Publish Date: Sun, 06 Mar 2022 (14:02 IST)
Updated Date: Sun, 06 Mar 2022 (14:09 IST)
విశాఖపట్టణం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఆదివారం వేకువజామున ఈ ప్రమాదం సంభవించింది.
విశాఖ నగరంలోని ఎలమంచిలి పెట్రోల్ బంక్ వద్ద జాతీయ రహదారిపై బొలెరో వాహనాన్ని అటుగా వెళుతున్న లారీ ఒకటి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు.
ఈ రోడ్డు ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని శవపంచనామాకు ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.