Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

03-06-2026 బుధవారం ఫలితాలు - ఎవరినీ అతిగా నమ్మవద్దు

Advertiesment
Astrology
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
కార్యసాధనలో సఫలీకృతులపుటారు. సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. ప్రముఖులకు మరింత చేరువవుతారు. వ్యవహారాలు మీ సమక్షంలో సాగుతాయి. పొదుపు ధనం అందుకుంటారు. నగదు డ్రా చేసేటపుడు జాగ్రత్త, పనులు, బాధ్యతలు ఇతరులకు అప్పగించవద్దు. 
 
వృషభం: కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
యత్నాలు ప్రశాంతంగా సాగుతాయి. విజ్ఞతతో వ్యవహరిస్తారు. కీలక బాధ్యతలు స్వీకరిస్తారు. విలాసాలకు విపరీతంగా వ్యయం చేస్తారు. నిలిపి చేసిన పనులు ఎట్టకేలకు పూర్తవుతాయి. అనవసర జోక్యం తగదు. కొన్ని విషయాలు చూసీ చూడనట్లు వదిలేయండి. 
 
మిధునం : మృగశిర 3, 4 పాదాలు, అర్ధ, పునర్వసు 1, 2, 3 పాదాలు
మీదైన రంగంలో ఆచితూచి వ్యవహరించాలి. అందరితోను మితంగా సంభాషించండి. సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. పెద్ద ఖర్చు తగిలే అస్కారం ఉంది. మొహమ్మాటాలు, భేషజాలకు పోవద్దు. విలువైన వస్తువులు జాగ్రత్త.
 
కర్కాటకం: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
సంప్రదింపులు ఆశించిన ఫలితాలిస్తాయి. కొన్ని ఇబ్బందులు తొలగుతాయి. ఆందోళన తగ్గి కుదుటపడతారు. కొంతమొత్తం పొదుపు చేస్తారు. కొందరి రాక ఇబ్బంది కలిగిస్తుంది. కార్యక్రమాలు ముందుకు సాగవు. పనులతో సతమతమవుతారు. అకాల భోజనం.
 
సింహం: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం.
మనోధైర్యంతో అడుగులేయండి. యత్నాలకు అయిన వారి ప్రోత్సాహలు ఉంటుంది. అవకాశాలు చేజారినా నిరుత్సాహపడవద్దు. ఖర్చులు సామాన్యం, పనుల్లో ఒత్తిడి అధికం. ఫోన్ సందేశాలను పట్టించుకోవద్దు, కీలక సమావేశాల్లో పాల్గొంటారు.
 
కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
లక్ష్యసాధనకు పట్టుదల ప్రధానం. సన్నిహితుల వ్యాఖ్యలు ఉత్సాహాన్నిస్తాయి. వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు. చెల్లింపులు ఆలస్యం చేయకండి. అనవసర జోక్యం తగదు. కుటుంబీకులు మీ అశక్తతను అర్థం చేసుకుంటారు. పిల్లల విద్యాయత్నం ఫలిస్తుంది. 
 
తుల: చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
వ్యవహారాలతో తీరిక ఉండదు. పనిభారం, ఆకాంలభోజనం. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. వివాహయత్నం ఫలిస్తుంది. జాతక పొంతన ప్రధానం. నగదు డ్రా చేసేటపుడు జాగ్రత్త. పిల్లల దూకుడును కట్టడి చేయండి. పత్రాల్లో సవరణలు అనుకూలిస్తాయి. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
లక్ష్య సాధనలో సఫలీకృతులవుతారు. కొన్ని విషయాలు అనుకున్నట్టే జరుగుతాయి. మాటతీరు ఆకట్టుకుంటుంది. వ్యతిరేకులు సన్నిహితులవుతారు. విలాసాలకు విపరీతంగా వ్యయం చేస్తారు. తలపెట్టిన పనులు ఆకస్మికంగా నిలిపివేస్తారు. కొత్తయత్నాలు చేపడతారు. 
 
ధనస్సు: మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాఢ 1వ పాదం
కలిసివచ్చే సమయం. నిర్దిష్ట ప్రణాళికలతో ముందుకు సాగుతారు. యత్నాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. ధనలాభం, వాహన సౌఖ్యం ఉన్నాయి. సకాలంలో పనులు పూర్తిచేస్తారు. పరిచయస్తుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. కార్యక్రమాలు ముందుకు సాగవు.
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
కీలక విషయాల్లో అప్రమత్తంగా ఉండాలి. సన్నిహితుల సలహా పాటించండి. నిర్ణయాలు ఇబ్బంది కలిగిస్తాయి. అందరితోను సౌమ్యంగా మెలగండి. ఎవరినీ తక్కువ అంచనా వేయొద్దు. పసులు ఒక పట్టాన సాగవు. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
అనుకూలతలు: అంతంత మాత్రమే. తప్పటడుగు వేసే ఆస్కారం ఉంది. రావలసిన ధనాన్ని లౌక్యంగా వసూలు చేసుకోవాలి. దుబారా ఖర్చులు విపరీతం. పనులు హడావుడిగా సాగుతాయి. ప్రముఖులను కలిసినా ఫలితం ఉండదు. ఆత్మీయులతో సంభాషిస్తారు.
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
ఇతరులు క్షేమం కోరి చేసిన మీ వాక్కు ఫలిస్తుంది. మాట నిలబెట్టుకుంటారు. ఖర్చులు సంతృప్తికరం, ఆప్తులకు సాయం అందిస్తారు. పసులు చురుకుగా సాగుతాయి. నగదు, ఆభరణాలు జాగ్రత్త. ఎవరినీ అతిగా నమ్మవద్దు. అజ్ఞాత వ్యక్తులు మోసగించే ఆస్కారం ఉంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

02-06-2026 మంగళవారం ఫలితాలు - రుణసమస్యలు తొలగుతాయి