Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Monday, 13 January 2025
webdunia

దటీజ్ జగన్... సీఎం తనయుడుగా అలా.. నేడు సీఎంగా ఇలా

Advertiesment
దటీజ్ జగన్... సీఎం తనయుడుగా అలా.. నేడు సీఎంగా ఇలా
, ఆదివారం, 26 మే 2019 (08:52 IST)
వైఎస్. జగన్ మోహన్ రెడ్డి నవ్యాంధ్రకు కాబోయే ముఖ్యమంత్రి. ఈయన తండ్రి వైఎస్ఆర్ మరణం తర్వాత అనేక ఆటుపోట్లు ఎదుర్కొన్నారు. అవినీతి కేసుల్లో జైలుకు కూడా వెళ్లారు. అపుడు ఒక ముఖ్యమంత్రి తనయుడుగా ఆయన అనేక సమస్యలు ఎదుర్కొన్నారు. హైదరాబాద్ నగరం నుంచి సీఎం తనయుడుగానే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎం క్యాంపు ఆఫీస్ నుంచి అడుగు బయటపెట్టాడు. కానీ, ఇపుడు నవ్యాంధ్ర సీఎంగా ఆయన తెలంగాణ సీఎం క్యాంపు ఆఫీసులోకి అడుగుపెట్టాడు. ఇదంతా కాకతాళీయం కాదు.. మనం కనులారా చూస్తున్న వాస్తవం. 
 
ప్రస్తుత తెలంగాణ సీఎం క్యాంపు ఆఫీస్.. నాడు సీఎం క్యాంప్ ఆఫీస్ ఉండేది. ఇప్పుడు ప్రగతి భవన్‌గా ఉంది. వైఎస్ మరణం తర్వాత.. అత్యంత నాటకీయ పరిణామాల మధ్య వైఎస్ కుమారుడిగా బేగంపేట క్యాంప్ ఆఫీస్ నుంచి జగన్ బయటకు వెళ్లిపోయాడు. 
 
ఆ తర్వాత పార్టీ పెట్టటం... ఐదేళ్లు ప్రతిపక్షం.. విభజన తర్వాత ఏపీకి కాబోయే రెండో సీఎంగా ప్రమాణం చేయబోతున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సింది గవర్నర్ నరసింహన్‌ను కలిసి వైఎస్ఆర్ ఎల్పీ ఏకగ్రీవ తీర్మానం, ఎమ్మెల్యేల జాబితాను సమర్పించారు. 
 
ఈ నెల 30వ తేదీన ఆయన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి కటుంబ సమేతంగా రావాల్సిందిగా ఆయన టీ సీఎం కేసీఆర్‌ను ఆహ్వానించారు. అప్పట్లో సీఎం కొడుకుగా బయటకు వచ్చిన ఇంటికే కాబోయే సీఎంగా సీఎం క్యాంపు కార్యాలయంలో అడుగుపెట్టటం చర్చనీయాంశం అయ్యింది.
 
తెలంగాణ సీఎం కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా ప్రగతిభవన్‌లో జగన్ కలిశారు. ప్రమాణ స్వీకారానికి రావాలని ఆహ్వానించారు. ఈ సమావేశంలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఇతర టీఆర్ఎస్ నేతలు ఉన్నారు. అన్నింటి కంటే క్యాంప్ ఆఫీస్‌లో జగన్ ఔట్ - ఇన్ అంశం అందరూ ఆసక్తిగా చర్చించుకోవటం జరిగింది. ఎంతలో ఎంత మార్పు.. అప్పటి జగన్ - ఇప్పటి జగన్.. కసితో పోరాడితే రిజల్ట్ ఎలా ఉంటుందో చూపించాడు అంటూ అభిమానులు అంటున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హస్తినకు జగన్... మోడీతో భేటీ... ప్రత్యేక హోదాపై చర్చించేనా?