Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

త్వరలో టీడీపీలో చేరుతా: మాజీ ఎమ్మెల్యే పాలపర్తి డేవిడ్ రాజు

త్వరలో టీడీపీలో చేరుతా: మాజీ ఎమ్మెల్యే పాలపర్తి డేవిడ్ రాజు
, మంగళవారం, 9 మార్చి 2021 (09:54 IST)
టీడీపీలో త్వరలో అధికారకంగా చేరుతానని మాజీ ఎమ్మెల్యే పాలపర్తి డేవిడ్ రాజు ప్రకటించారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక దళితులపై దాడులు పెరిగాయి. స్థానిక సంస్థల ఎన్నికలలో వైసీపీ దౌర్జన్యాలకు పాల్పడిందని ఆయన ధ్వజమెత్తారు.

టీడీపీ అభ్యర్థులను బెదిరించి వైసీపీ ఏకగ్రీవం చేసుకుంటుందని, మంత్రి బాలినేని శ్రీనవాసరెడ్డి ఏ ముఖం పెట్టుకొని ఒంగోలు ప్రజలను ఓట్లు అడుగుతారని ప్రశ్నించారు. నగరంలో ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయని, మంత్రిగా బాలినేని ఒంగోలుకు చేసింది ఏముందని, ప్రజలకు ఆయన సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

మున్సిపల్ ఎన్నికల్లో ఒంగోలు అభివృద్ధి చెందలంటే టీడీపీకి ప్రజలు ఓటు వేయాలని డేవిడ్ రాజు కోరారు. 
ఏపీలో అధికార వైసీపీలో ఉన్న దళిత నాయకులు ప్రతిపక్ష టీడీపీ వైపు చూస్తున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది.

దళితులకు తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుందని ఓవైపు చెబుతూనే..మరోవైపు ఆ సామాజికవర్గాలపై దాడులు జరుగుతుండటం వారిలో ఆగ్రహ జ్వాలలు రగిలిస్తోంది. కొందరు వైసీపీ నేతలు దళితులపై అమానవీయంగా ప్రవర్తించడం ఇటీవల తీవ్ర కలకలం సృష్టిస్తోంది.

అంతేకాదు దళిత నాయకులకు జగన్‌ పార్టీలో పదవులు ఇవ్వకపోగా..చిన్నచూపు చూస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఈ క్రమంలో దళిత లీడర్లు తెలుగుదేశం పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నట్లు పొలిటికల్‌ సర్కిల్‌లో చర్చ జరుగుతోంది. ఇందుకు ఊతమిచ్చేలా ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మాజీ ఎమ్మెల్యే పాలపర్తి డేవిడ్ రాజు త్వరలో టీడీపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. 

డేవిడ్‌రాజు రాజకీయ ప్రయాణం టీడీపీ నుంచే ప్రారంభమైంది. 1999
 డేవిడ్‌రాజు రాజకీయ ప్రయాణం టీడీపీ నుంచే ప్రారంభమైంది. 1999లో టీడీపీ నుంచి సంతనూతలపాడు ఎమ్మెల్యేగా గెలిచారు. అంతకుముందు జెడ్పీ చైర్మన్‌గా పనిచేశారు. 2009లో ఎర్రగొండపాలెం నుంచి టీడీపీ టికెట్‌పై పోటీ చేసిన డేవిడ్ రాజు ఓడిపోయారు.

2014 ఎన్నికల సమయంలో వైసీపీలో చేరి ఎర్రగొండపాలెం నుంచి ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు. 30 వేల పైచిలుకు మెజారిటీతో ఎమ్మెల్యేగా విజయం సాధించారు. టీడీపీ అధికారంలోకి రావడంతో తిరిగి సొంత గూటికి వెళ్లిపోయారు. అయితే టీడీపీ ప్రభుత్వంలో ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో డేవిడ్ రాజు హవా నడిచింది.

2019 ఎన్నికల్లో డేవిడ్ రాజుని పక్కన  పెట్టిన టీడీపీ... ఎర్రగొండపాలెం టిక్కెట్ బూదాల అజితారావుకి ఇచ్చింది. తనకు టిక్కెట్ ఇవ్వలేదన్న మనస్తాపానికి గురైన డేవిడ్ రాజు వైసీపీలో చేరారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

75వ స్వాతంత్య్ర వేడుకల జాతీయ కమిటీ తొలి సమావేశంలో గవర్నర్