Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఇది చూస్తే రెండు చేతులెత్తి శ్రీవారికి నమస్కరిస్తాం!

ఒక్కొక్కరికి ఒక్కో అభిరుచి ఉంటుంది. ఈ అభిరుచిని కొందరు జీవితాంతం కొనసాగిస్తే మరికొంతమంది మధ్యలో వదిలేస్తుంటారు. కానీ, తిరుపతికి చెందిన ఒక వ్యక్తి మాత్రం నాణేల సేకరణను నిర్విరామంగా కొనసాగిస్తున్నారు.

ఇది చూస్తే రెండు చేతులెత్తి శ్రీవారికి నమస్కరిస్తాం!
, ఆదివారం, 17 సెప్టెంబరు 2017 (14:36 IST)
ఒక్కొక్కరికి ఒక్కో అభిరుచి ఉంటుంది. ఈ అభిరుచిని కొందరు జీవితాంతం కొనసాగిస్తే మరికొంతమంది మధ్యలో వదిలేస్తుంటారు. కానీ, తిరుపతికి చెందిన ఒక వ్యక్తి మాత్రం నాణేల సేకరణను నిర్విరామంగా కొనసాగిస్తున్నారు. అభిరుచికి ఆధ్మాత్మికను జతచేసి వడ్డీకాసుల వారిని కొలుస్తున్నారు ఆ వ్యక్తి. ఇంతకీ ఎవరా వ్యక్తి. 
 
ఆయన వయసు 80 యేళ్లు. ఈ వయసులో కూడా ఏదో ఒకటి చేయాలన్న తపన మాత్రం తగ్గలేదు. ఆయన పేరు భాస్కర్ నాయుడుకు. సరిగ్గా 30 సంవత్సరాల క్రితం ఒక వ్యక్తి స్ఫూర్తితో నాణేల సేకరణను ప్రారంభించాడు. రాతియుగం నుంచి నేటి ఆధునిక ప్రపంచం వరకు లభ్యమైన వివిధ రకాల నాణేలను సేకరించడమే కాకుండా వాటితో తిరుమలేశుని రూపాన్ని తయారుచేశారు. 
 
అలా ఆ కాసుల దేవుడికి పూజలు చేస్తున్నారు భాస్కర్ నాయుడు. శ్రీనివాసుని ఆపాదమస్తకం ఆయా రూపాల్లోని నాణేలతో అలంకరించి  ఆరాధిస్తున్నారు ఈ పరమ భక్తుడు. సుప్రభాత సేవ నుంచి ఏకాంత సేవ వరకు స్వామివారికి జరిగే కైంకర్యాలను వివరించేలా రూపొందించిన పాటలను వినిపిస్తుంటారు. 
 
తామరపువ్వులు, కత్తి, నాగపడగలు, పండ్లు, పువ్వులు, వివిధ దేశాల నాణేలను ఉపయోగించి శ్రీవారి ప్రతిరూపాన్ని అపురూపంగా తీర్చిదిద్దారు. అరుదైన నాణెం లభిస్తుందంటే విదేశాలకు సైతం వెళ్ళి ఎంతటి వ్యయప్రయాసలకైనా ఓర్చి సేకరిస్తున్నారు. రాయలకాలం నాటి నాణేలతో పాటు వివిధ దేశాల్లో చలామణిలో ఉన్న పురాతన నాణేలను సేకరించారు. ఒక్కొక్కరికి ఒక్కో అలవాటు ఉంటుంది.. నాకు మాత్రం నాణేలను సేకరించడమే అలవాటంటున్నారు భాస్కర్ నాయుడు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తిరుపతిలో అమ్మాయిలు ఎంత చురుగ్గా ఉన్నారో చూడండి..