Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

#VizagGasLeak : నాడు హిందుస్థాన్ పాలీమర్స్... నేడు ఎల్జీ పాలీమర్స్ ప్లాంట్...

#VizagGasLeak : నాడు హిందుస్థాన్ పాలీమర్స్... నేడు ఎల్జీ పాలీమర్స్ ప్లాంట్...
, గురువారం, 7 మే 2020 (12:19 IST)
విశాఖపట్టణం జిల్లా గోపాలపట్నం పరిధిలోని ఆర్ఆర్ వెంకటాపురంలో ఉన్న ఎల్జీ పాలిమర్స్ కంపెనీ నుంచి విషవాయువు లీకై పది మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. వేలాది మంది తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. ఈ దుర్ఘటనకు కారణమైన ఈ కంపెనీ మూలాలను ఓ సారి పరిశీలిస్తే, 
 
* ఎల్జీ పాలీమర్స్ ప్లాంట్‌ సౌత్ కొరియాకు చెందిన కంపెనీ. 
* ఇందులో ఎలక్ట్రిక్ ఫ్యాన్ బ్లేడ్స్, కప్స్, కట్లరీ, మేకప్, కాస్మాటిక్ వస్తువుల నిల్వచేసే కంటైనర్లను తయారు చేస్తారు. 
* స్టెరిన్ అనే ముడి సరుకును ఉపయోగించి వీటిని తయారు చేస్తారు. స్టెరిన్‌కు మండే స్వభావం అధికం. ఇది పేలుడుకు గురైతే విషపూరితమైన వాయువును విడుదల చేస్తుంది. 
* నిజానికి ఈ కంపెనీని 1961లో హిందుస్థాన్ పాలిమర్స్ పేరుతో ఏర్పాటు చేయగా, అపుడు పాలీస్ట్రైన్, కో-పాలిమర్స్‌ను ఉత్పత్తి చేసేవారు. 
* 1978లో ఈ కంపెనీ యూబీ గ్రూపునకు చెందిన మెక్ డొవెల్ అండ్ కో లో విలీనమైంది. 
* 1997లో సౌత్ కొరియాకు చెందిన ఎల్జీ కెమ్ దీన్ని కైవసం చేసుకుని ఎల్జీ పాలీమర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌గా పేరుమార్చారు. 
* దక్షిణ కొరియాలో ఈ కంపెనీ వ్యాపార లావాదేవీలు అధికం. 
* భారత్‌లో పాలీస్ట్రైన్ విస్తరణ చర్యల్లో ఈ కంపెనీ ప్రధానపాత్రను పోషిస్తోంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వైజాగ్ గ్యాస్ లీక్ : స్టెరిన్ వాయువు పీల్చిన పది నిమిషాల్లోనే..