Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తమిళనాడులో రోడ్డు ప్రమాదం.. గుంటూరు వాసుల దుర్మరణం

తమిళనాడు రాష్ట్రంలోని తిరునెల్వేలిలో శనివారం ఉదయం ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో గుంటూరు జిల్లాకు చెందిన ఐదుగురు ప్రయాణికులు దుర్మరణం పాలయ్యారు. వీరంతా పొన్నూరు మండలం కొల్లూరు వాసులుగా పోలీసు

Advertiesment
తమిళనాడులో రోడ్డు ప్రమాదం.. గుంటూరు వాసుల దుర్మరణం
, శనివారం, 16 సెప్టెంబరు 2017 (11:43 IST)
తమిళనాడు రాష్ట్రంలోని తిరునెల్వేలిలో శనివారం ఉదయం ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో గుంటూరు జిల్లాకు చెందిన ఐదుగురు ప్రయాణికులు దుర్మరణం పాలయ్యారు. వీరంతా పొన్నూరు మండలం కొల్లూరు వాసులుగా పోలీసులు గుర్తించారు. 
 
ఆగి ఉన్న బస్సును అత్యంత వేగంగా వచ్చిన లారీ ఒకటి వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. 
 
సంఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని.. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బాబ్రీ, రామ‌జ‌న్మ భూమి వివాదం : ప్రధాన పిటీషన్‌దారుడు మృతి