Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బొగ్గు సంస్థలకు డబ్బు చెల్లించనందునే రాష్ట్రానికి ఈ దుస్థితి: పయ్యావుల కేశవ్

బొగ్గు సంస్థలకు డబ్బు చెల్లించనందునే రాష్ట్రానికి ఈ దుస్థితి: పయ్యావుల కేశవ్
, శనివారం, 9 అక్టోబరు 2021 (21:26 IST)
మంచివర్షాకాలంలో, రిజర్వాయర్లలో నీరు సమృద్ధిగా ఉన్నతరు ణంలో లోడ్ రిలీఫ్ లపేరుతో విద్యుత్ కోతలకు కారణం ముమ్మాటి కీ అధికారయంత్రాంగమేనని,ఆర్థిక రంగాన్ని ఏవిధంగా అయితే దెబ్బతీశారో, విద్యుత్ రంగాన్నికూడాకోలుకోలేని సంక్షోభంలోకి నెట్టివేశారని టీడీపీ రాష్ట్రప్రధాన కార్యదర్శి, శాసనసభ్యులు పయ్యావులకేశవ్ తెలిపారు. శనివారం ఆయన విజయవాడలో విలేకరులతో మాట్లాడారు. 
 
ఆ వివరాలు ఆయన మాటల్లోనే క్లుప్తంగా మీకోసం... "విద్యుత్ కోతల్లో అధికారులపాత్ర ప్రధానంగాఉందని, జగన్మోహన్ రెడ్డితో టీడీపీప్రభుత్వంలో జరిగిన పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లపై, అర్థ సత్యాలు, అసత్యాలు పలికించి, ఆయనకు తప్పుడుసమాచారమి చ్చింది అధికారయంత్రాంగమే. ప్రభుత్వం ప్రధానమంత్రికి రాసిన లేఖలో కూడా అర్థసత్యాలు, అసత్యాలే ఉన్నాయి.

రాష్ట్రంలో విద్యు త్ ఉత్పత్తికి అవసరమైన బొగ్గునిల్వలు లేవని, ఆర్టీపీపీ, విజయ వాడ థర్మల్ పవర్ స్టేషన్ వంటిని పనిచేసే స్థితుల్లో లేవని లేఖలో రాసి,ప్రధానిని కాపాడమంటున్నారు. ప్రభుత్వ చేతగానితనం, ముందుచూపులేని తనానికి ప్రధాని ఎలా స్పందిస్తారు? మిగులు విద్యుత్ లో ఉన్నరాష్ట్రం ఈ విధమైన స్థితికిరావడానికి, ఈ ప్రభుత్వానికి ముందుచూపులేనితనమే కారణం.

రాయలసీమపెద్ద లుసాధించుకున్న సీమథర్మల్ పవర్ స్టేషన్ ను 50శాతం సామర్థ్యంతోనే ప్రభుత్వం నిర్వహిస్తోంది. అలానే వీటీపీఎస్ ను దిగ జార్చింది. రాష్ట్రంలోని థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్ని మూసివేత దిశగా తీసుకెళ్లి, ప్రైవేట్ సంస్థలనుంచి విద్యుత్ కొనాల నేదుర్మార్గపు ఆలోచనలో ప్రభుత్వం ఉంది. రాష్ట్రంలో బొగ్గు సరఫ రాఎందుకులేకుండా పోయింది? ఒక్కసారిగా  థర్మల్ విద్యుత్ ఉత్పత్తి పెరిగిందా?

ముందుచూపు లేకుండా, బొగ్గుఉత్పత్తి సంస్థలకు డబ్బు చెల్లించనందునే రాష్ట్రానికి ఈ దుస్థితి వచ్చింది నిజం కాదా? హిందూజాస్, కృష్ణపట్నం పవర్ ధర్మల్ ప్లాంట్లు, 6నెలలు గా విద్యుత్ ఉత్పత్తి నిలిపేయడానికి కారణం ఈప్రభుత్వంకాదా? ఆయా సంస్థలనుంచి విద్యుత్ కొనకుండా, కమీషన్లకోసం ప్రైవేట్ సంస్థలనుంచి అధికధరకు విద్యుత్ కొంటున్నారు. దీనిపై పాలకు లు, అధికారులు ఏంసమాధానంచెబుతారు?

రాష్ట్ర అవసరాల కోసం, రాష్ట్రంలోపెట్టుబడులు పెట్టిన విద్యుత్ ఉత్పత్తి సంస్థలను నీరుగార్చేలా ప్రభుత్వచర్యలున్నాయి. రాష్ట్రంలోని విద్యుత్ సంస్థ లనుంచి ప్రభుత్వం ఎప్పుడైతే పవర్ కొనడం మానేసిందో, అప్పుడే సదరుసంస్థలు విద్యుత్ ఉత్పత్తి నిలిపేసి, విదేశాలనుంచి బొగ్గును కొనడం ఆపేశాయి. సదరుసంస్థల నిర్వాకంతో ప్రభుత్వానికి కను విప్పు కలిగి, ఇప్పుడుఆదరబాదరాగా ప్రధానికి లేఖరాసింది. 

రాష్ట్రంలో పవనవిద్యుత్ ఉత్తత్తికూడా ఎప్పటినుంచోఉంది. కానీ దాన్నికూడా ఈప్రభుత్వం ఆపేసింది. అదేసమయంలో పవర్ ఎక్సేంజ్ లనుంచి విద్యుత్ కొనడానికి సిద్ధమయ్యారు. రాష్ట్రంలో ఉత్పత్తయ్యే విద్యుత్ ను కొనకుండా, బయటి రాష్ట్రాలకుచెందిన విద్యుత్ ఉత్పత్తి సంస్థలనుంచి విద్యుత్ కొనడం, అవినీతికిందకు  రాదా? ప్రభుత్వంచేస్తున్న తప్పిదాలు, శాపాలకు ప్రజలు బలైపో వాలా అనిప్రశ్నిస్తున్నాం.

ప్రధానికిరాసిన లేఖలో 8వేల మెగావాట్ల పవన విద్యుత్ తమవద్ద సిద్ధంగాఉందని, అందుకే థర్మల్ కేంద్రా లనుంచి విద్యుత్ కొనలేకపోతున్నామన్నారు. అలాంటప్పుడు అదానీ సంస్థనుంచి 10వేలమెగావాట్ల విద్యుత్ కొనడానికి, రాష్ట్ర ప్రజలపై రూ.50వేలకోట్ల అదనపు భారంవేయడానికి, ఈప్రభుత్వం ఎందుకు సిద్ధమైందో సమాధానంచెప్పాలి. ప్రభుత్వం,ప్రదానికి రాసిన లేఖలోనే అనేక అంశాలు పొంతనలేకుండా ఉన్నాయి. 

గతంలో చంద్రబాబునాయుడుచేసుకున్న విద్యుత్ ఒప్పందాలు అన్నీ తప్పని ఈప్రభుత్వం గగ్గోలుపెట్టింది. మరిప్పుడు ప్రధానికి రాసిన లేఖలో ఆనాటిప్రభుత్వంచేసుకున్న ఒప్పందాలవల్లే తాము విద్యుత్ అందించలేకపోతున్నామన్నారు. 8వేల మెగావాట్ల పవన్ విద్యుత్ ఉందన్నవారు. 10వేలమెగావాట్ల విద్యు త్ అదానీ సంస్థనుంచి ఎందుకుకొనడానికి సిద్ధమవుతున్నారో కూడాప్రజలకు సమాధానంచెప్పాలి. 

విద్యుత్ రంగసంస్థల డిస్ట్రిబ్యూషన్ కంపెనీల ఆర్థికపరిస్థితి ఎందు కు దిగజారిందో కూడాప్రభుత్వమే చెప్పాలి. విద్యుత్ వినియోగదారులు బిల్లులతాలూకా సొమ్ముచెల్లించడం ఆపేశారా? పైసాతో సహా వారినుంచి వసూలుచేస్తున్నారు కదా.. ఆసొమ్మం తా ఏమవుతోంది. ఏపీఈఆర్ సీ నిర్ణయించిన ధరప్రకారం వినియో గదారులనుంచి ముక్కుపిండిమరీ వసూలుచేస్తున్నారు. అలాంట ప్పుడు డిస్ట్రిబ్యూషన్ కంపెనీలకు ఎందుకునష్టమొస్తుంది? కొను గోలు చేస్తున్న విద్యుత్ తాలూకా సొమ్ముని కూడా ప్రభుత్వం సదరు సంస్థలకు చెల్లించడంలేదు.

కనీసం 50శాతం సొమ్మునైనా విద్యుత్ ఉత్పత్తి సంస్థలకు చెల్లించాలి న్యాయస్థానం ఆదేశించినా ప్రభుత్వం ఆపనిచేయలేదు. మరి అలాంటప్పుడు డిస్ట్రిబ్యూషన్ కంపెనీలకు నష్టాలు ఎందుకొస్తున్నాయో అధికారులు సమాధా నం చెప్పాలి. ప్రభుత్వం సదరు సంస్థలకు ఇవ్వాల్సిన సబ్సిడీలు ఇవ్వనందునే అవి నష్టాల్లోఉన్నాయి. ఆ భారాన్నికూడా ట్రూఅప్ ఛార్జీలపేరుతోప్రజలపైనే మోపారు.

డిస్ట్రిబ్యూషన్ కంపెనీలకు ప్రభుత్వం చెల్లించాల్సిన రూ.12వేలకోట్లుచెల్లించనందున, దాదాపు రూ.20వేలకోట్లవరకు ప్రభుత్వం బకాయిఉంది. ఈ విధంగా ప్రభుత్వం తనఅసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి ఆ భారాన్ని కూడా ట్రూఅప్ ఛార్జీలపేరుతోప్రజలపైనే వేసింది. 

విద్యుత్ ఉత్పత్తి కంపెనీలు ఎన్ సీఎల్ టీ (సామాన్యుడిభాషలో దాని అర్థం దివాలా) కి వెళ్తాయనికూడా ప్రభుత్వం లేఖలో చెప్పిం ది. సదరుకంపెనీలు దివాలాతీయడానికి కారణమే ప్రభుత్వం. తెలుగుదేశం ప్రభుత్వీం తీసుకున్ననిర్ణయాలు తప్పనిచెప్పడానికి, ఈ ప్రభుత్వం తీసుకున్న తలతిక్కనిర్ణయాలే విద్యుత్ ఉత్పత్తి, పంపిణీ సంస్థలు దెబ్బతినడానికి కారణమనిచెప్పడంలో ఎలాంటి సందేహంలేదు.

తాను, తనప్రభుత్వం చేస్తున్న తప్పులను ముఖ్యమంత్రి కళ్లుతెరిచిచూడాలి. ఏపీఈఆర్ సీ రెగ్యులేషన్ యాక్ట్ చట్టంప్రకారం, ప్రభుత్వం ఏవైనా సబ్సిడీలు ఇవ్వాలి అనుకుంటే, దాన్ని ముందుగానే డిస్కంలకు చెల్లించాలి. రూ.12వేలకోట్ల బకాయిలు ప్రభుత్వంఉంటే,ఏపీఈఆర్ సీ వాటిని ప్రభుత్వంనుంచి ముక్కుపిండిఎందుకు వసూలుచేయడంలేదు. సామాన్యులపై ట్రూఅప్ ఛార్జీల పేరుతో రెండింతలభారంవేయడానికి సిద్ధమైన ఏపీ ఈఆర్ సీ, ప్రభుత్వాన్ని మాత్రం బకాయిలపైఎందుకు నిలదీయడం లేదు?

కనీసం బకాయిలుచెల్లించమనే ఆదేశాలుకూడా ఇవ్వ లేని దుస్థితిలో ఈఆర్సీ ఎందుకుంది? తక్షణమే ఏపీఈఆర్ సీ బకాయిలపై ప్రభుత్వాన్ని ఆదేశించాలని డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వం రాసిన లేఖలో విద్యుత్ వినియోగం అమాంతం పెరిగింద ని కూడా చెప్పారు. సాధారణంగా ప్రజలద్వారా పెరిగే వినియోగా న్నికూడా భూతద్దంలో చూపతున్నారు. రిజర్వాయర్ల నిండా నీరున్న తరుణంలో వ్యవసాయవిద్యుత్ వాడకం కూడా బాగా తగ్గి తే, ఒక్కసారిగా రాష్ట్రంలో విద్యుత్ వినియోగం ఎలా పెరిగిందో  సమాధానంచెప్పాలి.

పవర్ ఫర్ ఆల్ ఒప్పందాన్ని ప్రభుత్వం ఏం చేసింది? 2015 నుంచి 2024వరకు విద్యుత్ వినియోగం పెరగబో తోందని పవర్ ఫర్ ఆల్ ఒప్పందంలో ప్రభుత్వమే కేంద్రంతో చెప్పిం ది. దానికంటే భిన్నంగా, రోజూజరిగే వినియోగంకంటే అధికంగా ఏమీ ఏపీలో విద్యుత్ వాడకం పెరగలేదుకదా? రాత్రికిరాత్రేమీ విద్యుత్ వాడకం అమాంతంపెరిగింది లేదు. కానీ ప్రభుత్వం దానిపైకూడా అబద్ధాలుచెబుతోంది. హిందూజా, కృష్ణపట్నం వంటి విద్యుత్ ఉత్పత్తిసంస్థల గొంతుపిసికి ప్రభుత్వంచంపేయబట్టే, ఈ పరిస్థితి తలెత్తింది.

కేవలం ఈగో కోసం, కసితో, కోపంతో ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయాలే ప్రజలకు శాపంగా మారాయి. ప్రభుత్వనిర్ణయాలతో కుదేలైన విద్యుత్ రంగాన్ని కాపాడలంటూ ఆనెపాన్ని కేంద్రంపై నెట్టేసే ప్రయత్నంచేయడం ప్రభుత్వానికి తగ దని సూచిస్తున్నాం. విద్యుత్ ఉత్పత్తికి అవసరమైన బొగ్గుని సింగ రేణి నుంచి ఏపీప్రభుత్వం ఎందుకు  తెచ్చుకోలేకపోతోంది? తెలం గాణప్రభుత్వంతో, ఈముఖ్యమంత్రికి మంచిసంబంధాలే ఉన్నాయి కదా?

ఎందుకంటే  ఈప్రభుత్వ ఆలోచనాధోరణి మారింది. జరిగిన తప్పిదాలకు ప్రభుత్వమే బాధ్యతవహించాలిగానీ, ప్రధానికి లేఖ రాసి చేతులుదులుపుకుంటామంటే సరిపోదు. రాష్ట్రంలో విద్యుత్ రంగం ఎలా కునారిల్లుతోందో ప్రధానికి రాసిన లేఖేస్పష్టం చేస్తోంది. ప్రభుత్వ లేఖలోనే చాలా స్పష్టంగా ఏపీ విద్యుత్ రంగంఎలా సంక్షో భంలోకి వెళ్లబోతోందో చెప్పకనే చెప్పింది. దేశానికే ఆదర్శంగా నిలిచిన రాష్ట్ర డిస్కం లు, ఈనాడు ఇలా తయారవడానికి ఈ ప్రభుత్వ విధానాలే కారణం. ప్రభుత్వం, డిస్కంలకు చెల్లించాల్సిన రూ.12వేలకోట్ల బకాయిలు తక్షణమే చెల్లించేఈ ఈఆర్ సీ వెంటనే ఆదేశాలివ్వాలని డిమాండ్ చేస్తున్నాం.

తరువాతనే సామాన్యుడి పై ట్రూఅప్, ట్రూడౌన్ ఛార్జీలు వేసే నిర్ణయాల గురించిఆలోచించాలి  ప్రభుత్వానికి ఒక న్యాయం, సామాన్యుడికి మరోన్యాయం ఏమి టని తాము ప్రశ్నిస్తున్నాం. రాష్ట్రంలోని వనరులను సక్రమంగా సద్వినియోగం చేసుకొనిఉంటే, రాష్ట్రంలో విద్యుత్ రంగం దివాలా తీసే దుస్థితికివచ్చేదికాదు. అలానే సామాన్యప్రజలపై విద్యుత్ ఛార్జీల భారం వేయాల్సిన దుస్థితి తలెత్తేది కాదు. 

విద్యుత్ రంగసంస్థలు కుప్పకూలడానికి సిద్ధంగా ఉన్నాయంటే అందుకు కారణం ఈప్రభుత్వ అనాలోచితచర్యలు, ముందుచూపు లేనితనమే కారణమని మరోసారి స్పష్టంచేస్తున్నాం. చంద్రబాబు నాయడు చేసిన పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లే విద్యుత్ సంస్థలు కుప్ప కూలడానికి కారణమని చెబుతున్న ప్రభుత్వం, 10వేల మెగావాట్ల ను అదానీ సంస్థనుంచి ఎందుకు కొంటోంది?

ఈనాడు ఈ ప్రభు త్వంచేసేది కరెక్ట్ అయితే, ఆనాడు చంద్రబాబుచేసింది కూడా కరెక్టే, దానికి ఈ ప్రభుత్వం ముందుసమాధానంచెప్పాలి. రాష్ట్రాన్ని విద్యుత్ సంస్కరణల్లో దేశానికే రోల్ మోడల్ గానిలిపింది చంద్ర బాబునాయుడి ఆలోచనలు. రాష్ట్ర విద్యుత్ వ్యవస్థ కుప్పకూల డానికి ప్రధానకారణం, అధికారులనిర్ణయాలు, ప్రభుత్వానికి ముం దుచూపులేకపోవడమే. దేశంలో ఆనాడు ఉన్న ధరలకంటే తక్కు వగానే చంద్రబాబునాయుడి హాయాంలో విద్యుత్ కొనుగోలు చేయడం జరిగింది.

ఆనాడు నిర్ణయించిన ధరలు కూడా, చంద్ర బా బునాయుడు అధికారంలోకి రాకపూర్వం అంటే 2015 కంటే ముందు నిర్ణయించినధరలప్రకారమే, విద్యుత్ కొనుగోలు ఒప్పం దాలుచేసుకోవడం జరిగింది. ఆ తరువాత ఈ ఆర్ సీ 12పైసలు మాత్రమే పెంచింది. విద్యుత్ కొనుగోలుకు సంబంధించిన అనేక ముఖ్యమైన ఒప్పందాలన్నీ చంద్రబాబునాయుడు అధికారంలోకి రాకముందు కాంగ్రెస్ ప్రభుత్వాలహయాంలో జరిగినవే.

10వేల మెగావాట్ల విద్యుత్ కొనుగోలుపేరుతో, రాష్ట్రప్రభుత్వం రూ.50వేల కోట్ల భారాన్ని ప్రజలపై అదనంగా వేయడానికి సిధ్ధమైంది. అదానీ సంస్థనుంచి 10వేలమెగావాట్ల కొనుగోలుతాలూకా ఒప్పందాలను ప్రభుత్వం వెంటనే ప్రజలముందుంచాలని డిమాండ్ చేస్తున్నాం. అలానే ప్రభుత్వంచేసుకోబోయే ఒప్పందాలకు విధిగా ఏపీఈఆర్ సీ అనుమతికూడా పొందాలి.

రాష్ట్రంలో బొగ్గులేదనేది అవాస్తవం.. ప్రభుత్వానికి ముందుచూపు లేదనేది వాస్తవం. సింగరేణి సంస్థ కు డబ్బులుచెల్లించమని ప్రభుత్వం మొండికేసింది కాబట్టే, సింగరేణి బొగ్గుసరఫరాచేయమని మొండికేసింది. దానికి  దేశప్రదాని ఎలా కారకులు అవుతారు? బొగ్గుఉత్పత్తి దేశంలో ఎక్కడా నిలిచిపో యిందిలేదు. ప్రధానికిలేఖరాసి, తమబాధ్యత లేదంటూ తమ తప్పులనుంచి తప్పించుకోవాలని ప్రభుత్వంచూస్తోంది. రాష్ట్రంలో విద్యుత్ వినియోగం ఎంతపెరిగిందో, పొరుగునఉన్న తెలంగాణతో ఏపీప్రభుత్వం ఎందుకు సరిపోల్చుకోవడంలేదు?

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏనుగును 15 ముక్కలుగా కట్ చేశారు.. ఎందుకంటే?