Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

జగన్ ని పొగడ్తలతో ముంచేసిన యార్లగడ్డ... ఎందుకో తెలుసా?

జగన్ ని పొగడ్తలతో ముంచేసిన యార్లగడ్డ... ఎందుకో తెలుసా?
, సోమవారం, 6 ఏప్రియల్ 2020 (08:34 IST)
కరోనా కాటుకు మతం రంగు లేదంటూ, జరిగిన దురదృష్టకరమైన సంఘటనకి మతపరమైన రంగు అపాదించరాదని ప్రకటన చేసిన ముఖ్యమంత్రి  సంయమనం ఆలోచనాత్మకమని ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం అధ్యక్షుడు ఆచార్య యార్లగడ్డ లక్ష్మిప్రసాద్, సభ్యుడు ఆచార్య చందు సుబ్బారావు అన్నారు.

కరోనా బాధితుల పట్ల ఈ సమయంలో మనమంతా అప్యాయంగా వ్యవహరించాలని, డిల్లీ సంఘటనను దృష్టిలో ఉంచుకుని మనవారిని మనం వేరుగా చూడరాదన్న సిఎం అభిలాష ఆయన వాస్తవిక దృక్పధానికి అద్దం పడుతుందన్నారు.

ఈ తరహా సంఘటనలు ఏ ఆధ్యాత్మిక సమావేశంలో జరిగే అవకాశం ఉందని, మనం మనుషులుగా వేరైనప్పటికీ ఐకమత్యంతో పోరాడాలని పిలుపునిచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరెందరికో మార్గదర్శిగా నిలిచారని యార్లగడ్డ ప్రస్తుతించారు.

అదే సమయంలో ప్రధాన మంత్రి ప్రతిపాదించిన జ్యోతిప్రజ్వలన అత్యంత పవిత్రంగా పూర్తి చేయాలని కోరిన ముఖ్యమంత్రి ఆలోచనా ధోరణి అనుసరణీయమన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రానున్న రెండు వారాలు అత్యంత కీలకం: కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబ