Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

02-10-2023 సోమవారం రాశిఫలాలు - ఈశ్వరుడిని పూజించి అర్చించినా శుభం...

astro10
, సోమవారం, 2 అక్టోబరు 2023 (04:00 IST)
శ్రీ శోభకృత్ నామ సం|| భాద్రపద ఐ|| తదియ ఉ.10.42 భరణి రా.10.42 ఉ.వ.8.31 ల 10.04. ప.దు.12.14 ల 1.02 పు.దు.2.37 ల3.25.
ఈశ్వరుడిని పూజించి అర్చించినా మీకు శుభం, జయం చేకూరుతుంది.
 
మేషం :- మీ సృజనాత్మక శక్తికి, తెలివి తేటలకు గుర్తింపు లభిస్తుంది. గృహంలో ఏదైనా వస్తువు సమయానికి కనిపించకుండా పోయే ఆస్కారం ఉంది. ఉద్యోగస్తులకు పెండింగ్ పనులు పూర్తి చేయటంలో సహోద్యోగులు సహకరిస్తారు. మీ అభిరుచులకు తగిన విధంగా కుటుంబ సభ్యులు మసలుకుంటారు.
 
వృషభం :- పొదుపు పథకాలపై దృష్టి సారిస్తారు. ఉద్యోగస్తులు అధికారులతో సంభాషించేటప్పుడు మెళకువ అవసరం. కొబ్బరి, పండ్ల, పూల, తినుబండారాల వ్యాపారులకు పురోభివృద్ధి. మీ మంచి కోరుకొనేవారు కంటే మీ చెడును కోరేవారే ఎక్కువగా ఉన్నారు. కోర్టు వ్యవహారాలు మీరు కోరుకున్నట్టుగానే వాయిదా పడతతాయి. 
 
మిథునం :- ఆర్థిక ఒడిదుడుకులు తలెత్తిన మిత్రుల సహకారం లభిస్తుంది. పెరిగిన ధరలు, చాలీచాలని ఆదాయంతో సతమతమవుతారు. వస్త్ర వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఎవరికైనా ధన సహాయం చేసినా తిరిగిరాజాలదు. ఉపాధ్యాయులకు యాజమాన్యం ఒత్తిడి అధికం. ఒక అనుభవం మీకెంతో జ్ఞానాన్ని ఇస్తుంది. 
 
కర్కాటకం :- అధ్యాత్మిక విషయాల పట్ల ఏకాగ్రత వహించలేరు. సోదరి, సోదరులతో అవగాహన కుదరదు. నిరుద్యోగులు ఇంటర్వ్యూల్లో రాణిస్తారు. కొన్ని విలువైన వస్తువులు అనుకోకుండా కొనుగోలుచేస్తారు. రేషన్ డీలర్లకు కొత్తసమస్యలు తలెత్తే సూచనలున్నాయి. విద్యార్థులు తోటివారి కారణంగా ఇబ్బందులు ఎదురవుతాయి.
 
సింహం :- ఉద్యోగరీత్యా దూరప్రాంతానికి ప్రయాణం చేయవలసిరావచ్చు. మీ పాత సమస్యలు పరిష్కారం కాకపోవటం ఇబ్బందిగా ఉంటుంది. నిత్యావసర వస్తు వ్యాపారులకు, స్టాకిస్టులకు అభివృద్ధి కానవస్తుంది. బ్యాంకు వ్యవహారాలలో పరిచయం లేని వ్యక్తులతో మితంగా సంభాషించండి. భాగస్వామిక చర్చలు ఫలిస్తాయి.
 
కన్య :- చిట్స్, ఫైనాన్సు రంగాల వారికి కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. విదేశాలు వెళ్ళటానికి చేయు యత్నలు ఫలిస్తాయి. గత తప్పిదాలు పునరావృతం కాకుండా జాగ్రత్త వహించండి. కోర్టు వాయిదాలు విసుగు కలిగిస్తాయి. తరుచు సేవ, దైవ కార్యాల్లో పాల్గొంటారు. ఉద్యోగస్తులకు విధినిర్వహణలో ఏకాగ్రత ఎంతోముఖం.
 
తుల :- ఊహాగానాలతో కాలంవ్యర్థం చేయకండి. మీ శ్రీమతి వైఖరిలో మార్పును గమనిస్తారు. వైద్యులకు శస్త్ర చికిత్స చేయునపుడు మెళకువ అవసరం. ఏదన్నా అమ్మకానికై చేయు ప్రయత్నాలు వాయిదా పడగలవు. ఇతరులకు వాహనం ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. దైవసేవ, పుణ్య కార్యాల్లో చురుకుగా వ్యవహరిస్తారు.
 
వృశ్చికం :- స్త్రీలకు షాపింగ్లో ఏకాగ్రత ప్రధానం. చిన్నారుల ఆరోగ్యం కలవరపరుస్తుంది. సంగీత, నృత్య కళాకారులకు ప్రోత్సాహకరం. ఊహించని ఖర్చులు మీ అంచనాలు దాటుట వలన ఆందోళనకు గురవుతారు. ఎదుటివారితో మితంగా సంభాషించటం మంచిది. ఉపాధ్యాయులకు, మార్కెటింగ్ రంగాల వారికి ఒత్తిడి అధికమవుతుంది.
 
ధనస్సు :- పెంపుడు జంతువుపట్ల ఆసక్తి పెరుగుతుంది. ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాలలో తొందరపాటుతనం విడనాడండి. వ్యాపారాల్లో పెరిగిన పోటీ వల్ల స్వల్ప ఆటుపోట్లు తప్పవు. వీలయితే కీలకమైన నిర్ణయాలు ఈ రోజుకు వాయిదా వేయటం మంచిది. స్త్రీలకు బంధువుల నుంచి ఒత్తిడి, మొహమ్మాటాలు ఎదురవుతాయి.
 
మకరం :- రావలసిన ధనం చేతికందుతుంది. పాత వస్తువులను కొని ఇబ్బందులను ఎదుర్కొంటారు. ప్రత్యర్థులు ఇబ్బంది పెట్టే ఆస్కారం ఉంది. మీ శ్రీమతిలో వచ్చిన మార్పు సంతృప్తినిస్తుంది. వాహనం నడుపునపుడు జాగ్రత్త అవసరం. పెద్దలతో ఏకీభవించలేకపోతారు. చేపట్టిన ఉపాధి పథకాలకు మంచి గుర్తింపు లభిస్తుంది.
 
కుంభం :- ఊహించని ఖర్చులు మీ అంచనాలు దాటవచ్చును. పెద్దమొత్తంలో ధనసహాయం మంచిది కాదు. కోర్టు వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి. ప్రింటింగ్ రంగంలోని వారికి అచ్చు తప్పులు దొర్లుట వలన పై అధికారుల చేత మాటపడక తప్పదు. మనుష్యుల మనస్థత్వము తెలిసి మసలుకొనుట మంచిది.
 
మీనం :- బ్యాంకుల్లో మీ పనుల్లో స్వల్ప ఆటంకాలు ఎదుర్కోవలసి వస్తుంది. కొనుగోలుదార్లను తేలికగా ఆకట్టుకుంటారు. దంపతుల మధ్య అభిప్రాయభేదాలు, కలహాలు చోటుచేసుకుంటాయి. రాజకీయ నాయకులు అధికారుల ఇంటర్వ్యూ కోసం పడిగాపులు తప్పవు. విద్యార్థుల మొండి వైఖరి ఉపాధ్యాయులకు చికాకు కలిగిస్తుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

01-10-2023 ఆదివారం రాశిఫలాలు - మీ ఇష్టదైవాన్ని ఆరాధించిన సర్వదా శుభం...