Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వనితకు అమ్మిరెడ్డితో ముందే పెళ్లైంది.. నా బిడ్డను తీసుకొచ్చేయండి: విజయ్ సాయి

కమెడియన్ విజయ్ సాయి ఆత్మహత్యకు ముందు తీసిన సెల్ఫీ వీడియోలో వనిత గురించి అనేక నిజాలు వెల్లడించాడని తెలుస్తోంది. ఆ సెల్ఫీ వీడియోలో వనిత మంచిది కాదని.. వాళ్లు వ్యభిచారం చేసేవారని పెళ్లి తర్వాత తెలిసిందని

Advertiesment
వనితకు అమ్మిరెడ్డితో ముందే పెళ్లైంది.. నా బిడ్డను తీసుకొచ్చేయండి: విజయ్ సాయి
, శనివారం, 16 డిశెంబరు 2017 (13:17 IST)
కమెడియన్ విజయ్ సాయి ఆత్మహత్యకు ముందు తీసిన సెల్ఫీ వీడియోలో వనిత గురించి అనేక నిజాలు వెల్లడించాడని తెలుస్తోంది. ఆ సెల్ఫీ వీడియోలో వనిత మంచిది కాదని.. వాళ్లు వ్యభిచారం చేసేవారని పెళ్లి తర్వాత తెలిసిందని విజయ్ వాపోయాడు. 
 
వనిత అసలు పేరు వరలక్ష్మి. స్కూల్ సర్టిఫికెట్‌లో తండ్రి పేరు ఒకలా ఉంటే.. పాస్‌పోర్ట్‌లో మాత్రం మరో పేరు ఉంది. అదేవిధంగా వనిత తల్లి ప్రస్తుతం రఫీ అనే వ్యక్తితో సహజీవనం చేస్తుందని పోలీసులు గుర్తించిన నేపథ్యంలో.. వనిత చేతిలో మోసపోయానని విజయ్ తెలిపాడు. ప్రేమ పేరుతో తనను బుట్టలో వేసుకుని పాప పుట్టాక తనకు దూరమైందని చెప్పుకొచ్చాడు. 
 
వనిత తల్లి, వనితలు వ్యభిచారం చేస్తున్నారని.. అలాంటి వారి వద్ద తన కుమార్తె పెరగడం ఇష్టం లేదని విజయ్ సాయి సెల్ఫీ వీడియోలో తెలిపాడు. వాల్‌ పోస్టర్‌ సినిమా షూటింగ్‌లో వనిత తనకు పరిచయమైంది. పెళ్లైన తర్వాత ఆమె నిజస్వరూపం తనకు తెలిసిందన్నాడు. 
 
పారిశ్రామివేత్త సీవీ రావు, శశిధర్‌ వ్యాపార అవకాశాల కోసం వనితను ఉపయోగించుకున్నారు. ఆ విషయం తెలిసినప్పటి నుంచి గొడవలు మొదలయ్యాయి. తన కూతురిని కూడా చూడనివ్వలేదని.. రూ.3కోట్లు ఇవ్వకుంటే తనకు సంబంధించిన వీడియోలు బయటపెడతానని అడ్వకేట్ శీను వేధించాడని విజయ్ సాయి చెప్పుకొచ్చాడు. 
 
వనితకు గతంలో అమ్మిరెడ్డి అనే వ్యక్తితో పెళ్లైంది. వనిత, ఆమె తల్లి ప్రవర్తన మంచిది కాదని వాళ్ల సొంతూరుకు వెళ్తే తెలిసింది. వనితలాంటి వారిని వదిలిపెట్టొద్దు. తన కూతురు కుందనను అలాంటి వాతావరణంలో పెంచవద్దని.. తండ్రిని విజయ్ ఆ వీడియోలో కోరాడు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కోల్ స్కామ్ : మాజీ సీఎం మధుకోడాకు జైలుశిక్ష