Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వైజాగ్ గ్యాస్ లీక్ : విగత జీవులుగా పడిపోయిన మూగజీవులు

Advertiesment
వైజాగ్ గ్యాస్ లీక్ : విగత జీవులుగా పడిపోయిన మూగజీవులు
, శుక్రవారం, 8 మే 2020 (13:26 IST)
విశాఖపట్టణంలోని ఎల్జీ పాలిమర్స్ కంపెనీ నుంచి స్టిరిన్ అనే విషవాయువు లీకైంది. ఈ దుర్ఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోగా, 200 మందికిపైగా అస్వస్థతకు లోనయ్యారు. అలాగే, అనేక మూగ జీవులు ప్రాణాలు కోల్పోయారు. ముఖ్యంగా విష వాయువు పీల్చిన బర్రెలు, గొర్రెలు, మేకలు, ఆవులు, ఎద్దులు, దున్నలతో పాటు.. పక్షులు, పిట్టలు, శునకాలు కూడా మృత్యువాతపడ్డాయి. 
 
ఈ మూగ జీవులు విషవాయువును పీల్చగానే నోటి వెంట నురగ వచ్చి చనిపోయాయి. చివరకు పచ్చని చెట్లు కూడా మాడిపోయాయి. ప్రస్తుతం ఈ ప్లాంట్ ఉన్న పరిసర ప్రాంతాలతో పాటు.. విష వాయువు వ్యాపించిన మూడు కిలోమీటర్ల పరిధిలో హృదయ విదారక దృశ్యాలు కనిపిస్తున్నాయి. 
 
కాగా, ఈ గ్యాస్ లీకేజీ వల్ల ప్రాణలు కోల్పోయిన మృతుల కుటుంబాలతో పాటు... బాధితుల కుటుంబాలను ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి గురువారం పరామర్శించి, ప్రభుత్వం తరపున ఆర్థికసాయం ప్రకటించారు. మృతుల కుటుంబాలకు రూ.కోటి చొప్పున ఇవ్వనున్నారు. అలాగే, చనిపోయిన పశువులకు కూడా రూ.25 వేలు, 15 వేల కుటుంబాలకు రూ.10 వేలు చొప్పున ఆర్థిక సాయం చేయనున్నట్టు ప్రకటించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా దూకుడు : మరో 54 పాజిటివ్ కేసులు