Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తిరుమల: లోయలో దూకేసిన భక్తుడు.. అతనికి ఏమైందంటే? (video)

Advertiesment
Tirumala

సెల్వి

, బుధవారం, 16 జులై 2025 (18:11 IST)
Tirumala
తిరుమలలో ఓ భక్తులు లోయలో దూకి కలకలం రేపాడు.  తిరుమల అవ్వాచారి కోన వద్ద ఓ వ్యక్తి అర్ధరాత్రి సమయంలో లోయలోకి దూకాడు.ఇది గమనించిన కొందరు భక్తులు వెంటనే తిరుమల విజిలెన్స్ అధికారులకు సమాచారం అందించారు. దీంతో అప్రమత్తమైన అధికారులు తక్షణమే సంఘటనా స్థలానికి చేరుకుని.. లోయలో పడిన వ్యక్తిని బయటకు తీసి ఆస్పత్రిలో అడ్మిట్ చేశారు. అతడు కడప జిల్లాకు చెందిన దోర్నపాడు గ్రామానికి చెందిన బోయ మాధవ రాయుడు అని గుర్తించారు.
 
ప్రమాదం వల్ల అతనికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నాడు. అయితే అతడు లోయలోకి ఎందుకు దూకాడన్న విషయం ఇంకా తెలియరాలేదు. సంఘటనకు గల కారణాలపై పోలీసులు విచారణ చేపట్టారు. ఇదే సమయంలో భక్తులు తిరుమల వెళ్లే నడకదారిలో మరింత జాగ్రత్తగా ఉండాలని విజిలెన్స్ అధికారులు సూచిస్తున్నారు. 
 
తిరుమల శ్రీవారిని దర్శించుకునే భక్తులకు ప్రధాన నడక మార్గాలలో ఒకటైన అలిపిరి నుంచి తిరుమల వరకు ఉన్న మార్గంలో అవ్వాచారి కోన ప్రాంతం ఓ కీలకమైన దారిగా ఉంది. రోజూ వేలాది మంది భక్తులు ఈ మార్గంలో నడిచి స్వామివారి దర్శనానికి చేరుకుంటారనే సంగతి తెలిసిందే.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భారతదేశ ఎలక్ట్రానిక్స్ రంగంలో 2025-26 ఎడిషన్లకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపికైన క్రికెట్ ఐకాన్ రోహిత్ శర్మ