Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

టిడిపి గెలుపు ఖాయం... పేదలకు ఇళ్లు ఖాయం: మాజీమంత్రి పరిటాల సునీత

Advertiesment
టిడిపి గెలుపు ఖాయం... పేదలకు ఇళ్లు ఖాయం: మాజీమంత్రి పరిటాల సునీత
, ఆదివారం, 7 మార్చి 2021 (10:54 IST)
టిడిపి హయాంలో నిర్మాణం పూర్తయి పంపిణీకి సిద్ధంగా ఉన్న సుమారు 2లక్షల ఇళ్లను పురపాలక ఎన్నికల్లో గెలిచిన వెంటనే అర్హులకు అందజేస్తామని మాజీ మంత్రి పరిటాల సునీత హామీ ఇచ్చారు. పురపాలక ఎన్నికల్లో టిడిపి గెలుపును ఎవరూ ఆపలేరని, ఈ ఇళ్ళ పంపకాలను ఎవరూ అడ్డుకోలేరని తేల్చిచెప్పారు.

టిడ్కో ఇళ్ల నిర్మాణం పూర్తయి 20నెలలు గడిచినా ఇప్పటికీ వైసిపి ప్రభుత్వం లబ్ధిదారులకు అందించడంలో విఫలమైంది. పైగా ఈ ఇళ్ల మంజూరుకు 20వేల నుంచి లక్షన్నర రూపాయల వరకు ఇవ్వాలని వైసిపి నేతలు లబ్ధిదారుల నుంచి డిమాండ్ చేస్తున్నారు.

పారిశుద్ధ్య కార్మికుల జీతాలను 21వేలకు పెంచుతామని భరోసా ఇచ్చారు.  అదేవిధంగా ఆటో కార్మికులకు శాశ్వత ఆటోస్టాండ్ నిర్మిస్తామని తెలిపారు. అక్కడ మంచినీటి వసతి, మరుగుదొడ్ల సౌకర్యాలను కల్పిస్తామన్నారు. డ్వాక్రా మహిళల కోసం సమావేశ మందిరాలు, మార్కెట్ బజార్లు నిర్మిస్తామని,  బ్యాంకుల ద్వారా సున్నా వడ్డీ రుణాలు అందజేస్తామని చెప్పారు. ఇవన్నీ టిడిపి మేనిఫెస్టోలో పొందుపరిచింది.

45ఎళ్లు పైబడిన ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనారిటీ మహిళలకు నెలకు మూడువేల రూపాయల పెన్షన్ ఇస్తానని ముఖ్యమంత్రి జగన్ రెడ్డి మోసం చేశారని విమర్శించారు. నెలకు మూడువేల చొప్పున ఒక్కో మహిళకు ఏడాదికి 36వేల రూపాయలు జగన్ రెడ్డి ఇవ్వాలి. కానీ, వైఎస్సార్ చేయూత అనే పథకం ద్వారా కేవలం 18వేల 750 రూపాయలు మాత్రమే వారి ఇస్తున్నారు.

అంటే వారికి జగన్ రెడ్డి ఏడాదికి 17వేల 250రూపాయల బకాయి ఉన్నాడు. అదే సమయంలో మహిళలపై అఘయిత్యాలు పెరుగుతున్నాయి. గడచిన 20నెలల్లో ఇవి విపరీతంగా పెరిగాయని కేంద్ర నేరపరిశోధన విభాగం ఇచ్చిన 2020 నివేదిక తేటతెల్లం చేస్తోంది. 

అదేవిధంగా, కరోనా కాలంలో పారిశుద్ధ్య కార్మికులకు మాస్క్, శానిటైజర్లు అడిగిన పాపానికి నగరి మున్సిపల్ కమిషనర్ కె.వెంకటరామిరెడ్డిని సస్పెండ్ చేసింది జగన్ రెడ్డి ప్రభుత్వం. కార్మికులకు మాస్కులు కూడా ఇవ్వని జగన్ రెడ్డి ప్రభుత్వానికి పురపాలక ఎన్నికలోల తగిన గుణపాఠం చెప్పాలని ఆమె పిలుపునిచ్చారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పెళ్ళి పేరుతో కామవాంఛ తీర్చుకున్న బడా పారిశ్రామికవేత్త!