Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అవినీతి నిర్మూలనపై వారంపాటు అవగాహన కార్యక్రమాలు

అవినీతి నిర్మూలనపై వారంపాటు అవగాహన కార్యక్రమాలు
, మంగళవారం, 26 అక్టోబరు 2021 (20:11 IST)
అవినీతి నిర్మూలనకై ఉద్యోగులు అంతా ఐక్యతతో కృషి చేయాలని రాష్ట్ర ఇన్ఫరేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ మరియు కమ్యునికేషన్ శాఖ ప్రిన్సిఫల్ సెక్రటరీ జి.జయలక్ష్మీ పిలుపునిచ్చారు.

విజిలెన్సు అవేర్నెస్ వీక్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా మంగళవారం సచివాలయంలోని తమ కార్యాలయపు సమావేశ మందిరంలో అధికారులు, ఉద్యోగులు అందరితో ఆమె సమావేశమై  సమగ్రత ప్రతిజ్ఞ చేయించారు.

ఉద్యోగులు అంతా ఐక్యత, నిజాయితీ, పారదర్శకత, జ‌వాబుదారీతనంతో వ్యవహరిస్తూ దేశ ఆర్థిక, రాజకీయ మరియు సామాజిక ప్రగతికి ప్రధాన అడ్డంకిగా ఉన్న అవినీతి నిర్మూలనకు కృషిచేస్తామని ప్రతిజ్ఞ చేశారు. 

అన్ని సమయాల్లో నిజాయితీ మరియు సమగ్రత యొక్క అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ అవినీతికి వ్యతిరేకంగా పోరాటానికి మద్దతు ఇస్తామని వారంతా ప్రతిజ్ఞ చేశారు.

ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ  స్వతంత్ర భారతదేశం @ 75: సమగ్రతతో  స్వీయ ఆధారపడటం అనే థీమ్ తో నేటి నుండి నవంబరు 1 వరకు ఈ విజిలెన్సు అవేర్నెస్ వీక్ ను వారం రోజుల పాటు నిర్వహిస్తున్నట్లు ఆమె తెలిపారు.

ఇందులో భాగంగా ఉద్యోగుల పనితీరును మెరుగు పర్చుకొనేందుకు మరియు అవినీతి నిర్మూలనకు అనుసరించాల్సిన విధి విదాలను తెలియజేస్తూ సెమినార్లు, వర్కుషాపులు, క్విజ్లు, వ్యాస రచన పోటీలతో పాటు ప్రత్యేక ఫిర్యాధుల పరిష్కార శిబిరాలను కూడా నిర్వహించడం జరుగుతుందన్నారు.

భారత తొలి ఉప ప్రధాన మంత్రి  సర్థార్ వల్లభబాయి పటేల్ 146 వ జన్మదినం అక్టోబరు 31 ని పురస్కరించుకొని అవినీతి నిర్మూలనపై వారం రోజుల పాటు నిర్వహించనున్న అవగాహనా కార్యక్రమాలు అమరావతి సచివాలయంలోని అన్ని ప్రభుత్వ విభాగాల్లో ఉద్యోగుల సమగ్రత ప్రతిజ్ఞతో మంగళవారం ప్రారంభం అయ్యాయి.

అవినీతి నిర్మూలపై పలు అవగాహనా కార్యక్రమాలను సచివాలంలోని అన్ని విభాగాల్లో నిర్వహించేందుకు కార్యచరణ ప్రణాళికలను రూపొందించుకొని అమలు చేస్తున్నారు. కార్య‌క్ర‌మంలో ఇన్ఫరేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్చ‌ కమ్యునికేషన్ శాఖ జాయింట్ సెక్రటరీ టి.నాగరాజు, ఓ.ఎస్.డి, డిప్యుటీ సెక్రటరీ బి.సునిల్‌కుమార్ రెడ్డి, ఉద్యోగులు పాల్గొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

COWAXIN Approval is Loading.. గుడ్ న్యూస్ కోసం వెయిటింగ్