Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఇంటికి ముందు మామిడి చెట్టును పెంచడం మంచిదేనా?

Advertiesment
Mango
Mango
వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటికి ముందు మామిడి చెట్టును పెంచడం మంచిదే. అయితే మామిడి చెట్టును పరిరక్షించడం చాలా ముఖ్యమని వాస్తు నిపుణులు అంటున్నారు. ఇంట్లో మామిడి చెట్టును పెంచడంలో పాటించాల్సిన మెలకువలను తెలుసుకుందాం. ఇంటికి ప్రధాన ద్వారానికి కాస్త దూరంగా మామిడి చెట్టును పెంచడం మంచిదే. మామిడి చెట్టును పెంచడం దీర్ఘాయువు, సంపద, సానుకూల శక్తిని అందిస్తుంది. కానీ ఇంటికి చాలా దగ్గర్లో కాకుండా, ద్వారానికి కాస్త దూరంగా మామిడిని పెంచాలి. 
 
అలాగే సూర్యుని వెలుగును ఆ చెట్టు నిరోధించకుండా చూసుకోవాలి. ఇంటికి 15-20 అడుగుల గ్యాప్ వుండేలా ఈ చెట్టును పెంచాలి. నైరుతిలో మామిడి పెంచడం చేయవచ్చు. ఈ దిశలో మామిడిని పెంచడం ద్వారా అదృష్టం కలిసి వస్తుంది. అలాగే దక్షిణం, ఆగ్నేయం వంటి దిశల్లోనూ మామిడి చెట్టును పెంచడం అనుకూల ఫలితాలను ఇస్తుంది. కానీ ఇంటికి ఉత్తరం, తూర్పు దిశల్లో మామిడిని పెంచకూడదు. 
 
ముఖ్యంగా ఇంటికి ప్రధాన ద్వారానికి నేరుగా ఈ చెట్టును నాటకూడదు. ఇలా చేయడం ద్వారా సూర్యుని కిరణాలు ఇంటిపై పడకుండా నిరోధించడం జరుగుతుంది. తద్వారా ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చునని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు. మామిడి చెట్టు శ్రీ లక్ష్మీదేవి అంశం. ఈ చెట్టును పెంచడం ద్వారా ఆర్థిక ఇబ్బందులు వుండవు. ప్రతికూల శక్తులు దరిచేరవు. 
 
అలాగే మామిడి చెట్టు ఆకులు ఫ్లేవనాయిడ్స్ వంటి యాంటీ బాక్టీరియల్ సమ్మేళనాలతో మొత్తం గాలి నాణ్యతను మెరుగుపరుస్తాయి. సహజంగా కాలుష్య కారకాలను, అలెర్జీ కారకాలను తగ్గిస్తాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

03-06-2026 బుధవారం ఫలితాలు - ఎవరినీ అతిగా నమ్మవద్దు