Publish Date: Sat, 05 Mar 2022 (12:44 IST)
Updated Date: Sat, 05 Mar 2022 (12:47 IST)
ములుగు జిల్లాలో చోటుచేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు ప్రాణాలు కోల్పోగా, మరో నలుగురికి తీవ్రంగా గాయాలైనాయి. మృతిచెందిన నలుగురిని అజయ్ (12), కిరణ్ (16), కౌసల్య (60), ఆటో డ్రైవర్ జానీ (23)గా గుర్తించారు.
వీరంతా ఆటోలో అన్నారం షరీఫ్ దర్గాకు వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. క్షతగాత్రులను వరంగల్ ఎంజీఎంకు తరలించారు.