Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

త్వరలో వైసీపీలోకి ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేలు?

త్వరలో వైసీపీలోకి ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేలు?
, మంగళవారం, 26 మే 2020 (08:48 IST)
ప్రకాశం జిల్లాలో ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేలు వైసిపి తీర్థం పుచ్చుకోనున్నారా? వైసిపి తలపెట్టిన 'ఆపరేషన్‌ ఆకర్ష్‌'లో భాగంగా ఈనెల 30న ఇందుకు ముహూర్తం ఖరారు అయిందా? రాష్ట్రంలో వైసిపి రాజకీయ సమీకరణాలు, ప్రకాశం జిల్లాలో ప్రస్తుతం చోటుచేసుకుంటున్న రాజకీయ పరిస్థితులు చూస్తుంటే అవుననే తెలుస్తోంది.

ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రమాణం చేసి మే 30 తేదీ నాటికి ఏడాది అవుతుంది. అదే రోజు నాటికి ప్రకాశం జిల్లాలో ఉన్న ముగ్గురు ఎమ్మెల్యేలనూ వైసిపిలోకి లాక్కుంటే జిల్లాలో టిడిపి మొత్తం ఖాళీ అవుతుంది అని వైసిపి వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. గత ఎన్నికల్లో టిడిపికి 23 స్థానాలు వచ్చిన సంగతి తెలిసిందే..

అందులోనూ ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్యేలు జంప్‌ అయ్యారు. మరో ముగ్గురిని వైసిపి తీర్థం పుచ్చుకునేలా చేస్తే శాసన సభలో టిడిపికి ప్రతిపక్ష హోదా కూడా ఉండదు. అందులో భాగంగానే జిల్లాలోని టిడిపి ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులకు గాలం వేస్తూ వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది.

అందుబాటులో, టచ్‌లో ఉన్న టిడిపి నేతలతో మంతనాలు మొదలుపెట్టినట్లు సమాచారం. ఇప్పటికే జిల్లాలోని ప్రముఖ టిడిపి నేత, చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం తన కుమారుడు కరణం వెంకటేష్‌ను ఇటీవల వైసిపిలో చేర్పించారు. సిఎం జగన్‌మోహన్‌ రెడ్డి సమక్షంలో దగ్గరుండి మరీ వైసిపి కండువా కప్పించారు. అప్పటి ఉంచి టిడిపి కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వైసిపికి సన్నిహితంగా ఉంటున్నట్లు వార్తలు కూడా వచ్చాయి.

రాబోయే రోజుల్లో కరణం బలరాం కూడా వైసిపిలోకి వెళ్లిపోతారనే వార్తలూ వచ్చాయి. ఆయనతోనే జిల్లాలోని ప్రముఖ నాయకులను వైసిపిలోకి రప్పించేందుకూ పావులు కదుపుతున్నారు. మరోపక్క వైసిపిలో చేరేందుకు టిడిపి ఎమ్మెల్యేలూ సంకోచిస్తున్నట్లు తెలుస్తోంది. వైసిపిలో చేరాలంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలనే నిబంధన ఉండటంతో ఎటూ తేల్చుకోలేకపోతున్నారు.

టిడిపిలో ఉంటే భవిష్యత్తు ఏంటో అర్థం కావడం లేదని, వైసిపిలో చేరాలంటే ఉన్న ఎమ్మెల్యే పదవినీ పోగొట్టుకోవాలని, ఏం చేయాలో తెలీక తంటాలు పడుతున్నట్తు సమాచారం. మొత్తానికి ఈ నెల 30న ప్రకాశం జిల్లాలో ఎమ్మెల్యేలను వైసిపిలో చేర్చుకొని టిడిపికి గట్టి షాక్‌ ఇచ్చేందుకు వైసిపి అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.

అయితే ఇప్పటికే జిల్లాలోని ఇద్దరు టిడిపి ఎమ్మెల్యేలు ఈ నెల 27న వైసిపి తీర్థం పుచ్చుకునేందుకు ముహూర్తం నిర్ణయించుకున్నట్లు విశ్వసనీయ సమాచారం.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆర్థిక వినాశనం తప్పదంటున్న ఆనంద్ మహీంద్రా!