Publish Date: Thu, 23 May 2019 (13:17 IST)
Updated Date: Thu, 23 May 2019 (13:19 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ ఎన్నికలతో పాటు.. సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయభేరీ మోగించే దిశగా దూసుకెళుతోంది. మొత్తం 175 అసెంబ్లీ సీట్లకుగాను వైకాపా ఏకంగా 149 సీట్లలో ఆధిక్యంలో ఉండగా, ఒక స్థానంలో గెలుపొందింది. అధికార టీడీపీ మాత్రం 25 చోట్ల, జనసేన పార్టీ ఒక స్థానంలో ఆధిక్యంలో ఉంది. ఇకపోతే 25 లోక్‌సభ స్థానాల్లో వైకాపా 24 చోట్ల, టీడీపీ కేవలం ఒక్కటంటే ఒక్క స్థానంలో ఆధిక్యంలో కొనసాగుతోంది.
ఈ ఫలితాల సరళిపై వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డి స్పందిస్తూ, ఈ విజయాన్ని తాము ముందుగానే ఊహించామని జగన్ తెలిపారు. తమను ప్రజలు, భగవంతుడు ఆశీర్వదించారని వ్యాఖ్యానించారు. ప్రత్యేకక హోదానే తమ ఏకైక అజెండా అని స్పష్టంచేశారు. లోక్‌సభ ఎన్నికల్లో అఖండ విజయం దిశగా దూసుకుపోతున్న ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలోని బీజేపీకి శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ గురించి ఇప్పుడే ఏమీ మాట్లాడబోనని తేల్చి చెప్పారు.