విశాఖ సాగర తీరం అంతర్జాతీయ బీచ్ వాలీబాల్ పోటీలకు మరోసారి వేదిక కాబోతోంది. ఈనెల 16 నుంచి ఆర్కే బీచ్లో పోటీలు ప్రారంభం కానున్నట్లు ఏపీ వాలీబాల్ సంఘం అధ్యక్షుడు, ఎమ్మెల్యే గణబాబు తెలిపారు.
విశాఖలో ఈనెల 16 నుంచి ఆర్కే బీచ్లో అంతర్జాతీయ బీచ్ వాలీబాల్ పోటీలు ప్రారంభం కానున్నట్లు ఏపీ వాలీబాల్ సంఘం అధ్యక్షుడు, ఎమ్మెల్యే గణబాబు తెలిపారు. ఏవీసీ బీచ్ వాలీ బాల్ కాంటినెంటల్ కప్ పేరిట ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.
ఈ పోటీల్లో ఆసియా దేశాలైన ఇరాన్, కజికిస్థాన్, శ్రీలంక, మాల్దీవులు, నేపాల్, బంగ్లాదేశ్, భారత్ నుంచి క్రీడా జట్లు పాల్గొంటాయని తెలిపారు. గతంలో అంతర్జాతీయ బీచ్ వాలీబాల్ పోటీలు విశాఖలో జరిగినా.. ఈసారి జరగనున్న పోటీలకు ప్రత్యేకత ఉందన్నారు.
ఇక్కడ విజేత జట్లు ఆసియా స్థాయిలో మరో మెగా టోర్నీలో పాల్గొంటాయని అక్కడ ప్రతిభ కనబరిస్తే రాబోయే ఒలింపిక్స్లో పాల్గొనేందుకు అర్హత సాధిస్తాయన్నారు. ఈ పోటీలను తిలకించేందుకు నగరవాసులకు ఉచిత ప్రవేశాన్ని కల్పించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.