Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఒంటరి మ‌హిళ‌లే టార్గెట్ .... చైన్ స్నాచ‌ర్ల అరెస్ట్!

Advertiesment
vijayawada police
విజ‌య‌వాడ‌ , సోమవారం, 10 జనవరి 2022 (20:27 IST)
చైన్ స్నాచింగ్ లకు పాల్పడుతున్న ఇద్దరు నిందితుల‌ను బెజ‌వాడ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుండి రూ.4,22,000/- విలువైన చోరీ సొత్తు స్వాధీనం చేసుకున్నారు. ఈ మధ్య కాలంలో విజయవాడ నగరంలో ఒంటరిగా వెళుతున్నమహిళలను టార్గెట్ చేసుకుని చైన్ స్నాచింగ్లు జరుగుతున్నాయి. 
 
 
విజయవాడ నగర పోలీస్ కమిషనర్ కాంతి రాణా టాటా ఆదేశాల మేరకు నేరాలపై ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేశారు. చైన్ స్నాచింగ్ చేసే నిందితులను పట్టుకోవడానికి ఈస్ట్ జోన్ డి.సి.పి. హర్షవర్థన్ రాజు  పర్యవేక్షణలో ఈస్ట్ డివిజన్ ఎ.సి.పి.విజయ పాల్, గన్నవరం ఇన్స్పెక్టర్ శివాజి సిబ్బందితో రెండు బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలలో పాల్గొన్నారు. గ‌న్నవరం సెయింట్ జోన్స్ స్కూల్ వద్ద ఇద్దరు వ్యక్తులు సుజికీ యాక్సిస్ బండిపై అనుమానస్పదంగా తిరుగుతుండగా, వారిని అదుపులోకి తీసుకున్నారు. 

 
గుంటూరు జిల్లా దాచేపల్లి మండలానికి చెందిన షేక్ నాగుల్ మీరా (24), పోలే రత్న రాజు (20) ఇద్ద‌రినీ అరెస్ట్ చేశారు. వీరిద్ద‌రు సులువుగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో ఒంటరిగా నడుచుకుంటూ వెళుతున్న లేడీస్ నుండి చైన్ స్నాచింగ్ చేయాలని నిర్ణయించుకున్నారు. వీరు కృష్ణా జిల్లా విజయవాడ నగరంలో స్నాచింగ్లు చేయాలని నిర్ణ‌యించుకున్నారు. సుజికీ యాక్సిస్ బండిపై మొదటగా గత సంవత్సరం నవంబర్ నెలలో కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్ ఆర్.టి.సి బస్టాండ్ సమీపంలో ఒంటరిగా నడుచుకుంటూ వెళుతున్న మహిళ మెడలోని 24 గ్రాముల గొలుసును లాక్కొని పారిపోయారు.


తరువాత అదే రోజు గన్నవరం సెయింట్ జోన్స్ స్కూల్ వద్ద నడుచుకుంటూ వెళుతున్న మహిళ నుండి 48 గ్రాముల బంగారపు గోలుసును స్నాచింగ్  చేశారు. నాలుగు రోజుల తరువాత గన్నవరం కేసరపల్లి మెయిన్ రోడ్డు సమీపంలో ఒంటరిగా వెళుతున్న మహిళ వద్ద నుండి సుమారు 12 గ్రాముల బంగారు గొలుసు కొట్టేశారు. డిసెంబరు నెలలో భవానిపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని బ్యాంక్ సెంటర్ సమీపంలో నడుచుకుంటూ వెళుతున్న మహిళ వద్ద నుండి 40 గ్రాముల బంగారపు గొలుసును స్నాచింగ్ చేసి పారిపోయారు. 
 
 
గన్నవరం శ్రీనగర్ కాలనీలో 32 గ్రాములు బంగారపు గొలుసు స్నాచింగ్, ప‌టమట పోస్టల్ కాలనీలో 32 గ్రాములు బంగారపు గొలుసు స్నాచింగ్ చేశారు. నిందితులు గత రెండు నెలల కాలంలో మొత్తం విజయవాడ నగరం,  కృష్ణా జిల్లాలలో కలిపి ఆరు నేరాలను చేసి ఆ చోరి సొత్తును ఈ జ‌న‌వ‌రి 9న అమ్ముకుని జాల్సలు చేద్దామనే ఉద్దేశంతో అమ్మ‌కానికి బ‌య‌లుదేరారు. 
 
 
గన్నవరం సెయింట్ జోన్స్ స్కూల్ వద్ద ఇద్దరు వ్యక్తులు సుజికీ యాక్సిస్ బండిపై వెళుతున్న నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా, నిందితులు ఒంటరిగా నడుచుకుంటూ వెళుతున్న మహిళలను టార్గెట్ చేసుకుని చైన్స్నాచింగ్లకు పాల్పడుతున్నట్లు అంగీకరించారు. నిందితుల వద్ద నుండి చోరీ సొత్తు సుమారు రూ.4,22,000/- విలువైన 188 గ్రాముల బంగారం, నేరాలు చేయడానికి ఉపయోగించే బండిని స్వాధీనం చేసుకున్నారు. 

 
నిందితులను అరెస్టు చేయడంలో ప్రతిభ కనబరిచిన ఈస్ట్ డివిజన్ ఎ.సి.పి. విజయ పాల్, గన్నవరం ఇన్స్పెక్టర్ కె.శివాజి, క్రైమ్ ఎస్.ఐ. ఫ్రాన్సిస్,  వారి సిబ్బందిని నగర పోలీస్ కమీషనర్ అభినందించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భారత Fastest Charging 5జీ స్మార్ట్‌ఫోన్ : షియోమీ 11ఐ విడుదల