Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఉరితీస్తే వచ్చే డబ్బుతో కుమార్తె పెళ్లి చేస్తా : పవన్

ఉరితీస్తే వచ్చే డబ్బుతో కుమార్తె పెళ్లి చేస్తా : పవన్
, గురువారం, 9 జనవరి 2020 (09:40 IST)
నిర్భయ కేసులోని నలుగురు ముద్దాయిలకు ఈనెల 22వ తేదీ ఉదయం 7 గంటలకు ఉరిశిక్షలను అమలు చేయనున్నారు. ఈ నలుగురిని మీరట్ జైలు తలారి పవన్ జలాద్ ఉరి తీయనున్నారు. ఇందుకోసం మీరట్ నుంచి ఢిల్లీకి తరలి రావాలని ఇప్పటికే ఆయనకు సమాచారం కూడా అందింది. 
 
ఇదే విషయంపై తలారి పవన్ జలాద్ స్పందిస్తూ, నిర్భయ కేసులోని దోషులను ఎపుడెపుడు ఉరితీస్తానా?  అంటూ ఎదురుచూస్తున్నాను. ఇందుకోసం తనను మీరట్ నుంచి తీహార్ జైలుకు తీసుకెళతారు. అందుకే 22వ తేదీ కోసం ఎదురు చూస్తున్నాను. 
 
మరోవైపు, ఇపుడు నాకు డబ్బులు ఎంతో అవసరం ఉంది. ఎందుకంటే ఆ డబ్బులతోనే తన కుమార్తె పెళ్లి చేయాల్సివుంది. ఒక్కో ముద్దాయిని ఉరితీస్తే తనకు రూ.25 చొప్పున ఇస్తారు. అంటే నలుగురుని ఉరితీయడం వల్ల వచ్చే లక్ష రూపాయలతో తన కుమార్తె పెళ్లి చేయాల్సివుంది అని చెప్పుకొచ్చరు. 
 
కాగా, పవన్ జలాద్ కుటుంబం తరతరాలుగా తలారుగా పని చేస్తోంది. దీనిపై ఆయన స్పందిస్తూ, ఉరితీసే అవకాశం ఆ దేవుడు ఇచ్చిన వరంగా తాము భావిస్తున్నట్టు చెప్పుకొచ్చారు. అలాగే, మీరట్ అధికారులు తనకు కాన్షీరామ్ ఆవాస్ యోజన కింద ఒక గది ఇంటిని కేటాయించారని, అదిప్పుడు చాలడం లేదన్నారు. 
 
ఇప్పటికే యూపీ జైలు అధికారుల నుంచి నిర్భయ దోషుల ఉరితీతపై సమాచారం అందిందని, ఉరికి ముందు తాను రిహార్సల్స్ చేయాల్సి వుందని అన్నారు. ప్రస్తుతం తనకు నెలకు కేవలం రూ.5 వేలు మాత్రమే యూపీ జైలు అధికారులు వేతనంగా ఇస్తున్నారని, ఇది కుటుంబ నిర్వహణకు ఎంత మాత్రమూ సరిపోవడం లేదని చెప్పారు. ఇంటిని మరమ్మతులు చేసుకుందామన్న డబ్బులేదని, దోషులను ఉరితీస్తే వచ్చిన డబ్బు తనకు కొత్త ఊపిరిని ఇస్తుందని నమ్ముతున్నట్టు పవన్ జలాద్ చెప్పుకొచ్చారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పాఠశాలలకు సంక్రాంతి సెలవులు 12 నుండి 16 వరకు..