వదినతో అక్రమ సంబంధం పెట్టుకుంటావా? తమ్ముడిని చంపేసిన అన్నయ్య

సోమవారం, 28 జనవరి 2019 (15:57 IST)
మానవీయ విలువలు మంటగలిసిపోయాయి. అక్రమ సంబంధాలు పెచ్చరిల్లిపోతున్నాయి. తాజాగా వదినతో అక్రమసంబంధం పెట్టుకున్న తమ్ముడిని ఓ అన్నయ్య వెంటాడి మరీ హతమార్చాడు. ఈ ఘటన విజయనగరంలో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. విజయనగరం జిల్లా, సాలూరు మండలం, కూనబందవలస గ్రామానికి చెందిన చొక్కాపు బోదయ్య.. అన్నయ్య చొక్కాపు కన్నయ్య భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. కన్నయ్య భార్య, తల్లికి సమానమైన వదినతో బోదయ్య అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. 
 
ఈ విషయం తెలుసుకున్న అన్నయ్య తమ్ముడిని చంపేయాలనుకున్నాడు. అయితే బోదయ్య పని కోసం ఏలూరు వెళ్లి.. సంక్రాంతికి స్వగ్రామానికి రావడంతో కన్నయ్య ఆవేశంతో ఊగిపోయాడు. ఈ నెల 8వ తేదీ ఈ వ్యవహారంపై అన్నదమ్ముల మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. 
 
కానీ అప్పటికే తనతో తెచ్చుకున్న రాడ్డుతో బోదయ్య తల, ఇతర శరీర భాగాలతో కన్నయ్య దాడి చేశాడు. తీవ్రగాయాలతో అతను అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఆపై కన్నయ్య పోలీసులకు లొంగిపోయాడు. భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నందుకే బోదయ్యను హతమార్చినట్లు నేరాన్ని అంగీకరించాడు.. కన్నయ్య. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం తెలంగాణ పంచాయతీ పోల్ : కుటుంబమంతా గెలిచింది.. ఎలా?