తల్లిదండ్రులు లేని సోదరిపై సోదరుడి అత్యాచారం.. 8 నెలల గర్భవతి అని తెలిశాక..?

బుధవారం, 23 జనవరి 2019 (10:30 IST)
సోదరిని గర్భవతిని చేసిన సోదరుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదైంది. హర్యానాలోని హిసార్‌లో 16 ఏళ్ల బాలికపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు.. ఆమె సోదరుడు. బాధితురాలికి తల్లిదండ్రులు లేకపోవడంతో ఆమె అమ్మమ్మగారింట పెరుగుతోంది. దీన్ని అదనుగా తీసుకున్న సోదరుడి వరసయ్యే వ్యక్తి ఆమెను లొంగదీసుకుని పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. 
 
ఈ వ్యవహారాన్ని బయటికి చెప్తే చంపేస్తానని  బెదిరించాడు. దీంతో పాటు బాధితురాలు గర్భం దాల్చింది. ఈ ఘటనపై బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బాధితురాలు తన అత్తమ్మతో తనపై జరిగిన అఘాయిత్యాన్ని చెప్పిందని.. ఆపై వైద్యులు ఆమె పరీక్షించగా.. బాధితురాలు 8 నెలల గర్భవతి అని తేలినట్లు పోలీసులు వెల్లడించారు. 

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం అయ్యప్పను దర్శించుకున్న మహిళను ఇంటి నుంచి గెంటేసిన అత్తింటివారు...