొంటారు.
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
అవిశ్రాంతంగా శ్రమిస్తారు. యత్నాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. వ్యవహారదక్షతతో నెట్టుకొస్తారు. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. దుబారా ఖర్చులు తగ్గించుకుంటారు. నగదు డ్రా చేసేటప్పుడు జాగ్రత్త. పనులు చురుకుగా సాగుతాయి.
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
లక్ష్యసాధనకు ఓర్పు ప్రధానం. కష్టించినా ఫలితం అంతంత మాత్రమే. సమర్ధతకు గుర్తింపు ఉండదు. యత్నాలు కొనసాగించండి. రాబోయే ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులు సిద్ధంగా ఉంటాయి. వ్యవహారాలతో తలమునకలవుతారు. విందులు, వేడుకకు హాజరవుతారు.
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
ఆందోళన కలిగించిన సద్దుమణుగుతుంది. పట్టుదలతో యత్నాలు సాగిస్తారు. ఖర్చులు విపరీతం, సన్నిహితులతో కాలక్షేపం చేస్తారు. పత్రాల్లో సవరణలు అనుకూలిస్తాయి. బంధువుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. పనులు ముందుకు సాగవు. నోటీసులు అందుకుంటారు.
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
సంకల్పసిద్ధికి ఓర్పు, కృషి ప్రధానం, నిరుత్సాహం వీడి యత్నాలు సాగించండి. విమర్శలు, వ్యాఖ్యలు పట్టించుకోవద్దు. మీ కృషి నిదానంగా ఫలిస్తుంది. రోజువారీ ఖర్చులే ఉంటాయి. పొదుపు పథకాలపై దృష్టి సారిస్తారు. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు.