Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Sunday, 12 January 2025
webdunia
Advertiesment

గవర్నర్‌ తో జగన్‌ భేటీ

గవర్నర్‌ తో జగన్‌ భేటీ
, సోమవారం, 30 మార్చి 2020 (17:13 IST)
ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌తో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం సాయంత్రం సమావేశమయ్యారు. రాష్ట్రంలో కరోనా నియంత్రణకు తీసకుంటున్న చర్యలను, లాక్‌డౌన్‌ పరిస్థితులను సీఎం జగన్‌ ఈ సందర్భంగా గవర్నర్‌కు వివరించారు.

కరోనా ముందు జాగ్రత్త చర్యలో భాగంగా గవర్నర్‌ కార్యాలయంలోకి వెళ్లే ముందు సీఎం వైఎస్‌ జగన్‌ శానిటైజర్‌తో తన చేతులను శుభ్రం చేసుకున్నారు. అలాగే సమావేశంలో కూడా గవర్నర్‌, సీఎం జగన్‌లు సామాజిక దూరం పాటించారు. అంతకుమందు రాష్ట్రంలో లాక్‌డౌన్‌ అమలు, నిత్యావసరాలు, రేషన్‌ సరఫరాపై కలెక్టర్లు, మున్సిపల్‌ కమిషనర్లు, ఆర్టీవోలువ, ఎస్పీలతో సీఎం జగన్‌ వీడియో కాన్ఫరెస్స్‌ నిర్వహించారు.

ఈ సమీక్షలో ఆయన అధికారులకు పలు సూచనలు చేశారు. కరోనా కట్టడి కోసం అర్బన్‌ ప్రాంతాలపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. లాక్‌డౌన్‌ను పూర్తిగా సద్వినియోగం చేసుకుని కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట వేయాలన్నారు.
 
బియ్యం, పప్పు పంపిణీతో వయోవృద్దులు, చిన్నారులకు గుప్పెడన్నం
కరోనా లాక్ డోన్ నేపధ్యంలో వృద్ధాశ్రమాలు, బాలల కేంద్రాలలో ఉన్నవారి కోసం ప్రభుత్వం చేపట్టిన ఉచిత బియ్యం, కంది పప్పు పంపిణీ పలువురికి గుప్పెడన్నం పెడుతుందనే చెప్పాలి.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్ణయం మేరకు ఆంధ్రప్రదేశ్ మహిళా శిశు సంక్షేమ శాఖ ఈ మేరకు జిఓ నెంబర్ 58 జారీ చేయగా 13 జిల్లాలలో 729 బాలల సదనాలు ఈ అదేశాల వల్ల లబ్డి పొందనున్నాయని ఆంధ్రప్రదేశ్ మహిళా శిశు సంక్షేమ శాఖ సంచాలకులు డాక్టర్ కృతికా శుక్లా తెలిపారు.

ప్రభుత్వేతర సంస్ధల నేతృత్వంలో ఈ బాలల సదనాలు నడుస్తుండగా, 24,695 మంది చిన్నారులు ఈ కేంద్రాలలో ఆశ్రయం పొందుతున్నారన్నారు.  కరోనా వ్యాప్తి నేపధ్యంలో వీరిలో 21,725 మందిని  వారి తల్లి దండ్రులు,
సంరక్షకులకు అప్పగించగా, 2,944 మంది అనాధలు అయా సంస్ధలలోనే ఉన్నారని కృతికా శుక్లా వివరించారు. 

ప్రస్తుతం బాల సదనాలలో ఉన్న ప్రతి చిన్నారికి 10 కిలోల బియ్యం, కిలో కంది పప్పు పంపిణీ చేయనున్నామని, ఇప్పటికే అయా జిల్లాల అధికారులు ఆ పనులలో నిమగ్నమై ఉన్నారని స్పష్టం చేశారు. పౌరసరఫరాల శాఖ సమన్వయంతో రానున్న రెండు రోజుల్లో బియ్యం, పప్పు వారికి చేరేలా చూస్తామన్నారు.

మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా 87 వయో వృద్దుల కేంద్రాలు సేవలు అందిస్తుండగా, వాటిలో దాదాపు 2000 మంది వయో వృద్దులు సేద తీరుతున్నారని వారు సైతం ఈ కార్యక్రమం ద్వారా స్వాంతన పొందుతారని డాక్టర్  కృతికా శుక్లా తెలిపారు.

వృద్దాశ్రమాలు, బాలల సదనాలు కరోనా లాక్ డోన్ నేపధ్యంలో ఇబ్బందులు పడుతున్నారన్న విషయాన్ని గుర్తించిన ముఖ్యమంత్రి స్వయంగా ఈ విషయంపై దృష్టి కేంద్రీకరించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఈ తరహా సంస్ధలు అన్నింటిలో ప్రతి ఒక్కరికీ 10 కిలోల బియ్యం, ఒక కిలో కందిపప్పు ఇవ్వాలని  అధికారులను అదేశించిన విషయం విదితమే.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పట్టణ ప్రాంతాల్లో ప్రతి వార్డుకు ఒక రైతు బజారు: ఏపి సీఎస్ ఆదేశం