ఏపీ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా విశాఖనగరం ఆల్‌మోస్ట్ కన్‌ఫర్మ్ అయిన నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సాగర తీర నగరంలో ఎక్కడ నివాసముండబోతున్నారు? ఇదిప్పుడు వైసీపీతోపాటు ఏపీలోని సామాన్య వర్గాల్లో మరీ ముఖ్యంగా ఉత్తరాంధ్ర వాసుల్లో జోరుగా జరుగుతోంది.
హుదుద్ తుఫాను తాకిడికి పెద్ద ఎత్తున విధ్వంసమైన విశాఖ సిటీ ఆ తర్వాత ఏడాదిన్నర కాలంలోనే మరింత సుందరంగా మారింది. తాజా పరిణామాల నేపథ్యంలో విశాఖ త్వరలోనే రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా మారే పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం ఎక్కడ వుండబోతోంది? జగన్ సొంత నివాసం ఎక్కడ ఏర్పాటు చేసుకోబోతున్నారు? ఈ చర్చకు ప్రాధాన్యమేర్పడింది.
అన్ని అనుకున్నట్లుగా జరిగితే జనవరి మాసాంతానికి విశాఖ నగరం ఏపీ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కాబోతోంది. వైజాగ్ సిటీలో సుందర ప్రాంతాలతోపాటు.. భారీ భద్రతతో కూడుకున్న ఏరియాలు, అత్యంత సంపన్న కాలనీలు ఎన్నో వున్నాయి. వాటిని పరిశీలిస్తే.. ముందుగా మనకు గుర్తొచ్చేది ఆర్.కే. బీచ్ ఏరియా.
తూర్పు తీర బంగాళాఖాతంలో ప్రతీ సూర్యోదయం ప్రకృతి రమణీయతకు నిదర్శనంగా నిలుస్తుంది. సముద్రం మీదుగా జరిగే సూర్యోదయం ప్రతీ ఉదయాన్ని ఆహ్లాదపరుస్తుంది. అందుకే ఎక్కువ మంది జగన్ నివాసాన్ని సముద్ర తీరంలో సురక్షిత ప్రాంతంలో ఏర్పాటు చేసుకుంటారని చెప్పుకుంటున్నారు.
ఆర్కే బీచ్ నుంచి కైలసగిరి మధ్య ప్రాంతంలోని పలు ప్రభుత్వ స్థలాలను ఇందుకోసం అధికారులు ఇప్పటికే పరిశీలించినట్లు సమాచారం. ముఖ్యంగా కైలాసగిరి సమీపంలో సముద్రంలోకి చొచ్చుకు వచ్చినట్లున్న ఏరియాలో ఎత్తైన ప్రాంతం ముఖ్యమంత్రి నివాసానికి అనుకూలంగా వుంటుందని, దాన్ని సెక్యూరిటీ పరంగాను సూపర్బ్‌గా మార్చొచ్చని పలువురు చెప్పుకుంటున్నారు.
ఓన్లీ భద్రతకే పెద్దపీట వేస్తే.. నేవీ ఏరియాలోని కొన్ని ప్రదేశాలలో ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంతోపాటు, ముఖ్యమంత్రి నివాసాన్ని నిర్మించే అవకాశాలున్నాయన్నది మరికొందరు వాదన. ఈ ఏరియా అయితే.. ప్రస్తుతం వున్న విశాఖ ఏయిర్‌పోర్టుకు చాలా దగ్గరగా వుంటుంది.
అయితే.. భవిష్యత్తులో భోగాపురం ఏయిర్‌పోర్టును అభివద్ధి పరిచే ఉద్దేశం వుండడంతో.. ఈ ప్రాంతాన్ని ఎంపిక చేయకపోవచ్చన్నది మరికొందరు అంఛనా. నగరంలో అత్యంత సంపన్నమైన ప్రాంతం… అంటే హైదరాబాద్‌లో జూబిలీహిల్స్ వంటి ప్రాంతం విశాఖలో సీతమ్మధార ఏరియా.
ఆ ఏరియాను ముఖ్యమంత్రి నివాసానికి ఎంపిక చేసుకోవచ్చని చాలా మంది అభిప్రాయపడుతున్నారు, క్యాంపు కార్యాలయంగా అత్యంత సెక్యూరిటీతోపాటు అన్ని సౌకర్యాలు వున్న సర్క్యూట్ హౌజ్‌ని వినియోగించుకుంటారని చెప్పుకుంటున్నారు.
అదే సమయంలో ప్రకృతి రమణీయతకు పేరుగాంచిన భీమిలీ ప్రాంతంలో ప్రభుత్వ భూములు ఎక్కువగా అందుబాటులో వున్న నేపథ్యంలో ఆ ప్రాంతంలో మంత్రుల నివాసాలతోపాటు.. ముఖ్యమంత్రి నివాసాన్ని ఏర్పాటు చేసుకోవచ్చన్న చర్చకూడా అధికార వర్గాల్లో పెద్ద ఎత్తున జరుగుతోంది.
ఏది ఏమైనా … విశాఖ ఇప్పుడు ఏపీలో నెంబర్ వన్ సిటీగా వుంది. రాజధానిగా మారితే మరింత వేగంగా ఇటు అనకాపల్లి వరకు సిటీ విస్తరించే అవకాశాలు పుష్కలంగా వున్నాయి. కనెక్టివిటీ పరంగాను మిగిలిన ఏపీ నగరాలతో పోలిస్తే విశాఖ చాలా మెరుగ్గా వుంది. అంతర్జాతీయ విమాన సర్వీసుల పరంగానూ విశాఖ నగరం చాలా ముందుంది.
ఈ నేపథ్యంలో అంతర్జాతీయ సంస్థ రాకపోకలకు అత్యంత అనుకూలమైన విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అయితే.. పెట్టుబడులు పెద్ద ఎత్తున వస్తాయన్నది స్థానికుల అభిప్రాయం. దీనికి అనుగుణంగానే పాపులర్ ప్లేస్‌లో ముఖ్యమంత్రి క్యాంపాఫీస్, రెసిడెన్స్ వుండాలన్నది పలువురి అభిప్రాయంగా వినిపిస్తోంది.
ఏది ఏమైనా నా ఈ మూడు రాజధానులు జరిగితే అధికంగా వేగంగా హైదరాబాద్ సైతం తలదన్నే సిటీ విశాఖ మారుతుందని వివిధ కంపెనీలు సైతం డైరెక్టుగా విశాఖ చేరతాయి బొంబాయి, కలకత్తా, చెన్నై సిటీలగా త్వరలో మన ముందుకి వస్తాది విశాఖ అని పలువురు అభిప్రాయపడుతున్నారు, అందుకే సీఎం నివాసం ఇక్కడ ఏర్పాటు చేసుకుంటారని కూడా వినిపిస్తుంది.