Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆర్థిక వినాశనం తప్పదంటున్న ఆనంద్ మహీంద్రా!

Advertiesment
ఆర్థిక వినాశనం తప్పదంటున్న ఆనంద్ మహీంద్రా!
, మంగళవారం, 26 మే 2020 (08:43 IST)
కరోనా వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేసే చర్యల్లో భాగంగా, గత మార్చి 25వ తేదీ నుంచి దేశం మొత్తం లాక్డౌన‌లో వుంది. ప్రస్తుతం నాలుగో దశ లాక్డౌన్ కొనసాగుతోంది. ఇది ఈ నెల 31వ తేదీ అర్థరాత్రితో ముగియనుంది. ఈ లాక్డౌన్ కారణంగా జనజీవనంతోపాటు ప్రతి రంగం స్తంభించిపోయింది. ఫలితంగా ఆర్థిక వ్యవస్థ కుదేలైంది. ఈ క్రమంలో మరోమారు లాక్డౌన్ పొడగించే అవకాశాలు ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. వీటిపై ప్రముఖ పారిశ్రామికవేత్త, మహీంద్రా గ్రూపు సంస్థ అధిపతి ఆనంద్ మహీంద్రా స్పందించారు. మరోమారు లాక్డౌన్ పొడగిస్తే ఆర్థిక వినాశనం తప్పదంటూ హెచ్చరించారు. 
 
ఇదే అంశంపై ఆయన ఓ ట్వీట్ చేశారు. మరోమారు లాక్డౌన్ పొడిగింపు వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని కుండబద్దాలు. లాక్డౌన్‌ను పొడిగిస్తే కనుక దాని ప్రతికూల ప్రభావం ప్రజల మానసిక ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుందని, కోవిడ్‌యేతర రోగులు తీవ్ర నిర్లక్ష్యానికి గురయ్యే అవకాశం ఉందంటూ గతంలో ఆయన చేసిన ట్వీట్లను గుర్తు చేశారు. 
 
లాక్డౌన్ పొడిగింపు వల్ల వైద్యపరమైన సంక్షోభం కూడా తలెత్తే అవకాశం ఉందన్నారు. లాక్డౌన్ పొడిగింపు వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదని ఆనంద్ మహీంద్రా గతంలోనూ పేర్కొన్నారు. సమగ్రమైన విధానాన్ని రూపొందించి లాక్డౌన్ ఎత్తివేయడమే మేలని ఆయన సూచించారు. నిజానికి ఈ నాలుగో దశ లాక్డౌన్‌లోనే కేంద్ర ప్రభుత్వం పలు ఆంక్షలను సరళతరం చేసింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఖాతాబుక్ రూ. 454 కోట్ల నిధుల సేకరణతో దక్షిణ భారతదేశం ఎంఎస్ఎంఇలకు లాభం