శ్రీకాళహస్తి దేవస్థానం సెక్యూరిటీ గార్డులకు జీతం లేదు

సోమవారం, 6 జనవరి 2020 (16:51 IST)
చిత్తూరుజిల్లా శ్రీకాళహస్తి దేవస్థానం సెక్యూరిటీ విభాగంలో పనిచేస్తున్న సెక్యూరిటీ గార్డులకు నాలుగు నెలలుగా జీతం ఇవ్వలేదంటూ ఆలయంలోని కార్యనిర్వహణ అధికారి కార్యాలయం వద్ద సెక్యూరిటీ గార్డులు నిరసన తెలియజేసారు. 
 
అనంతరం ఆలయసెక్యూరిటీ గార్డులు మాట్లాడుతూ తాము ప్రైవేటు సంస్థనుంచి 150 మంది సెక్యూరిటీ గార్డులుగా ఈ దేవస్థానంలో పనిచేస్తున్నామని దాదాపుగా  నాలుగునెలల నుంచి జీతబత్యాలు ఇవ్వకపోవడంతో 
మా కుటుంబాలు ఆకలితో అలమటిస్తున్నాయి అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
 
తమ జీతాలను ఇవ్వమంటూ అటు తమ సంస్థ ఉన్నత ఉద్యోగుల కోరిన ఇటు ఆలయ అధికారాలను కోరిన మొండిచేయి చూపిస్తున్నారని దీంతో పండుగ దినాన కూడా పస్తుఉండవలసి  పరిస్థితి తమకు ఏర్పడిందని అంటూ ఆలయం వద్ద నిరసన తెలియజేస్తూ సెక్యూరిటీ గార్డులు తమ ఆవేదన వ్యక్తం చేశారు.

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం అమరావతి పోరాటానికి విరాళాల వెల్లువ