Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వైఎస్ వివేకా హత్య కేసు : పులివెందులకు శివశంకర్ రెడ్డి తరలింపు

Advertiesment
వైఎస్ వివేకా హత్య కేసు : పులివెందులకు శివశంకర్ రెడ్డి తరలింపు
, గురువారం, 18 నవంబరు 2021 (13:48 IST)
మాజీ మంత్రి, వైకాపా సీనియర్ నేత వైఎస్. వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణ జోరుగా సాగుతోంది. ఈ విచారణలో భాగంగా ఇప్పటికే పలువురిని అరెస్టు చేసిన సీబీఐ అధికారులు.. తాజాగా కడప ఎంపీ వైఎస్. అవినాశ్ రెడ్డికి ప్రధాన అనుచరుడుగా ఉన్న దేవిరెడ్డి శివశంకర్ రెడ్డిని  హైదరాబాద్ నగరంలో అరెస్టు చేశారు. 
 
ఆ తర్వాత ఆయన్ను హైదరాబాద్ నుంచి పులివెందులకు తరలించారు. ఉస్మానియా ఆస్పత్రిలో ఆయనకు పూర్తిస్థాయి వైద్య పరీక్షలు చేసిన తర్వాత ఆయన్ను గురువారం తెల్లవారుజామున సికింద్రాబాద్ కోర్టు న్యాయమూర్తి ఇంటిలో హాజరుపరిచారు. ఆ తర్వాత ఆయన్ను హైదరాబాద్ నుంచి పులివెందులకు దరలించారు. ఇక్కడు వచ్చాక పులివెందుల కోర్టులో హాజరుపరిచయనున్నారు. 
 
ఇదిలావుండగా, వివేకా హత్య కేసులో దస్తగిరి ఇచ్చిన వాంగ్మూలంలో అనేక మంది పెద్దల పేర్లను బయటపెట్టిన విషయం తెల్సిందే. ముఖ్యంగా, దస్తగిరి వాంగ్మూలం తర్వాత ఈ నెల 15 తేదీన విచారణకు రావాలంటూ శివశంకర్ రెడ్డికి సీబీఐ నోటీసులు జారీచేసింది. అయితే, అనారోగ్య కారణాలతో ఆయన హాజరుకాలేదు. ఈ క్రమంలోనే ఆయన్ను సీబీఐ అరెస్టు చేసింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఎయిడెడ్ పై చ‌ర్చ‌కు నో అన్న స్పీక‌ర్ - మండలి నుంచి టీడీపీ వాక్ అవుట్!