Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

గుండెల నిండా బాధపెట్టుకుని.... అతని రాకకోసం ఎదురుచూపులు

గుండెల నిండా బాధపెట్టుకుని.... అతని రాకకోసం ఎదురుచూపులు
, ఆదివారం, 20 జనవరి 2019 (14:46 IST)
పాయల్ రాజ్‌పుత్. ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. "ఆర్ఎక్స్ 100" మూవీలో తన అందాల ఆరబోతతో కుర్రకారు హృదయాల్లో సుస్థిరస్థానం సంపాదించుకుంది. కానీ, పాయల్ రాజ్‌పుత్ గుండెల నిండా బాధను పెట్టుకుని జీవిస్తోంది. ఈ విషయాన్ని తాజాగా వెల్లడించిందీ భామ. సాధారణ ప్రజలకు ఉన్నట్టుగానే ఈమెకు కష్టాలు ఉన్నాయి. ఆ బాధ, కష్టంతో రాజ్‌పుత్ గడుపుతోంది. ఇంతకీ ఆమెకు వచ్చిన కష్టమేంటో ఓసారి తెలుసుకుందాం. 
 
ఈ హీరోయిన్‌కు ధృవ్ రాజ్‌పుత్ అనే సోదరుడు ఉన్నాడు. ఈయన గత మూడేళ్ళ క్రితం ఇంటిని వదిలి వెళ్లిపోయాడు. 25 సంవత్సరాల వయసున్న ఇతను 27 మార్చి 2016 నుంచి కనిపించటం లేదు. ఇదే అంశంపై పాయల్ ట్విట్టర్‌ ఖాతాలో వెల్లడించి, షేర్ చేసింది. ఇదే విషయంపై ముంబై పోలుసులకు కూడా పలుమార్లు ఫిర్యాదు చేసింది. అయినా ఎలాంటి ఫలితం లేదు. 
 
ఈ నేపథ్యంలో ఆదివారం ధృవ్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆమె చేసిన ట్వీట్‌లో... 'నిన్ను చూడకుండా ఒక్కరోజు కూడా గడవటం కష్టంగా ఉంది ధృవ్. నువ్వు తిరిగి వస్తావని ఆశిస్తున్నాం. ఈ రోజు నీ పుట్టిన రోజు. ఆ దేవుడు నీకు ఆరోగ్యకరమైన జీవితాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నా. నువ్వు మిస్ అయ్యాక అమ్మానాన్నలు చస్తూ బతుకుతున్నారు. ఎంతో బాధ పడుతూ కాలం వెళ్లదీస్తున్నారు. ఈ సందేశం నీకు అందుతుందని భావిస్తున్నా. ఒకవేళ నువ్వెక్కడైనా అనుకోని ఆపదలో చిక్కుకొని ఉంటే.. మాకు కాల్ చెయ్. నీ కోసం మేము ఎదురు చూస్తున్నాం సోదరా' అంటూ పాయల్ రాజ్‌పుత్ పేర్కొంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నా స్థాయి తగ్గిన రెమ్యునరేషన్ ఇస్తేనే ఓకే చెప్తా : బాలీవుడ్ హీరోయిన్