Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తిరుపతిలో అమ్మాయిలు ఎంత చురుగ్గా ఉన్నారో చూడండి..

పరిశుభ్రతే ప్రధానమంటూ యువకులందరూ కదం తొక్కారు. చేయి చేయి కలిపి స్వచ్ఛతను చేకూర్చడంతో పాటు అడుగులో అడుగేస్తూ పరిశుభ్రత వైపు పయనమయవుతున్నారు. స్వచ్ఛ భారత్ కలను సాకారం చేయడంలో భాగంగా స్వచ్ఛతే సేవ కార్యక్

Advertiesment
తిరుపతిలో అమ్మాయిలు ఎంత చురుగ్గా ఉన్నారో చూడండి..
, ఆదివారం, 17 సెప్టెంబరు 2017 (14:27 IST)
పరిశుభ్రతే ప్రధానమంటూ యువకులందరూ కదం తొక్కారు. చేయి చేయి కలిపి స్వచ్ఛతను చేకూర్చడంతో పాటు అడుగులో అడుగేస్తూ పరిశుభ్రత వైపు పయనమయవుతున్నారు. స్వచ్ఛ భారత్ కలను సాకారం చేయడంలో భాగంగా స్వచ్ఛతే సేవ కార్యక్రమాన్ని తిరుపతి నగర పాలక సంస్థ అధికారులు ఘనంగా నిర్వహించారు.
 
పరిశుభ్రతే అన్నింటికి ప్రధానమని దానిని అలవరుచుకోవడం కోసం అందరిలో అవగాహన కల్పించాలని కోరారు. స్వచ్ఛత కోసం ఒక్కటడుగు అంటూ నినదిస్తూ ముందుకు కదిలారు. పరిశుభ్రతను ఏ విధంగా పాటించాలో తెలియజేస్తూ ప్లకార్డులు పట్టుకుని నిర్వహించిన హాఫ్‌ మారథాన్ అందరినీ ఆకట్టుకుంది.
 
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపుతో స్వచ్ఛ భారత్‌కు ఏ విధంగా అయితే స్పందన లభించిందో అలాంటి కార్యక్రమాన్నే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీసుకున్నారు. స్వచ్ఛతే సేవ పేరుతో మన నగరాన్ని మనం స్వచ్ఛంగా ఉంచాలంటూ ముఖ్యమంత్రి ఇచ్చిన పిలుపుతో తిరుపతి నగర పాలక సంస్థ హాఫ్‌ మారథాన్ కార్యక్రమాన్ని తిరుపతిలో నిర్వహించింది. 
 
తారకరామ స్టేడియంలో జరిగిన హాఫ్‌ మారథాన్‍‌‌లో 7 వేల మందికి పైగా యువతీ, యువకులు ఉల్లాసంగా ఉత్సాహంగా మారథాన్‌లో పాల్గొన్నారు. స్వచ్ఛత కోసం అడుగు వేయడమేకాకుండా ఆరోగ్యం కోసం కూడా నడవాలంటూ యువతీయువకులు పిలుపునిచ్చారు.
 
21కె, 10కె, 5కె రన్‌లు నిర్వహించారు. చిరుజల్లులు పడుతున్నా లెక్క చెయ్యకుండా మారథాన్‌‌లో పాల్గొన్నారు. మారథాన్‌లో పాల్గొనే వారిని ఉత్సాహపరుస్తూ పలు సినిమాల్లోని పాటలకు డ్యాన్సులు వేశారు. 
 
చిత్తూరు జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న, నగర పాలక సంస్థ కమిషనర్ హరికిరణ్‌, ఎస్పీ మహంతి, ఎంపీ వరప్రసాద్‌లు మారథాన్‌లో పాల్గొన్నారు. ఉదయం 5 గంటల నుంచి 9 గంటల వరకు హాఫ్ మారథాన్ జరిగింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

'నేనొక ఎంపీని.. టోల్‌ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు' : బీజేపీ ఎంపీ