టీడీపీకి షాకిచ్చిన సోమిరెడ్డి బావ - కుమారుడు.. ఖిన్నుడైన చంద్రబాబు

బుధవారం, 23 జనవరి 2019 (13:39 IST)
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి బావ, కుమారుడు తేరుకోలేని షాకిచ్చారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాష్ట్ర రాజకీయాలు అనూహ్యంగా మారిపోతున్నాయి. నిన్నటికి నిన్న కడప జిల్లా రాజంపేట ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌గా ఉన్న మేడా మల్లిఖార్జున రెడ్డి టీడీపీ‌కు గుడ్‌బై చెప్పి... వైకాపాలో చేరారు. ఈ షాక్ నుంచి టీడీపీ ఇంకా తేరుకోలేదు. 
 
ఈ నేపథ్యంలో ఏపీ మంత్రివర్గంలో కీలకంగా ఉన్న మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి స్వయానా బావ అయిన కేతిరెడ్డి రామకోటారెడ్డి, ఆయన కుమారుడు కేతిరెడ్డి శశిధర్ రెడ్డిలు జగన్ చెంతకు చేరారు. వీరిద్దరూ జగన్ సమక్షంలో వైకాపాలో చేరారు. మంత్రి సోమిరెడ్డి పార్టీలో సీనియర్ నేతగా ఉంటూ నెల్లూరు జిల్లా రాజకీయాలను శాసిస్తున్న విషయం తెల్సిందే. 
 
హైదరాబాద్‌లోని లోటస్ పాండ్‌లో గల వైఎస్. జగన్ మోహన్ రెడ్డి నివాసానికి వెళ్లిన వారిద్దరూ స్వయంగా వైకాపా కండువా కప్పుకున్నారు. ఇప్పటికే అమెరికాలో వైసీపీ తరుపున రామకోటారెడ్డి కుమారుడు శశిధర్ రెడ్డి ప్రచారం చేస్తున్నారు. సోమిరెడ్డి టీడీపీలో సీనియర్ నేత. సీఎం చంద్రబాబుకి సన్నిహితుడు. అలాంటి నేత బంధువులు ప్రతిపక్షంలో చేరడం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. టీడీపీ శ్రేణులను విస్మయానికి గురిచేసింది. 

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం 33 ఏళ్లు ఛాయ్ మాత్రమే తాగిన మహిళ? ఎలాగంటే?